Bharateeyudu 3 OTT: కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌కు అవమానం.. తప్పక ఓటీటీలోకి వస్తోన్న‘భారతీయుడు 3’?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bharateeyudu 3 OTT: కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌కు అవమానం.. తప్పక ఓటీటీలోకి వస్తోన్న‘భారతీయుడు 3’?

    Bharateeyudu 3 OTT: కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌కు అవమానం.. తప్పక ఓటీటీలోకి వస్తోన్న‘భారతీయుడు 3’?

    కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన భారతీయుడు చిత్రం గతంలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. దీనికి సీక్వెల్‌ ఈ ఏడాది జులై 12 ‘భారతీయుడు 2‘ రిలీజైంది. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకా దారుణంగా చతికిల పడింది. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా ‘భారతీయుడు 3’ రానుందని సెకండ్‌ పార్ట్‌ క్లైమాక్స్‌లోనే దర్శకుడు శంకర్‌ స్పెషల్‌ ట్రైలర్‌ చూపించి మరీ కన్ఫార్మ్‌ చేశారు. అయితే తాజాగా మూడో పార్ట్‌కు సంబంధించి క్రేజీ బజ్‌ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులోని నిజానిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

    నేరుగా ఓటీటీలోకి ‘భారతీయుడు 3’!

    కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రానున్న మరో చిత్రం ‘భారతీయడు 3’. వీరి కాంబోలో విజయవంతమైన భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా రెండు, మూడు భాగాలను రూపొందించారు. ఈ ఏడాది జులైలో విడుదలైన ‘భారతీయుడు 2’ ప్రేక్షకాదరణ పొందని సంగతి తెలిసిందే. దాంతో మూడో భాగానికి థియేట్రికల్‌ సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. రిస్క్‌ తీసుకునేందుకు థియేటర్‌ వర్గాలు సంసిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడో పార్ట్‌ను నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పాన్‌ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్న శంకర్‌, కమల్‌ హాసన్‌ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకురావడం ఇది వారికి అవమానేమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

    ధ్రువీకరించిన ఓటీటీ వర్గాలు!

    ‘భారతీయుడు 3’ చిత్రం ఓటీటీలోకి రావడం ఖాయమని నెట్‌ఫ్లిక్స్ వర్గాలు సైతం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 2025 జనవరిలో ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే ఛాన్స్‌ ఉందని సమాచారం. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఓటీటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం వెల్లడించనున్నట్లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న ‘భారతీయుడు 2’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో వ్యూస్‌ సాధించలేకపోయింది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఈ సినిమాకు ఆదరణ లభించలేదు. దీంతో ‘భారతీయుడు 3’ ఓటీటీ హక్కులు తక్కువ ధరకే అమ్ముడుపోయే చాన్స్ ఉందని అంటున్నారు. 

    ‘భారతీయుడు 2’పై దారుణమైన ట్రోల్స్‌!

    ‘భారతీయుడు 2’ సినిమాలో 106 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కమల్‌ హాసన్‌ కనిపించారు. ముఖం మెుత్తం ముడతలతో.. పార్ట్ -1 (భారతీయుడు)లోని సేనాపతి కంటే మరింత వయసు మళ్లిన వ్యక్తిగా దర్శకుడు కమల్‌ను చూపించారు. అయితే యంగ్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆ పాత్రతో యాక్షన్స్‌ సీక్వెన్స్‌ చేయించారు డైరెక్టర్ శంకర్‌. వందేళ్లకు పైబడిన వ్యక్తి ఇలా యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపడం లాజిక్‌లెస్‌గా ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ కూడా వచ్చాయి. కాళ్లు, చేతులు కదపడానికే కష్టంగా ఉండే వయసులో అలవోకగా స్టంట్స్‌ చేస్తుండటం చూడటానికి నమ్మశక్యంగా అనిపించలేదు. ఇక ‘భారతీయుడు 2’ కథ, కథనం కూడా చాలా పూర్‌ ఉందన్న విమర్శలు వచ్చాయి. అసలు శంకర్ చిత్రంలాగే లేదని కామెంట్స్‌ వినిపించాయి. 

    గేమ్‌ ఛేంజర్‌తో గట్టెక్కేనా!

    డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. అంతకుముందు వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్‌ తిరిగి సక్సెస్‌ బాటలో పడేందుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ కీలకంగా మారింది. ఈ సినిమా విజయం సాధిస్తే శంకర్‌ పేరు మరోమారు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగే ఛాన్స్‌ ఉంది. లేదంటే అతడి కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గేమ్‌ ఛేంజర్‌ రిజల్ట్‌ చాలా కీలకంగా మారింది. ‘ఫ్యామిలీ స్టార్‌’ మిగిల్చిన నష్టాలను ‘గేమ్‌ ఛేంజర్‌’ పూడ్చాలని దిల్‌రాజు భావిస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version