Bigg Boss 7: రచ్చ రేపుతున్న పల్లవి ప్రశాంత్‌ ఇష్యూ. తొడగొట్టిన రైతు బిడ్డ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bigg Boss 7: రచ్చ రేపుతున్న పల్లవి ప్రశాంత్‌ ఇష్యూ. తొడగొట్టిన రైతు బిడ్డ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

    Bigg Boss 7: రచ్చ రేపుతున్న పల్లవి ప్రశాంత్‌ ఇష్యూ. తొడగొట్టిన రైతు బిడ్డ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

    September 12, 2023

    ప్రస్తుతం పల్లవి ప్రశాంత్‌ పేరు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. బిగ్‌బాస్‌ సీజన్‌-7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రశాంత్‌ను రెండో వారం నామినేషన్‌ సందర్బంగా హౌస్‌ సభ్యులు ఓ ఆట ఆడుకున్నారు. నామినేషన్స్ వేసే క్రమంలో.. ఎందుకు చేస్తున్నామో కంటెస్టెంట్స్ చెప్పిన సమాధానాలు దానికి ప్రశాంత్ ఇచ్చిన కౌంటర్స్ ఆసక్తికరంగా సాగాయి. ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్‌ ప్రశాంత్‌ను నామినేట్‌ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. 

    మెుదట గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, ప్రియాంక, దామిని, షకీలా వచ్చి ప్రశాంత్‍ను నామినేట్ చేశారు. అయితే నామినేషన్స్ సమయంలో ప్రశాంత్ వారిని రెచ్చగొట్టేలా బిహేవ్ చేశారు. తర్వాత అమర్‌దీప్ వచ్చి ప్రశాంత్‌పై విరుచుకుపడ్డాడు. అతడి మాటలకు సభ్యులంతా ఫిదా అయిపోయారు. ప్రశాంత్‌కు రెండు మెుహాలు ఉన్నాయని అమర్‌ చెప్పాడు. ఈ సందర్భంగా ప్రశాంత్ ఓ భుజం పైకి ఎత్తగా ‘నా ముందు దించు.. అలా చేయకు’ అని వార్నింగ్ ఇచ్చాడు. ‘రైతు బిడ్డ’ అనే పదం పదే పదే వాడకు అని తీవ్ర స్వరంతో సూచించాడు.

    మరోవైపు ఇంటి సభ్యులు తనను నామినేట్‌ చేస్తున్న క్రమంలో ప్రశాంత్‌ వింతగా బిహేవ్‌ చేశాడు. తొడ కొడుతూ, మీసాలు మెలవేస్తూ కంటెస్టెంట్స్‌ కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే శివాజీ హైప్‌ ఇవ్వడం వల్లనే ప్రశాంత్‌ ఇలా ప్రవర్తిస్తున్నట్లు ఇంటి సభ్యుడు టేస్టీ తేజ ఫన్నీగా కామెంట్ చేశాడు. దీనికి శివాజీ బదులిస్తూ ‘పొరపాటు ‌అయ్యింది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 

    ఇకపోతే ప్రశాంత్‌ను నామినేట్‌ చేస్తున్న క్రమంలోనే మరో ఆసక్తికర ఘటన జరిగింది. తాను బిగ్‌బాస్‌లో ఛాన్స్‌ కోసం కుక్కలాగా తిరిగానని ప్రశాంత్‌ చెప్పుకొచ్చాడు. దీనిపై మరో కంటెస్టెంట్‌ రతిక వెంటనే కౌంటర్‌ వేసింది. కుక్కలాగా తిరిగాక ఛాన్స్‌ వస్తే ‘ఇక్కడకు వచ్చి ఏం చేస్తున్నావ్‌?’ అని ప్రశ్నించింది. దీంతో ప్రశాంత్‌ ఖంగు తిన్నాడు. అయితే మెుదటి వారంలో ఎక్కువ సేపు రతికతోనే ప్రశాంత్ గడపడం విశేషం. ఆమెతో కనెక్ట్‌ అయ్యేందుకు ప్రశాంత్‌ యత్నిస్తున్నట్లు అందరికీ కనిపించింది. అయితే రతికనే ప్రశాంత్‌పై కౌంటర్‌ దాడి చేయడంతో సోషల్‌ మీడియాలో ఫన్నీ వీడియోలు పుట్టుకొచ్చాయి. 

    ప్రశాంత్‌ను టార్గెట్‌ చేస్తూ కొందరు నెటిజన్లు పోస్టు చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. నిజమైన రైతు బిడ్డ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెబుతూ చేసిన ఫన్నీ పోస్టు ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. 

    మరికొందరు రతికకు వ్యతిరేకంగా, ప్రశాంత్‌కు మద్దతుగా వీడియోలు పోస్టు చేస్తున్నారు. ‘పల్లవి.. ప్రశాంత్‌కు వెన్నుపోటు పొడిచావ్‌ కదా’ అంటూ మండిపడుతున్నారు. ప్రశాంత్‌ను రతికనే చెడగొట్టిందని కామెంట్స్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

    ఇక అమర్‌దీప్‌ vs ప్రశాంత్‌ అనే కాంటెస్ట్‌కు కూడా సోషల్‌ మీడియాలో తెరలేపారు. మీ సపోర్ట్‌ ఎవరికీ అంటూ నెటిజన్ల అభిప్రాయాన్ని కోరారు. అయితే కొందరు అమర్‌దీప్‌కు మద్దతుగా నిలిస్తే మరికొందరు ప్రశాంత్‌కు బాసటగా నిలుస్తున్నారు. 

    ఇకపోతే మెుదటి వారంలో రతికతో ప్రశాంత్‌ కలిసి ఉన్న దృశ్యాలను ఒకచోట చేర్చి దానికి ఓ పాట జోడించారు నెటిజన్లు. శంకర్‌దాదా MBBS సినిమాలోని  ‘చైలా చైలా’ పాటకు ఆ దృశ్యాలు సింక్‌ అయ్యేలా వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. 

    ప్రశాంత్‌ నామినేషన్స్‌ దృశ్యాలను ‘అదుర్స్‌’ మూవీలోని బ్రహ్మానందం లవ్‌ ట్రాక్‌ సీన్‌కు కనెక్ట్‌ చేస్తూ చేసిన మార్ఫింగ్‌ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. భలే సింక్‌ అయ్యేలా వీడియోను రూపొందించారంటూ నెటిజన్లు కామెంట్ బాక్స్‌లో పోస్టు చేస్తున్నారు. 

    నామినేషన్స్‌ సందర్భంగా పుష్ప బాడీ లాంగ్వేజ్‌తో పల్లవి ప్రశాంత్‌ నిలబడ్డాడు. భుజం పైకేత్తి ఎదుటి వారిని కవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యాలను ఒక చోట చేర్చి దానికి పుష్ప మ్యూజిక్‌ను జోడించారు నెటిజన్లు. ప్రస్తుతం ఇది కూడా నెట్టింట వైరల్ అవుతోంది. 

    ఇక పల్లె ప్రశాంత్‌ వ్యక్తిగత విషయానికి వస్తే అతడు తెలంగాణకు చెందిన యువ రైతు. యూట్యూబర్‌గా చాలా పాపులర్‌. తాను రైతు బిడ్డనని, బిగ్ బాస్‌కు వెళ్లడం తన కల అని చెప్తూ ఫేమ్‌ సంపాదించాడు. చివరకూ తన కల నెరవేర్చుకున్నాడు. బిగ్ బాస్ స్టేజ్ పైకి వస్తూనే ఓ బియ్యం మూటతో వచ్చి అవి తాను పండించిన బియ్యం అని ప్రశాంత్‌ తెలిపాడు. అవి నాగార్జునకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. 

    పల్లవి ప్రశాంత్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే అతడికి వారానికి రూ.లక్ష రూపాయలు చెల్లిస్తున్నారట. అతడు ఎన్ని వారాలు హౌస్ లో ఉంటే అన్ని లక్షలు వస్తాయన్నమాట. మరి పల్లవి ప్రశాంత్ ఎన్ని వారాలు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతాడో చూడాలి. అయితే నిన్న జరిగిన నామినేషన్స్‌తో ప్రశాంత్‌పై సానుభూతి ఇంకాస్త పెరగొచ్చని అంటున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version