• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల జమున?

    మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సతీమణి జమున బరిలోకి దిగుతుందనే చర్చ జరుగుతోంది. రాజేందర్ కుటుంబం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని పూడూరులో నివాసం ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాల విషయంలోనూ వారి కుటుంబానికి మేడ్చల్‌తో మంచి సంబంధాలున్నాయి. ఇక్కడ టికెట్ కోసం పోటీపడుతున్న వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా కలిసి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

    20 మంది అధికారులకు ఈసీ షాక్

    తెలంగాణలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న 20 మంది అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, అబ్కారీ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, రవాణా శాఖ కార్యదర్శిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వారికి ఎలాంటి విధులు అప్పగించొద్దని సీఎస్ శాంతికుమారిని ఆదేశించింది. కాగా, వీరిలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ ఉన్నారు.

    కవితను కాపాడేది బీజేపీనే: నారాయణ

    కేసీఆర్‌ కుమార్తె కవితను కాపాడేది బీజేపీ ప్రభుత్వమే అని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. మద్యం కుంభకోణంలో రాజీ ఒప్పందం కుదిరిన తర్వాతనే. వైసీపీ, కేసీఆర్‌, బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని చెప్పారు. అదానీ కుంభకోణంలో ఎందుకు సెబీ ఎంక్వెయిరీ వేయలేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయనను కాపాడుకుంటున్నారని నారాయణ దుయ్యబట్టారు.

    రేవంత్ సీటుకు రేటెంత: కేటీఆర్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ ఫైరయ్యారు. కాంగ్రెస్‌ వాళ్లకు ఎన్నికలంటే ఏటీఎం అని విమర్శించారు. రేవంత్ గతంలో ఓటుకు నోటు, ఇప్పుడు సీటుకు నోటు తీసుకుంటున్నాడని ఆరోపించారు. రేవంత్‌ను రేవంత్‌ అని పిలవడం లేదని రేటెంత.. రేటెంత.. అని అంటున్నారని ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మళ్లీ పోటీ చేస్తున్నాడన్నాడన్నారు.. 60 ఏళ్లు అధికారంలో ఉన్న తెలంగాణకు ఏమీ చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు.

    ఆ ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు: లోకేష్

    IRR కేసులో టీడీపీ నేత నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు లోకేష్‌ను దాదాపు 47 ప్రశ్నలు అడిగారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన లోకేష్ మీడియా మాట్లాడారు. హైకోర్టు ఒక్కరోజే విచారణకు హాజరవ్వాలని చెప్పింది. అధికారుల నోటీసు మేరకు రెండో రోజు హాజరైయ్యా.. వాషింగ్‌ మెషిన్‌లో తిప్పినట్లు మంగళవారం అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు. కొత్తగా ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదు’ అని లోకేష్ తెలిపారు.

    రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్

    దేశంలోని రైతులకు మోదీ సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల మొత్తాన్ని రూ.8 వేలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ.2 వేలు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే కేంద్రంపై రూ.20వేల కోట్ల మేర అదనపు భారం పడనుంది.

    హైకోర్టులో చంద్రబాబుకు స్వల్ప ఊరట

    చంద్రబాబు పిటిషన్‌లపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అంగళ్ల కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయోద్దని ఆదేశించింది. IRR కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయోద్దని స్టే ఇచ్చింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. చంద్రబాబును అరెస్టు చేయకుండా ఉత్తర్యులు ఇవ్వాలని కోర్టును చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వదని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు.

    చంద్రబాబు, లోకేష్‌ వాగుడుతోనే ఇదంతా: అంబటి

    చంద్రబాబు, లోకేష్‌ వాగుడుతోనే ఇక్కడ దాకా తెచ్చుకున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్నేం చేయలేక పోయాడు. జగన్ నన్ను ఏం పీకుతాడన్న చంద్రబాబు మాటలకు సమాధానం ఇప్పుడు వచ్చింది. రెండు పీకి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. టీడీపీ పాలనలో చేసిన దోపిడీ బయటపడింది. పైగా కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారు. అదే అయితే మొదటి సంవత్సరమే లెక్క చూసే వాళ్లం. ఆధారాలు బయట పడ్డాయి కాబట్టే సీఐడీ అరెస్ట్‌ చేసింది’ అని చెప్పుకొచ్చారు.

    ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్: మంత్రి అంబటి

    తమకు కక్ష సాధించాల్సిన అవసరం లేదని.. చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే పోలీసులు అరెస్టు చేశారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, 175 స్థానాల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమని అంబటి అన్నారు. ఈ నెల 26 నుంచి బస్సు యాత్రతో పాటు ‘మళ్లీ జగనే ఎందుకు కావాలి’ అనే కార్యక్రమం సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలి

    ఎన్నికల నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు సూచించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 46 సమస్యాత్మక నియోజకవర్గాలు ఉండగా, అందులో 13 తీవ్ర సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ఈనెల 31 వరకు ఓటు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.