• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • KCR గెలుపు కోసమే మోదీ పర్యటన: రేవంత్

    బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీల స్నేహ బంధాన్ని నిజామాబాద్‌ సాక్షిగా ప్రధాని మోదీ బయటపెట్టారని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే ఆ రెండు పార్టీల ఉద్దేశమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను గెలిపించేందుకే మోదీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని రేవంత్ విమర్శించారు.

    ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’: బాలకృష్ణ

    సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా పట్టించుకోనని తెలిపారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

    చంద్రబాబు అరెస్టు బాధాకరం: తలసాని శ్రీనివాస్‌

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ స్పందించారు. చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పట్ల జగన్ అనుసరిస్తున్న తీరు విచారకరమన్నారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.

    ఓట్ల కోసమే జగన్ పథకాలు: పవన్

    వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే జగన్ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనం. నిధుల మళ్లింపులు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజలు ఒక్కటి కావాలని పవన్ పిలుపునిచ్చారు..

    మేనిఫెస్టోపై కేసీఆర్ దృష్టి

    సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై దృష్టిసారించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచేందుకు మేనిఫెస్టోను రెడీ చేస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్‌లకు ధీటుగా.. మహిళలు, రైతులే ప్రధానంగా హామీలు రూపొందిస్తున్నారు. రైతులకు ఉచిత ఎరువులు, మహిళలకు జీరో వడ్డీ రుణాలు వంటి స్కీమ్స్‌ తీసుకొచ్చేందుకు అధికారులు, పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఈనెల 16న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.

    మా మూడు ప్రధాన హామీల సంగతేంటి?: KTR

    ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రధాని మోదీ మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…?1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు. 2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ? 3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ? మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు. మరి.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది ? పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ?? మీ మనసు … Read more

    పాపం కారు గ్యారేజీకి పోతోందన్న భయం: సంజయ్

    మంత్రి కేటీఆర్‌పై మాజీ టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘పాపం కారు గ్యారేజీకి పోతోందని #TwitterTillu నారాజ్‌ అయితున్నడు. నిజామాబాద్‌ల చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నడు కానీ ఏం ఫాయిదా? తొమ్మిదేళ్ల మీ దొంగ హామీల దొంగ జపం బట్టబయలైంది. వరంగల్‌ డల్లాస్‌ కాలే కనీసం బస్టాండ్‌ కూడా రాలే వరదలు, బురదలు బోనస్ నిజామాబాద్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలే 100 కుటుంబాలు కూడా బాగుపడలే 100 ఏళ్లకు సరిపడా … Read more

    బీజేపీ, జనసేన పొత్తుపై కీలక ప్రకటన

    జనసేనతో పొత్తుపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పొత్తుపై పవన్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారని చెప్పారు. పవన్‌ అభిప్రాయంపై వెంటనే స్పందించలేమన్నారు. పవన్ విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని పురందేశ్వరి పేర్కొన్నారు.

    వైసీపీకి 15 సీట్లు కూడా రావు: పవన్

    వారాహీ యాత్రలో సీఎం జగన్‌పై పవన్ నిప్పులుచెరిగారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే తమ లక్ష్యమని చెప్పారు. ‘వచ్చే ఎన్నిల్లో వైసీపీకి 175 సిట్లు కాదుకదా 15 సీట్లు కూడా రావు.. జగన్ పాలనలో విద్యార్ధులు ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారు. అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. సైకిల్, గ్లాస్‌ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం. వైసీపీ ఫ్యాన్‌కు కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రస్తుతం జగన్‌ పరిస్థితి హిట్లర్‌ పరిస్థితిలా ఉంది.’ అని పవన్‌ విమర్శించారు.

    సుప్రీంకోర్టులో రేవంత్‌కు భంగపాటు

    టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేయడంతో రేవంత్‌రెడ్డికి భంగపాటు తప్పలేదు.