• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

    ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు కొనసాగించారు. చంద్రబాబుపై కేసు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సీఐడీ నమోదు చేసిందని లూథ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం ఇరు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

    మోదీ స్టోరీలు రాస్తే ఆస్కార్ విజయం: KTR

    జనగర్జన సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మోదీ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ సినిమాలకు స్టోరీలు రాస్తే ఆస్కార్ విజయం సాధిస్తుందని ఎద్దేవా చేశారు. మోదీ ఎంత అరిచినా తెలంగాణ ప్రజలు సీఎంగా కేసీఆర్‌నే ఎన్నుకుంటారని చెప్పారు. ‘ఎన్డీయేలో చేరేందుకు మాకు పిచ్చికుక్క కరిచిందా? సభలో మోదీ పచ్చి అబద్దాలు చెప్పారు. మునిగిపోయో నావలో ఎవరూ ఎక్కాలనుకోరు. నేను సీఎం కావడానికి మోదీ పర్మీషన్ అవసరం లేదు’ అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

    కేసీఆర్ ఎన్డీయేలో చేరుతామన్నారు: మోదీ

    నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. గతంలో కేసీఆర్ ఎన్టీయేలో చేరుతామని తనను ఆశీర్వదించాలని కోరినట్లు తెలిపారు. అయితే తాము బీఆర్‌ఎస్‌తో పొత్తును తిరస్కరించామని చెప్పారు. GHMC ఎన్నికల తర్వాత తెలంగాణ తరపున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించుకుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు బీజేపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. రాష్ట్ర సంపదను ఓ కుటుంబం దోచుకుంటుందని మోదీ విమర్శించారు.

    TS: బీఎస్పీ అభ్యర్థుల జాబితా విడుదల

    రాబోయో ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు బీఎస్పీ సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలి జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. టీబీఎస్పీ అధ్యక్షుడు R.S ప్రవీణ్ కుమార్‌తో పాటు మొత్తం 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ సిర్పూర్ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. జహీరాబాద్ నుంచి సంగం గోపి, పెద్దపల్లి నుంచి దాసరి ఉషా, తాండూరు నుంచి చంద్రశేఖర్ ముదిరాజ్, దేవరకొండ నుంచి వెంకటేష్ చౌహాన్, ఇలా మరో 15 మంది పేర్లను బీఎస్పీ ప్రకటించింది. … Read more

    లోకేష్ సీఐడీ విచారణ వాయిదా

    ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత లోకేష్ సీఐడీ విచారణ వాయిదా పడింది. ఈ కేసులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం లోకేష్ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో బుధవారం విచారణకు రావాలని లోకేష్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

    రైతుల త్యాగాలు వృథా కావు: భువనేశ్వరి

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అడ్డదారిలో వెళ్తూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం జరిగితీరుతుందన్నారు. భూములిచ్చిన రైతుల త్యాగాలు వృథా కావని చెప్పారు. ఓట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు కొండంత ధైర్యాన్ని ఇస్తుందని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

    కాంగ్రెస్‌ను నడిపేది దేశ వ్యతిరేక శక్తులు: మోదీ

    ఛత్తీస్‌గఢ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మోదీ ఫైరయ్యారు. రాష్ట్రంలో అవినీతి, నేరాలు అధికంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ను నడుపుతోంది ఆ పార్టీ నేతలు కాదని దేశ వ్యతిరేక శక్తులతో అనుబంధం ఉన్నవారు నడుపుతున్నారని విమర్శించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలో గతంలో బీజేపీ ఆదివాసీల కోసం ప్రత్యేక మంత్రిత్యశాఖ ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మోదీ పేర్కొన్నారు.

    ఏపీలో జనసేన బలం పెరిగింది: పవన్‌

    AP: మచిలీపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనసేన బలం 14% నుంచి 18% పెరిగిందని పేర్కొన్నారు. అంచలంచెలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేమని స్పష్టం చేశారు. ఒంటరిగా వెళితే అధికారంలో వస్తామా? అనేది తనకు సందేహమేనన్నారు. పొత్తుతో వెళితే బలమైన సీట్లు వస్తాయని అంచనా వేశారు. తద్వారా అసెంబ్లీలో బలమైన పాదముద్ర పడుతుందని జోస్యం చెప్పారు. సీఎం అవుతానా? లేదా? అనేది గెలుపు నిష్పత్తిని బట్టి ఉంటుందని పవన్ అన్నారు.

    ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

    ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన వేతన సవరణ సంఘాన్ని (పీఆర్‌సీ) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ PRC సంఘానికి ఛైర్మన్‌గా విశ్రాంత IAS అధికారి ఎన్‌. శివశంకర్‌ను నియమించింది. సభ్యుడిగా మరో విశ్రాంత అధికారి బి.రామయ్యను నియమించారు. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఆరు నెలల్లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటివరకూ ఉద్యోగులకు 5 శాతం ‘మధ్యంతర భృతి’ (ఐఆర్‌) ఇవ్వాలని నిర్ణయించింది.

    బండారు అరెస్టును ఖండించిన లోకేశ్‌

    AP: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టును ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. ‘ముఖ్యమంత్రి, మంత్రులు, వైకాపా నేతలంతా కూసే బూతు కూతలపై ఎన్ని వేల కేసులు నమోదు చేయాలి?. బూతు కూతలు వద్దని హితవు పలికిన మాజీ మంత్రి బండారుని మాత్రం టెర్రరిస్టులా అరెస్టు చేశారు. వైకాపాకు ఓ చట్టం, విపక్షాలకు మరో చట్టమా? ఇదేం అరాచక పాలన?’ అని లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా నిలదీశారు.