• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

    ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన వేతన సవరణ సంఘాన్ని (పీఆర్‌సీ) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ PRC సంఘానికి ఛైర్మన్‌గా విశ్రాంత IAS అధికారి ఎన్‌. శివశంకర్‌ను నియమించింది. సభ్యుడిగా మరో విశ్రాంత అధికారి బి.రామయ్యను నియమించారు. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఆరు నెలల్లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటివరకూ ఉద్యోగులకు 5 శాతం ‘మధ్యంతర భృతి’ (ఐఆర్‌) ఇవ్వాలని నిర్ణయించింది.

    ఏపీలో జనసేన బలం పెరిగింది: పవన్‌

    AP: మచిలీపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనసేన బలం 14% నుంచి 18% పెరిగిందని పేర్కొన్నారు. అంచలంచెలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేమని స్పష్టం చేశారు. ఒంటరిగా వెళితే అధికారంలో వస్తామా? అనేది తనకు సందేహమేనన్నారు. పొత్తుతో వెళితే బలమైన సీట్లు వస్తాయని అంచనా వేశారు. తద్వారా అసెంబ్లీలో బలమైన పాదముద్ర పడుతుందని జోస్యం చెప్పారు. సీఎం అవుతానా? లేదా? అనేది గెలుపు నిష్పత్తిని బట్టి ఉంటుందని పవన్ అన్నారు.

    విపక్షాలకు విజన్‌ లేదు: ప్రధాని మోదీ

    విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధి వ్యతిరేక వైఖరితో రాజకీయాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. విపక్ష నేతలకు దేశ అభివృద్ధి విషయంలో విజన్‌ గానీ, ఒక రోడ్‌మ్యాప్ గానీ లేవన్నారు. భాజపా హయాంలో దేశంలోని పలు రంగాల్లో జరుగుతోన్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రపంచమంతా భారత్‌ను కీర్తిస్తుంటే భాజపా వ్యతిరేకులకు ఇది నచ్చడం లేదన్నారు. రాజకీయాల్లో మునిగితేలుతున్న విపక్ష నేతలకు కుర్చీయే తప్ప మరేమీ కనబడటంలేదని మోదీ విమర్శించారు.

    ‘భారాస ముమ్మాటికి వారసత్వ పార్టీనే’

    TG: భారాస బరాబర్‌ వారసత్వ పార్టీనే అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్న వారికి సూర్యాపేట సభలో కౌంటర్ ఇచ్చారు. ‘ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న కేసీఆర్‌ తప్పకుండా తెలంగాణ కుటుంబ సభ్యుడే. మోదీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. కానీ, భారాస ఎందరో త్యాగఫలంతో ఏర్పడిన వారసత్వ పార్టీ. కేసీఆర్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నారు. అయితే మోదీ వచ్చి కుటుంబ పాలన అంటున్నారు. శిఖండి రాజకీయాలు తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదు’ అని కేటీఆర్‌ … Read more

    ప్రజాధనంపై మాకు ఆశలేదు: భువనేశ్వరి

    AP: తన తండ్రి, భర్త ఇద్దరూ సీఎంలుగా చేసినా తమ కుటుంబం ఎప్పుడూ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని చంద్రబాబు భార్య భువనేశ్వరి అన్నారు. రాష్ట్రం, ప్రజల బాగు కోసమే చంద్రబాబు నిత్యం పరితపించేవారన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీజీనే జైలులో పెట్టారని ఆమె గుర్తుచేశారు. తన ఆయుష్షు కూడా పోసుకొని చంద్రబాబు జీవించాలని ప్రార్థించారు. ప్రజాధనంపై తమకు ఎప్పూడు ఆశలేదని, మా కుటుంబ సభ్యులపై ఒక్క కేసు కూడా లేదని భువనేశ్వరి పునరుద్ఘటించారు. నా ఆయుషు కూడా పోసుకుని ఆయన బ్రతకాలి … Read more

    జనసేన పోటీ చేసే స్థానాలు ప్రకటన

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 చోట్ల పోటీ చేయనున్నట్లు జనసేన వెల్లడించింది. కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, నాగర్‌కర్నూల్‌, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, కొత్తగూడెం, ఉప్పల్‌, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌, హుస్నాబాద్‌, రామగుండం, జగిత్యాల, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్‌ వెస్ట్‌, వరంగల్‌ ఈస్ట్‌, మల్కాజిగిరి, ఖానాపూర్‌, మేడ్చల్‌, పాలేరు, ఇల్లందు, మధిర స్థానాల్లో బరిలోకి దిగనున్నట్లు ప్రకటించింది.

    భారాస 25 సీట్లకే పరిమితం: రేవంత్‌

    తెలంగాణలో కాంగ్రెస్‌ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారాస పనైపోయిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరన్నారు. భారాస సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి వస్తున్నారంటేనే తమ బలమేంటో అర్థమవుతుందన్నారు. భారాసకు ఈసారి 25 సీట్లు దాటే అవకాశం లేదని రేవంత్‌ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 19 శాతం ఓట్లు అన్‌ డిసైడెడ్‌ మోడ్‌లో ఉన్నాయని, ఇందులో మెజారిటీ షేర్ తమకే వస్తుందన్నారు.

    చంద్రబాబు గాడ్సే కంటే ఘోరం: రోజా

    AP: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై మంత్రి రోజా ఫైర్‌ అయ్యారు. ప్రజాసొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బాబు గాడ్సేకంటే ఘోరమైన వ్యక్తి అని మండిపడ్డారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని విమర్శించారు. అటు 15 సీట్లలో పోటీ చేసేందుకు కూడా జనసేనకు అభ్యర్థులు లేరని దుయ్యబట్టారు. పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయలేని పార్టీ టీడీపీదని మండిపడ్డారు. సన్యాసీ, సన్యాసీ కలిస్తే బుడిద రాలుతుందని ఎద్దేవా చేశారు.

    ‘చేతులతో సూర్యోదయాన్ని ఆపలేరు’

    తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును సినీ నటుడు, మాజీ ఎంపీ మురళిమోహన్‌ ఖండించారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ ప్రారంభానికి ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ గేట్స్‌ను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించడం బాధాకరమన్నారు. ఉదయించే సూర్యోదయాన్ని ఆపడానికి చేతులు అడ్డుపెట్టడం మూర్ఖత్వం అవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బయటకు వస్తారని.. ఆయన సారథ్యంలో ఏపీ అభివృద్ధి జరుగుతుందని మురళీమోహన్ చెప్పారు. మాజీ CM చంద్రబాబు నాయుడి గొప్పతనం మురళి మోహన్ గారి మాటల్లో#ChandrababuNaidu … Read more

    హ్యాట్రిక్‌ కొట్టేది కేసీఆరే: హరీశ్‌రావు

    TG: రాష్ట్ర భాజపాపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి.. అనంతరం మాట్లాడారు. గన్నుతో, పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తి రామలింగారెడ్డి అని కొనియాడారు. దుబ్బాకలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో భాజపా లేచేది లేదు. కాంగ్రెస్‌ గెలిచేది లేదు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా .. హ్యాట్రిక్‌ కొట్టేది సీఎం కేసీఆరే’ అని హరీశ్‌ అన్నారు.