• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేసీఆర్‌పై నడ్డా ఘాటు విమర్శలు

    BRSపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటు విమర్శలు చేశారు. మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో బీజేపీ కౌన్సిల్‌ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ.. ‘తెలంగాణ కోసం కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో BRS కుటుంబపాలన అంతం కావడం ఖాయం. కేవలం తమ ఆకాంక్షల కోసమే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఆ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. BRS కుటుంబ పార్టీ. కేసీఆర్‌కు ఒక సందేశం ఇస్తున్నా వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయి’’ అని నడ్డా … Read more

    చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైంది: బ్రాహ్మణి

    టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. టీడీపీ “కాంతితో క్రాంతి” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం అని బ్రాహ్మణీ పిలుపునిచ్చారు.

    8న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్

    తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 8-10వ తేదీల మధ్య విడుదల కానుంది. అయితే ఆదివారమే షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, చత్తీస్‌ఘర్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 10-15 మధ్య ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

    అమరావతికి మోదీ ఇచ్చింది గుండు సున్నా: KTR

    ఏపీలో అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ గుండు సున్నా ఇచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కూడా ప్రజలు గుండు సున్నా ఇవ్వాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి రజనీకాంత్ అమెరికాలో తిరిగినట్లు ఉందన్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త. నేడు కరెంట్ పోతే వార్త అని ఉచిత విద్యుత్‌ను రైతులకు అందిస్తున్న ఘనత కేసీఆర్‌దని మంత్రి చెప్పుకొచ్చారు.

    ఎన్డీయేలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి?: పవన్

    కైకలూరు వద్ద ముదినేపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ‘టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు తీరుస్తాం. నేను ఎన్డీయే కూటమితో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? వైసీపీకి ఎందుకు అంత భయం. మేము గెలిచిన రోజున దమ్ముంటే వైసీపీ నేతలు ఇళ్లలోనో ఆఫీసుల్లోనో కూర్చోండి చూద్దాం. ఏ పోలీసులతో కేసులు పెట్టించారో అదే పోలీసులతో మక్కెలు ఇరగతీయిస్తాం. భవిష్యత్తులో వైసీపీ గెలిస్తే ప్రజలు ఆస్తి ప్రతాలు జగన్ చేతుల్లో ఉంటాయి’. అని పవన్ ఆరోపించారు.

    రాహుల్‌‌ గాంధీని రావణుడితో పోల్చిన బీజేపీ

    కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రావణుడి అవతారంలో ఉన్న ఒక ఫొటోను బీజేపీ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ రాహుల్ ఫొటో కింద క్యాప్షన్‌తో బీజేపీ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. ‘మోదీ ఒక అబద్ధాల కోరు ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదు’ … Read more

    కాంగ్రెస్‌కు అధికారమే ముఖ్యం: మోదీ

    కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకు పైనే ఎక్కువ ద‌ృష్టి సారిస్తుందని విమర్శించారు. రైతులు, జవాన్ల సంక్షేమాన్ని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. సీఎం గెహ్లాట్ అవినీతి బయటకు రావాలంటే రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ సందర్భంగా మోదీ ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

    చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

    సిల్క్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు పేర్కొంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌, కస్టడీ పిటిషన్‌ను రేపటికి వాయిదా చేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపు లాయర్ ప్రమోద్ కుమార్ తన వాదనలు వినిపించారు. సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.

    ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’: బాలకృష్ణ

    సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా పట్టించుకోనని తెలిపారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

    గాంధీ భవన్‌లోనే గాడ్సే: KTR

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు కర్ణాటక నుంచి డబ్బులు తెచ్చి పంచితే ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కు వేయాలని కోరారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ సీటుకు 25 కోట్లకు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు అక్కడక్కడా ఒక్కటవుతున్నాయని చెప్పుకొచ్చారు. గాంధీ భవన్‌లోనే గాడ్సే ఉన్నాడని రేవంత్ రెడ్డి RSS మనిషి అంటూ కేటీఆర్ విమర్శించారు..