• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్

    క్యాసినో కింగ్‌గా పేరుగాంచిన చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలో చేరారు. బర్కత్‌పూరలోని బీజేపీ కార్యాలయంలో చీకోటి పార్టీ కండువా కప్పుకున్నారు. అతడిని బీజేపీ నేత డీకే అరుణ, ప్రవీణ్‌కు పార్టీ కండువా కప్పి సాధర ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

    ‘టీడీటీ అధికారంలోకి వస్తే పరిస్థితేంటి’

    వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతల పరిస్థితేంటని ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు హెచ్చరిస్తున్నారని తెలిపారు. వారు అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులు ఆలోచించాలన్నారు. వాలంటీర్లు 90 శాతం మంది వైసీపీ మద్ధతుదారులు ఉన్నారని చెప్పారు. వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే మారుస్తామని బాలినేని పేర్కొన్నారు.

    నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత

    ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. నీళ్ల చారు, పులిసిపోయిన పెరుగు పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు క్యాంపస్ ఎదుట బైటాయించి ధర్నాకు దిగారు. కళాశాల యాజమాన్యం వచ్చి సర్థి చెప్పినా విద్యార్థులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. దీంతో క్యాంపస్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    ‘తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోంది’

    సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో గోదావరి తలాపున వెళ్తున్నా నీళ్ల కోసం అవస్థలు పడ్డామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 12.70 లక్షల మందికి కళ్యాణలక్ష్మి అందించామని హరీశ్ రావు పేర్కొన్నారు. గతంలో ప్రైవేట్ ఆస్పత్రులు పెరిగితే ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు పెరుగుతున్నాయని చెప్పారు.

    ఈ నెల 10న తెలంగాణకు అమిత్ షా

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 10న తెలంగాణ రానున్నారు. ఆయన ఒకే రోజు రెండు సభల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. 10న ఉదయం ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడలో జరిగే భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. త్వరలో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

    సీఎం కేసీఆర్‌కు ఛాతిలో ఇన్పెక్షన్

    సీఎం కేసీఆర్‌కు ఛాతిలో బాక్టీరియల్ ఇన్పెక్షన్ సోకిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్ గత మూడు వారాలుగా ప్రజలకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆయన కోలుకుంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

    నక్సలిజం మానవాళికి శాపం: అమిత్‌ షా

    దేశంలో వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. 2022లో నక్సల్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో హింస, మరణాలు తగ్గిపోయాయని తెలిపారు. ‘నక్సలిజం మానవాళికి శాపమని. మేము దానికి సంబంధించిన అన్ని రూపాలను నిర్మూలించామని చెప్పారు. వామపక్ష తీవ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ‘నేషనల్‌ పాలసీ అండ్ యాక్షన్‌ ప్లాన్‌’ను ఆమోదించిన విషయాన్ని అమిత్‌ షా గుర్తు చేశారు.

    జగన్‌ది అసమర్థ పాలన: పవన్

    ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్‌లకు సైతం 20వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. జగన్ అసమర్థ పాలనలో సమస్యలు లేవనెత్తితే దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు వాయిదా వేయించుకోవడానికి జగన్ ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు.

    కక్ష సాధింపు కోసమే చంద్రబాబు అరెస్ట్: లోకేష్

    అవినీతిని ప్రశ్నించినందుకే చంద్రబాబును జైలులో పెట్టారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేష్ ములాఖత్‌ అయ్యారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెడుతున్నాడు. స్కిల్‌ కేసులో తొలుత రూ.3 వేల కోట్ల అవినీతని చెప్పి తర్వాత రూ.300 కోట్లు అంటున్నారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. వైసీపీ అక్రమాలపై న్యాయపోరాటం కొనసాగిస్తాం’. అని లోకేష్ పేర్కొన్నారు.

    BRSకు ఎమ్మెల్యే రాజీనామా

    BRSకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఆమె బహిరంగ ప్రకటన చేశారు. ఏ పార్టీ నుంచి పోటీచేస్తానన్నది త్వరలో ప్రకటిస్తామన్నారు. BRS ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల అభ్యుర్థుల మొదటి జాబితాలో రేఖా నాయక్ పేరు లేకపోవడంతో ఆమె అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే..