• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైసీపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం

    AP: వైసీపీకి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై దుండగులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తన సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎలక్ట్రికల్ డిటోనేటర్లు విసిరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

    ఢిల్లీలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ చర్చలు

    TG: కాంగ్రెస్‌ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం దిల్లీలో కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో జాబితాను ఖరారు చేసి అధిష్ఠానానికి పంపనున్నారు. అనంతరం మంగళవారం లేదా బుధవారం భేటీ కానున్న ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఈనెల 14లోపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయనుంది. మరోవైపు, సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ఓబీసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం 35 సీట్లు ఇవ్వాలని అధిష్ఠానానికి ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు.

    మంత్రి ఇంటిపై బాంబు దాడి

    మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ఇంఫాల్‌లో ఆ రాష్ట్ర మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ ఇంటి బయట బాంబు పేలింది. శనివారం రాత్రి 10 గం.ల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చాడు. మంత్రి ఇంటిపై గ్రెనెేడ్‌ వంటి బాంబు విసిరాడు. అది పేలడంతో అక్కడ సెక్యూరిటీగా ఉన్న CRPF జవాన్, స్థానిక మహిళ గాయపడ్డారు. పేలుడు గురించి తెలుసుకున్న సీఎం బీరెన్ సింగ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి భద్రత పెంచాలని ఆదేశించారు.

    ‘మా నాన్నకు టికెట్‌ ఇవ్వొద్దు’

    రాజస్థాన్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భాజపా మాజీ ఎమ్మెల్యే జయరామ్‌ జాటవ్‌కు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వవద్దని స్వయంగా ఆయన కూతురే అదిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చింది. ఒకవేళ టికెట్‌ ఇస్తే తన తండ్రిపై రెబల్‌గా తానే బరిలోకి దిగుతానని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను హెచ్చరించింది. తన ఆస్తులను కొట్టేసేందుకు తన తండ్రి కుట్రలు చేస్తున్నారని మీనా జాటవ్ ఆరోపించారు. అలాంటి వ్యక్తి సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సొంత కొడుకునే జయరామ్‌ చంపాలని చూశారని ఆమె ఆరోపించారు.

    బండారుపై సుప్రీంకోర్టుకు వెళ్తా: రోజా

    AP: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు మంత్రి ఆర్కే రోజా అన్నారు. న్యాయపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. ‘మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది. చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు?. టీడీపీ ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికే నన్ను టార్గెట్ చేశారు. టీడీపీ, జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు’ అని రోజా అన్నారు.

    బైడెన్‌పై ట్రంప్‌ సంచలన ఆరోపణలు

    ఇరాన్‌కు అమెరికా అందించిన నిధులతోనే హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేస్తోందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులతోనే ఈ దాడులకు నిధులు అందడం అవమానకరమని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు బాధాకరం. బలమైన శక్తితో దాడులను తిప్పికొట్టే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. ఈ దాడులకు అమెరికా నుంచి నిధులు అందడం అత్యంత అవమానకరం. బైడెన్‌ యంత్రాంగం నుంచి బయటికి వచ్చిన పలు నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి’ అని ట్రంప్ ఆరోపించారు.

    ‘రూ.1500 కోట్లకు పవన్‌ అమ్ముడుపోయారు’

    AP: జనసేన అధ్య­క్షుడు పవన్‌ కళ్యాణ్‌ రూ.1,500 కోట్లకు అమ్ము­డుపోయాడని ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ ఆరోపించారు చెప్పారు. పవన్‌ రోజుకో మాట మాట్లాడతారని మండిపడ్డారు. ఒక రోజు ఎన్డీఏలో ఉన్నానంటాడని, మరొక రోజు లేనని చెబుతాడని విమర్శించారు. చంద్రబాబు స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏనాడు పోరాటం చేయలేదని ధ్వజమెత్తారు. ఆయన అదానీకి అమ్ముడుపోయాడని ఆరో­పించారు. చంద్రబాబు అమరావతి కడతానని కట్టలేదని, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా సాధించలేదని మండిపడ్డారు.

    కూకట్‌పల్లి బరిలో బండ్ల గణేశ్‌!

    HYD: కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒక టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆయన పేరును కూకట్‌పల్లికి పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి అధిష్ఠానం ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు.

    నేడు 70% కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు!

    తెలంగాణలో నేడు కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటిలో 60-70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అభ్యర్థులను ఖరారు చేస్తే వారంతా ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందని కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌తో చెప్పినట్లు పేర్కొన్నారు. భారాస మాదిరి ముందస్తుగా టికెట్లు ఖరారు చేయడం కాంగ్రెస్‌ లాంటి జాతీయపార్టీలో సాధ్యం కాదన్నారు.

    రేవంత్‌ రెడ్డి బీజేపీ మనిషి: అసదుద్దిన్

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ సినిమా మా దగ్గర ఉంది. టీడీపీ నేత చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ కాంగ్రెస్‌లో ఉన్నా ఆయన జీవితం బీజేపీ, ఆరెస్సెస్‌తో ముడిపడి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలు అరెస్సెస్ నాలుక నుంచి వస్తున్నవి, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత కిషన్‌రెడ్డితో రేవంత్ పనిచేయడాన్ని చూశాను. అరెస్సెస్‌తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో రేవంత్ ప్రమాణం చేస్తారా’? అని అసదుద్ధిన్ … Read more