• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటర్లకు సీఈవో కీలక సూచనలు

    తెలంగాణలో ఎన్నికల కోట్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రత్యేక ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని వెల్లడించింది. ఫిర్యాదుల కోసం 1950ను సంప్రదించాలి ఎన్నికల సంఘం పేర్కొంది.

    చంద్రబాబు పిటిషన్ వాయిదా

    చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ కేసును కొట్టివేయాలని చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు సుప్రీంలో విచారణ జరిగింది.

    అలా చేస్తే పరువైనా దక్కుతుంది: హరీష్‌రావు

    బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. స్వంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేని నడ్డా తెలంగాణలో గెలిపిస్తారా? అని విమర్శించారు. తెలంగాణలో డిపాజిట్ల కమిటీనైనా వేసుకుంటే బీజేపీకి పరువైన దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హంగ్ ఏర్పడదని కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని హరీష్‌రావు కోరారు. మంచిర్యాల జిల్లాలో ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

    మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్

    పాలమూరు ప్రజాగర్జన’ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు..BRS పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉంది. కానీ బిజెపి స్టీరింగ్..అదాని చేతిలోకి వెళ్లిపోయింది. తెలంగాణలో రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం… మిలియన్ డాలర్ జోక్’. అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

    చంద్రబాబుకు పిటిషన్ డిస్మిస్

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అలాగే సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే.. సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌లను కొట్టివేసింది.

    చంద్రబాబుపై సింపతి పెరిగింది: మురళీమోహన్

    టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం బాధను కలిగిస్తోందని నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని జైలులో పెట్టడం సరికాదన్నారు. అవినీతి మచ్చలేకుండా చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ప్రజల్లో ఆయనపై సింపతి పెరిగిందన్నారు. ఎచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుతో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతుందని మురళీమోహన్ అన్నారు..

    ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఇవే

    తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు జరగనుండగా.. చత్తీస్‌ఘర్‌లో నవంబర్ 7, 17న రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17, రాజస్థాన్‌లో నవంబర్ 23న.. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

    39 మందితో బీజేపీ తొలి జాబితా

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఆ పార్టీ హైకమాండ్‌కు చేరింది. దీని ఆధారంగా ఈనెల 14 తర్వాత 39 మందితో కూడిన జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి నియోజకవర్గంలో యాక్టీవ్‌గా ఉన్న వారికి తొలి జాబితాలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. కాగా, రేపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్, రాజేంద్రనగర్‌లో సభలు నిర్వహించాల్సి ఉండగా.. ఆదిలాబాద్ సభ మాత్రమే నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

    అమిత్‌షాతో పురందేశ్వరి భేటి

    కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ భాజపా చీఫ్‌ పురందేశ్వరి భేటి అయ్యారు. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన విషయాలపై హోం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఓ మద్యం దుకాణంలో రూ.లక్ష వరకూ విక్రయాలు జరగ్గా.. కేవలం రూ.700కు మాత్రమే డిజిటల్‌ చెల్లింపులు జరిగాయని ఇటీవల పురందేశ్వరి ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన నగదు వైకాపా నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని విమర్శించారు.

    ‘కేసీఆర్‌ వల్లే విశ్వనగరంగా హైదరాబాద్’

    సీఎం కేసీఆర్‌ తీసుకున్న విఫ్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్‌ విశ్వనగరంగా అవతరించిందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. రహదారి వ్యవస్థలో మార్పులు, మెట్రో రైలు, మౌలిక వసతుల కల్పన, ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం, హరితహారం వంటి కార్యక్రమాల వల్ల హైదరాబాద్‌ మునుపెన్నడూ చూడని అభివృద్ధి సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.