• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు: పవన్

    తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలో బీసీ నాయకత్వం రావాలని ఆకాంక్షించారు. బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పవన్‌ పాల్గొన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే మాటకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. మోదీలాంటి ప్రధాని ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకోవడానికి ఉన్న అవకాశాలను రెండు రాష్ట్రాల నేతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ సాధనలో విజయం సాధించాం కానీ.. రాష్ట్ర అభ్యున్నతిలో సాధించాలేదని పవన్‌ అన్నారు.

    ఏపీలో త్వరలో జైలర్ సీన్: రఘురామ

    సీఎం నిజ స్వరూపం ఏమిటో ప్రధానికి మోదీకి తెలిసిపోయిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ‘జైలర్‌’ సినిమా సీన్‌ త్వరలో రాష్ట్రంలో కనిపించవచ్చన్నారు. ఆ సినిమాలో రజినీకాంత్‌ తన కుమారుడు దొంగతనాలు చేస్తున్న విషయం తెలిసి అతన్ని చంపాలని ఆదేశిస్తారని..అలాగే రాష్ట్రంలోనూ రేపు అటువంటి దృశ్యమే పునరావృతం కావచ్చని అన్నారు. పీఎం కిసాన్‌ పథకానికి వైఎస్సార్‌ రైతు భరోసా అని రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసిందని రఘురామ విమర్శించారు,

    కేసీఅర్‌ను ఇంటికి పంపాలి: మోదీ

    తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మీ అందరి ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యానని బీసీ ఆత్మగౌరవ సభలో అన్నారు. ‘తెలంగాణ ప్రజలు భాజపాపైనే విశ్వాసంతో ఉన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారు. ఆయన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. వాటితోనే భారాస మోసం చేసింది. బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది భాజపా మాత్రమే’ అని మోదీ అన్నారు.

    ఆ మూడు పార్టీలు ఒకటే: కిషన్‌రెడ్డి

    TG: భారాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ఒకటేనని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. మన్మోహన్‌ హయాంలో కేసీఆర్‌ మంత్రిగా ఉన్నారని, తెరాస నేతలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అమ్ముడు పోయే పార్టీ అని, భారాస కొనుగోలు చేసే పార్టీ అని విమర్శించారు. ఈ రెండూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కేటనన్నారు.

    సీఎం కేసీఆర్‌కు పవన్‌ చురకలు

    TG: సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉంది. ప్రధాని మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఆర్టికల్‌ 370ని రద్దు చేసేవారు కాదు. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదు. నాలాంటి కోట్ల మంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ’ అని పవన్‌ అన్నారు.

    రిజర్వేషన్లపై బిహార్‌ కీలక నిర్ణయం

    రిజర్వేషన్లకు సంబంధించి బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు 50శాతం ఉండగా వాటిని 65శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. ఎస్సీలకు 20శాతం రిజర్వేషన్‌ లభిస్తుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలు కలిపి 30శాతం ఉండగా.. తాజా పెంపుతో అవి 43శాతం కానున్నాయి. మరోవైపు ఎస్టీలకు 2 శాతాన్ని ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి.

    డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు: కేసీఆర్‌

    TG: డబ్బుకు ఓటు అమ్ముకోవద్దని భారాస అధినేత కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. చెన్నూరు సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇంకా పరిణతి రావాలి. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. మనం వేసే ఓటే మన భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలంగాణ రాకముందు.. వచ్చాక.. రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిని ప్రజలు గమనించాలి.. ఆలోచించాలి. ఆ తర్వాతనే ఓటు వేయాలి’ అని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

    ధరణి కంటే మెరుగైన వ్యవస్థను తెస్తాం: రేవంత్

    ధరణి పోర్టల్‌ కంటే మెరుగైన వ్యవస్థను తీసుకొస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జోగులాంబలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ ఇస్తున్నట్టు నిరూపించాలని సవాల్ చేశారు. అలాస్తే తాను నామినేషన్‌ వేయనన్నారు. ఉచిత విద్యుత్‌ పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ అని తెలిపారు. అలంపూర్‌‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు రేవంత్ విజ్ఞప్తి చేశారు.

    మిజోరంలో ప్రశాంతంగా పోలింగ్

    మిజోరంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. 11 జిల్లాల వ్యాప్తంగా 40 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 52.73 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెర్చిప్‌ జిల్లాలో 60.37శాతం పోలింగ్‌ నమోదైంది. లౌంగల్లాయ్ జిల్లాలో 59.31 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

    కిషన్‌రెడ్డికి కవిత కౌంటర్

    తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. రాష్ట్రంలో కరెంట్‌పై బీజేపీ నేతలు అబద్దాలు చెప్పడం మానుకోవాలన్నారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రంలో కరెంటు సరఫరాపై కిషన్‌ రెడ్డి కట్టు కథలు చెప్పడం మానుకోండి. కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయవద్దు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయి,’ అని కవిత పేర్కొన్నారు.