• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం

    తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు.. అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

    చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

    స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసినబెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల 15కి వాయిదా చేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. విచారణకు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సీఐడీ కోర్టుకు తెలిపింది. తమకు తగిన సమయం కావాలని కోరింది. దీంతో న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చిచెప్పింది.

    నేడు చంద్రబాబు బెయిలు పిటిషన్‌ విచారణ

    స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు బెయిలు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో 37వ నిందితులు బెయిల్‌పై బయటే ఉన్నారు. చంద్రబాబుకు మాత్రం బెయిలు దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు ఒక్కరికే బెయిలు రావాలి. ఇదే కేసులో ఏపీఎస్‌ఎస్‌డీసీ పూర్వ ఎండీ, మొదటి నిందితుడు గంటా సుబ్బారావుతో పాటు మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిలు పొందారు. సీమెన్స్‌ సంస్థ, డిజైన్‌టెక్‌కు చెందిన ఎండీ, సీఎండీలు బెయిలు పొందిన వారిలో ఉన్నారు.

    భాజపా నాలుగో జాబితా ప్రకటన

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల నాలుగో జాబితాను భాజపా విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ.. తుది జాబితాను ఖరారు చేసింది. టికెట్‌ ఖరారైన అభ్యర్థులకు భాజపా ముఖ్యనేతలు ఇప్పటికే ఫోన్‌ చేసి సమాచారమందించారు. కంటోన్మెంట్‌-కృష్ణ ప్రసాద్‌, నాంపల్లి-రాహుల్‌ చంద్ర, శేరిలింగంపల్లి-రవికుమార్‌ యాదవ్‌, మల్కాజ్‌గిరి-రామచందర్‌రావు, పెద్దపల్లి-ప్రదీప్ కుమార్, మేడ్చల్-విక్రమ్ రెడ్డికి కేటాయించినట్టు భాజపా ఓ ప్రకటనలో తెలిపింది.

    కేసీఆర్‌ ఆస్తుల విలువ ఎంతంటే?

    TG: సీఎం కేసీఆర్ తన పేరిట రూ.58.7 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ. 35.42 కోట్ల విలువైన చరాస్తులు (నగదు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు), రూ.23.50 కోట్ల విలువైన స్థిరాస్తులు (ఇళ్లు, ఫాంహౌస్‌, ప్లాట్లు) ఉన్నాయని ప్రకటించారు. తన పేరిట సొంత భూమి, కార్లు, బైక్‌, ఇతర వాహనాలు లేవని పేర్కొన్నారు. తన పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు, కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్లో వెల్లడించారు. సంవత్సర ఆదాయం రూ.1.60 కోట్లు అని … Read more

    కేటీఆర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

    మంత్రి కేటీఆర్‌కు తృటిలోొ ప్రమాదం తప్పింది. కేటీఆర్ ప్రచార వాహనంలో ఉండగా డైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ప్రచారరథం రెయిలింగ్ విరగడంతో మంత్రి ముందుకు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కేటీఆర్‌ను పట్టకున్నారు. ఈ ప్రమాదంలో ఎంపీ సురేష్ రెడ్డి వాహనంపై నుంచి జారి కిందపడటంతో స్వల్ఫ గాయాలయ్యాయి. ఆర్మూరు ర్యాలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    నాకు సొంతిల్లు కూడా లేదు: మోదీ

    పేదల సొంతింటి కళను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తనకు మాత్రం సొంతిల్లు లేదన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతే కనిపించేది. పేదల కోసం మా ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విధ్వంసమే ఉంటుంది. కాంగ్రెస్ నకిలీ లబ్ధిదారుల ముసుగులో తమ అనుచరుల జేబులను నింపేసింది. మా ప్రభుత్వం వచ్చాక వారిని ఏరివేశాం. తద్వారా రూ.2.75లక్షల కోట్లను ఆదా చేశాం’ అని మోదీ పేర్కొన్నారు.

    వీల్‌చైర్‌లో వచ్చి ఎంపీ నామినేషన్‌

    మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. దుబ్బాకలో అంబులెన్స్‌ దిగి వీల్‌చైర్‌లో రిటర్నింగ్‌ కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అయితే ఇటీవల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ యువకుడి చేతిలో కత్తిపోటుకు గురైన ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్

    సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. గజ్వేల్‌లోని సమీకృత భవనంలో రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు. కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్.. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి ఆయన సమర్పించారు.

    జగన్‌పై లోకేష్ విమర్శలు

    టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘వాహ్.. ఒక్క యూనిట్ కూడా వాడని ఇంటికి రూ.295 కరెంట్ బిల్లు బాదుడు. సొంత పేపర్, ఛానెల్, సిమెంట్, విద్యుత్ కంపెనీలు, ఊరికో ప్యాలెస్ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్ పేదలకి రూపాయి స్కీం ఇచ్చి వెయ్యి రూపాయలు దోచే స్కాం. జనాన్ని క్యాన్సర్ గడ్డలా పట్టి పీడిస్తున్న నువ్వు బిడ్డ ఎలా అవుతావు జగన్?’ అని లోకేష్ విమర్శించారు.