• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రమాదంపై సీఎం, గవర్నర్‌ దిగ్భ్రాంతి

    HYD: నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌కు గవర్నర్‌ సూచించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబానికి సంతాపం తెలిపిన కేసీఆర్‌ గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

    ఆ పార్టీలు మాదిగ విరోధులు: ప్రధాని

    భారాస, కాంగ్రెస్‌ పార్టీలు.. మాదిగ విరోధులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హాజరై మాట్లాడారు. ‘ఎంతో ప్రేమతో నన్ను ఈ సభకు ఆహ్వానించారు. మందకృష్ణ నా చిన్న తమ్ముడు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సామాజిక న్యాయానికి మేం కట్టుబడి ఉన్నాం. 3 దశాబ్దాల మాదిగల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా’ అని అన్నారు.

    యువతను జగన్‌‌ను మోసం చేశారు: లోకేష్

    సీఎం వైఎస్‌ జగన్‌‌పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యలకు యువత బలి అవుతోందని ఆరోపించారు. జగన్‌ మాయమాటలు నమ్మి యువత మోసపోయిందన్నారు. మేనిఫెస్టోలో ప్రకారం ఏటా జనవరి 1నే జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఏటా 2 లక్షలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ అని చెప్పి యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక.. ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారని లోకేష్ తెలిపారు.

    TS Elections: రూ.1 గ్యాస్ సిలిండర్లు

    తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. తమ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్‌ యాదవ్‌. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలిస్తానని చెబుతున్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక వాలంటీరును నియమిస్తామని, 70 ఏళ్లు దాటిన వారు ఎమర్జెన్సీ పానిక్‌ బటన్‌ నొక్కగానే వచ్చి సాయం అందిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు.

    హైదరాబాద్‌లో మోదీ రోడ్‌ షో

    తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. వరుసగా మూడు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 25న కరీంనగర్, 26న నిర్మల్ సభల్లో పాల్గొననున్నారు. చివరిగా 27న మోదీ హైదరాబాద్‌లో రోడ్ షో చేపట్టనున్నారు.

    కాంగ్రెస్ ప్రచారకురాలిగా మాజీ బీజేపీ నేత

    బీజేపీ టికెట్ ఆశించిన సాధ్వి అనాది సరస్వతికి ఆ పార్టీ షాకిచ్చింది. చివరి నిమిషంలో రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ ఉత్తర నియోజకవర్గం టికెట్ ఇతరులకు కేటాయించారు. దీంతో ఆమె తీవ్ర నిరాసకు గురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన సరస్వతికి రాష్ట్ర ప్రచారకర్తగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పార్టీ ఆదేశానుసారం ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు.

    ఆర్టీసీ బస్సుల రద్దు.. నేతలు ఆగ్రహం

    ఎమ్మార్పీఎస్‌ నేతలు బుక్‌ చేసుకున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను అధికారులు చివరి నిమిషంలో రద్దు చేశారు. దీనిపై ఎమ్మర్పీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం బస్సులు బుక్‌ చేసుకోగా నేటి సాయంత్రం అవి బయలుదేరాల్సి ఉంది. ఇంతలో వీటిని రద్దుచేసినట్లు నేతలకు ఆర్టీసీ సమాచారం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఆఖరి క్షణాల్లో బస్సులను రద్దు చేయడంపై డిపోల అధికారులతో వాగ్వాదం కూడా జరిగింది.

    ‘కాంగ్రెస్‌ వస్తే మళ్లీ కరెంటు కష్టాలే’

    TG: హుజురాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పాలన వస్తే ప్రతి విషయానికి ఢిల్లీ వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు. ‘కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి ఆ రాష్ట్రంలో 5 గం.ల కరెంటు ఇస్తున్నామని గొప్పగా చెబుతున్నారు. ఇక్కడ 24 గంటల కరెంటు ఇస్తున్నాం. కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవు. హుజూరాబాద్‌లో భాజపా మూడో స్థానానికి పడిపోయింది. అన్ని సర్వేలలో కూడా భారాస అభ్యర్థి కౌశిక్‌రెడ్డి తొలి స్థానంలో ఉన్నారు’ అని అన్నారు.

    చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థులు మార్పు

    తెలంగాణలో ఎన్నిక నామినేషన్ చివరి రోజు రెండు చోట్ల అభ్యర్థులను బీజేపీ మార్చింది. వేములవాడ, సంగారెడ్డి అభ్యర్థులను మార్పు చేసింది. అప్పటికి ప్రకటించి ఉన్న వారిని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశమిచ్చింది. వేములవాడ అభ్యర్థిగా వికాస్‌రావు, సంగారెడ్డి అభ్యర్థిగా పులిమామిడి రాజును బీజేపీ ప్రకటించింది. టికెట్‌ ప్రకటించి బీఫామ్‌ ఇవ్వకపోవడంపై సంగారెడ్డి బీజేపీ నేత దేశ్‌పాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఫామ్‌ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి హెచ్చరించారు.

    ముగిసిన నామినేషన్ల పర్వం

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. నిర్ణీత సమయంలోగా మిగిలి ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది.