• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదు: రేవంత్

    తెలంగాణలో పేదలు బతికే పరిస్థితి లేదని. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వస్తే వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మేడ్చల్‌ నియోజకవర్గం జవహర్‌నగర్‌ రోడ్‌షోలో రేవంత్ మాట్లాడారు. మంత్రి కేటీఆర్ మేడ్చల్‌కు తెస్తామన్న ఐటీ పార్కు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2,500 అందజేస్తామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు.

    కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. ముహూర్తం ఫిక్స్?

    బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారని సమాచారం. పార్టీలో చేరిక తర్వాత వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి విజయశాంతి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు.

    కర్ణాటక మాజీ సీఎంపై కేసు

    కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఆ రాష్ట్ర ప్రభుత్యం షాకిచ్చింది. విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్‌ వినియోగించుకున్నారని ఆయనపై కేసు నమోదుచేసింది. దీపావళికి బెంగళూరులోని తన నివాసాన్ని అలంకరించేందుకు ఓ స్తంభం నుంచి అక్రమంగా తీగలతో కరెంట్ లాగినందుకు బెస్కాం ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై కుమారస్వామి స్పందిస్తూ కేవలం టెస్టింగ్‌ కోసమే బయట నుంచి విద్యుత్తు తీసుకున్నారని చెప్పారు.

    రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమి లేదు: రేవంత్

    బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో పండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ విజయం సాధిస్తే రైతుబంధు ఆపేస్తామని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని రేవంత్ హమీ ఇచ్చారు.

    ఓటు వేసే ముందు ఆలోచించండి: KCR

    కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తొర్రూరులో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఓటు వేసే ముందు ప్రజలు అన్నీ ఆలోచించి వేయాలి. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకుర్తి ఎంతో అభివృద్ధి చెందింది. పదేళ్ల ముందు పాలకుర్తి ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు అపేస్తుంది’.అని కేసీఆర్ పేర్కొన్నారు.

    ప్రమాదంపై సీఎం, గవర్నర్‌ దిగ్భ్రాంతి

    HYD: నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌కు గవర్నర్‌ సూచించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబానికి సంతాపం తెలిపిన కేసీఆర్‌ గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

    ఆ పార్టీలు మాదిగ విరోధులు: ప్రధాని

    భారాస, కాంగ్రెస్‌ పార్టీలు.. మాదిగ విరోధులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హాజరై మాట్లాడారు. ‘ఎంతో ప్రేమతో నన్ను ఈ సభకు ఆహ్వానించారు. మందకృష్ణ నా చిన్న తమ్ముడు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సామాజిక న్యాయానికి మేం కట్టుబడి ఉన్నాం. 3 దశాబ్దాల మాదిగల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా’ అని అన్నారు.

    యువతను జగన్‌‌ను మోసం చేశారు: లోకేష్

    సీఎం వైఎస్‌ జగన్‌‌పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యలకు యువత బలి అవుతోందని ఆరోపించారు. జగన్‌ మాయమాటలు నమ్మి యువత మోసపోయిందన్నారు. మేనిఫెస్టోలో ప్రకారం ఏటా జనవరి 1నే జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఏటా 2 లక్షలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ అని చెప్పి యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక.. ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారని లోకేష్ తెలిపారు.

    TS Elections: రూ.1 గ్యాస్ సిలిండర్లు

    తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. తమ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్‌ యాదవ్‌. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలిస్తానని చెబుతున్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక వాలంటీరును నియమిస్తామని, 70 ఏళ్లు దాటిన వారు ఎమర్జెన్సీ పానిక్‌ బటన్‌ నొక్కగానే వచ్చి సాయం అందిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు.

    హైదరాబాద్‌లో మోదీ రోడ్‌ షో

    తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. వరుసగా మూడు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 25న కరీంనగర్, 26న నిర్మల్ సభల్లో పాల్గొననున్నారు. చివరిగా 27న మోదీ హైదరాబాద్‌లో రోడ్ షో చేపట్టనున్నారు.