• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లక్ష్మి బ్యారేజ్ కుంగడంపై కేసు నమోదు

    మేడి గడ్డ లక్ష్మి బ్యారేజ్ కుంగడంపై మహదేవ్ పుర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్ర కోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు పిల్లర్లు కుంగటంపై కుట్ర ఉందన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు … Read more

    నారావారి పల్లెలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు

    నారా చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు నారా భువనేశ్వరి చేరుకున్నారు. నారావారి కులదేవత సత్తెమ్మ, నాగులమ్మలకు ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అత్తమామలు నారా ఖర్జూర నాయుడు, అమ్మణమ్మ సమాధులకు నారా భువనేశ్వరి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన టీడీపీ కార్యకర్తలతో ఆమె మాట్లాడారు. చంద్రబాబు తప్పకుండా జైలు నుంచి విడుదలవుతారని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

    ఆక్స్‌ఫర్డ్‌ నుంచి కవితకు ఆహ్వానం

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం లభించింది. ఈనెల 30న ఆ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ‘డెవలప్‌మెంట్ ఎకనామిక్స్’అంశంపై మాట్లాడాలని ఆమెకు ఆహ్వానం అందింది. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపై కవిత ప్రసంగించనున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిన తీరు, 24 గంటలు విద్యుత్, రైతు బంధు వంటి కార్యక్రమాలపై కీలకోపన్యాసం చేయనున్నారు.

    తెలంగాణలో చలి మొదలైంది

    తెలంగాణలో అప్పుడే చలికాలం ప్రారంభమైంది. మొన్నటి వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు చలికి ఒణికిపోతున్నారు. హన్మకొండలో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.7 డిగ్రీలు తగ్గి 17.3 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌లో 17.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రుతుపవనాల తిరోగమనం, ఉత్తరాది నుంచి చలిగాలులు వీయటం వల్ల పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాత్రి పూట 9 గంటల తర్వాత చలితీవ్రత పెరుగుతోంది.

    నేను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతా: జగ్గారెడ్డి

    కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నియోజకవర్గం కార్యకర్తలతో అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతా. మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. ప్రజల ముందు విజయదశమి రోజు తన మనసులోని మాట చెప్తున్నాను.. మీరు నన్ను మున్సిపల్ కౌన్సిలర్ ని చేసిండ్రు.. మీరు నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు.. మీ ఆశీర్వాదం తోటి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. నన్ను ముఖ్యమంత్రి అయ్యే వరకు కాపాడుకోండి’ అని వ్యాఖ్యానించారు.

    భారీ బంగారు, నగదు స్వాధీనం

    పోలీసులు తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. సరైన పత్రాలు లేని నగదు, బంగారాన్ని స్వాధీనం పోలీసులు చేసుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో 5.4 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.3.09 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

    సిద్ధిదాయిని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ

    శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో తొమ్మిదో రోజైన శ్రీ భ్రమరాంబ దేవి భక్తులకు సిద్ధిదాయిని అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను అశ్వ వాహనంపై కొలువుదీర్చి అర్చకులు, విశేష పూజలు చేశారు. అశేష భక్తజన సందోహం మధ్య శ్రీగిరి పురవీధుల్లో స్వామి అమ్మవార్లకు రమణీయంగా గ్రామోత్సవం నిర్వహించారు.

    వారికి రాహుల్‌‌ను విమర్శించే స్థాయి లేదు: ఉత్తమ్

    సీఎం కేటీఆర్ పై కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫైరయ్యారు. రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌, కవితలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. రాహుల్‌ విమర్శించే స్థాయి వారికి లేదన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని కొనియాడారు, తెలంగాణను దోపిడీ చేసిన కుటుంబం కల్వకుంట్లదేనని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామని పేర్కొన్నారు, తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

    భారీ బంగారు, నగదు స్వాధీనం

    పోలీసులు తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. సరైన పత్రాలు లేని నగదు, బంగారాన్ని స్వాధీనం పోలీసులు చేసుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో 5.4 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.3.09 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

    చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రా: మాజీ మంత్రి

    చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజల కోసం జీవితాన్నిఅంకితం చేసిన వ్యక్తిని జైలులో పెట్టడం సరికాదు. జగన్ జైలులో ఉన్నంత మాత్రాన అందురిని జైలులకు పంపాలా? చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు. జగన్ చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రచేస్తున్నారు. జగన్ పాలనలో ప్రజలు సుఖంగా లేరు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుంది’. అని మోత్కుపల్లి విమర్శించారు.