• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మేడిగడ్డ ఘటనపై కేంద్ర కమిటీ

    TG: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమీక్ష నిర్వహించనుంది. అనంతరం మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించనుంది. జలాశయాన్ని పరిశీలించిన వెంటనే నివేదిక అందించాలని కమిటీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చింది.

    కాంగ్రెస్‌ గూటికి రాజగోపాల్‌రెడ్డి?

    TG: నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తిరిగి యూటర్న్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన భాజపాను వదిలి తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా భాజపాలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌వైపు చూస్తున్నట్లు సమాచారం. పార్టీలో చేరే విషయమై ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలతో రాజగోపాల్‌ చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలిసింది. రేపు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీతో భేటి కూడా అవుతారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే భాజపాకు గట్టి షాక్‌ తప్పదు.

    పసిడి ప్రియులకు భారీ ఊరట

    కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750గా ఉంది. అలాగే చెన్నైలో రూ. 56,700లు, ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.56,600 పలుకుతోంది. మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ … Read more

    నేడు రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం

    AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటితో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. చివరి రోజైన ఇవాళ అమ్మవారు రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దనిగా.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మరోవైపు దసరా ఉత్సవాలు ముగుస్తుండడంతో ఇంద్రకీలాద్రికి భవానీ భక్తుల రాక పెరిగింది.

    80 స్థానాల్లో గెలుపు ఖాయం: రేవంత్

    TG: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 80 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రెండో విడత అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఆదివారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ భేటిలో అభ్యర్థుల ఎంపిక, పొత్తులో ఉన్న పార్టీలకు సీట్ల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ నెల 25 లేదా 26వ తేదీన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుండగా ఆ తర్వాత రెండో … Read more

    25న కాంగ్రెస్‌ రెండో జాబితా.!

    తెలంగాణ కాంగ్రెస్‌ రెండో అభ్యర్థుల జాబితా ప్రకటనపై స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు తుదిదశకు చేరినట్టు తెలుస్తోంది. మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 35 నుంచి 40 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. ఈనెల 25న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అదే రోజున కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    ప్రజలు భారాసతో ఉన్నారు: కేటీఆర్

    TG: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో, తొమిదేళ్ల పాలన ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ సూచించారు. కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. సంస్కారమంటే ఏమిటో కాంగ్రెస్‌ నుంచి నేర్చుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని కేటీఆర్‌ అన్నారు. కిషన్‌రెడ్డి ఎన్నికల రణరంగంలో వెన్నుచూపి పారిపోయారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. భాజపాకు 100.. కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు తమతోనే ఉన్నారని కేసీఆర్‌ చెప్పారు.

    రాష్ట్రానికి గుదిబండలా కాళేశ్వరం: భట్టీ

    TG: సీఎం కేసీఆర్‌ చేసిన రీడిజైనింగ్‌ వల్లే కాళేశ్వరం నష్టదాయకంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోయిందని విమర్శించారు. డిజైన్లు తానే రూపొందించానన్న కేసీఆర్‌ ఇప్పుడెందుకు మాట్లాడరని భట్టి ప్రశ్నించారు. గతేడాది వరదల్లో పంపుహౌసులు మునిగి భారీగా నష్టం వాటిల్లిందని ఆయన విమర్శించారు. రూ.30వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఎలా ఖర్చు చేశారని భట్టి నిలదీశారు.

    న‌వ‌రాత్రి వేడుక‌ల్లో ఆగుతున్న‌ గుండెలు

    గుజ‌రాత్‌లో న‌వరాత్రి వేడుక‌ల్లో విషాదం చోటుచేసుకుంది. గ‌ర్భా పెర్ఫామ్ చేస్తూ రాష్ట్ర‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంటల్లో ప‌ది మంది గుండెపోటుకు గురై మ‌ర‌ణించారు. బాధితుల్లో టీనేజ‌ర్ల నుంచి మ‌ధ్య‌వ‌య‌సు వారు ఉన్నారు. బ‌రోడాలోని ద‌భోయ్‌కు చెందిన 13 ఏండ్ల బాలుడు కూడా గ‌ర్భా వేడుక‌లో గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశాడు. న‌వ‌రాత్రులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో 108 సర్వీసుల‌కు 521 కాల్స్ రాగా, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో 609 కాల్స్ రావ‌డం గ‌మ‌నార్హం.

    లేటెస్ట్‌ సర్వే.. కేసీఆర్‌దే విజయం!

    తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేస్తుందని మిషన్‌ చాణక్య సర్వే వెల్లడించింది. తెలంగాణ ప్రజలు గులాబీ వైపే ఉన్నట్లు సర్వేలో తేలిందని పేర్కొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు 44.62 శాతం, కాంగ్రెస్‌కు 32.71 శాతం, బీజేపీకి 17.6 శాతం ఓట్లు వస్తాయని సర్వే నివేదికలో తెలిపింది. BRS కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని మిషన్‌ చాణక్య జోస్యం చెప్పింది. గత 4 నెలల్లో రాష్ట్రంలోని 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించి ఈ డేటాను రూపొందించినట్లు సర్వే సంస్థ స్పష్టం … Read more