• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భాజపా తొలి జాబితా విడుదల

    తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. 52 మందితో జాబితాను వెల్లడించింది. కరీంనగర్‌ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్‌ పోటీ చేయనున్నారు. గజ్వేల్‌, హుజూరాబాద్‌ రెండు స్థానాల నుంచి ఈటల రాజేందర్‌ బరిలో నిలవనున్నారు.

    రాజధానిగా విశాఖ.. GVL కీలక వ్యాఖ్యలు

    AP: విశాఖను ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. విశాఖ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని పేర్కొన్నారు. కోర్టు తీర్పు ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని జీవీఎల్ ఆరోపించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం విజయవాడకు వస్తారని ఎంపీ తెలిపారు.

    25 నుంచి ‘నిజం గెలవాలి’ యాత్ర

    AP: చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో చనిపోయిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ నెల 25 నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి 3 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు. మొదట రాయలసీమ జిల్లాల్లో ఈ పర్యటన సాగనుంది. 24న భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అదేరోజు నారావారిపల్లెకు వెళ్తారు. 25న చంద్రగిరిలో యాత్ర ప్రారంభిస్తారు.

    దసరా వేళ పసిడి ప్రియులకు షాక్

    దసరా పండగ వేళ పసిడి ధరలు వరుసగా పెరుగుతూ షాకిస్తున్నాయి. నిన్నటి పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ.220, రూ.220 చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750లకు చేరింది. అలాగే చెన్నైలో రూ. 56,700లు, ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.56,600 పలుకుతోంది. మరోవైపు వెండి ధర కూడా నేడు పెరిగింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధరపై రూ.1200 పెరిగింది.

    దేశంలోకి 70 మంది ఉగ్రవాదులు!

    నకిలీ పాస్‌పోర్టులతో దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులు ప్రవేశించినట్లు కేంద్ర నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. సుమారు 70 మంది ఉగ్రవాదులు నేపాల్‌ సరిహద్దుల నుంచి భారత్‌లోకి ప్రవేశించినట్లు భావిస్తున్నాయి. వీరంతా ఐఎస్‌ఐ, జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ ఉగ్ర సంస్థలకు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేంద్రం బంగ్లాదేశ్‌ సరిహద్దును అప్రమత్తం చేసింది. అటు భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలకు ఆదేశించింది.

    రైలు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల దుర్మరణం

    నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరస్వతీదేవీ దర్శనానికి వెళ్తూ తండ్రి, కుమార్తె రైలు ప్రమాదంలో మృతి చెందారు. బాసరలో సరస్వతీ దేవికి పూజకు కుటుంబసభ్యులతో రామచంద్రరావు హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరారు. నిజామాబాద్‌లో మరో బోగీలోకి మారేందుకు వారు రైలు దిగారు. ఈ క్రమంలో రామచంద్రరావు చిన్న కుమార్తె జననిని బోగీలోకి ఎక్కిస్తుండగా రైలు ముందుకు కదిలింది. ఈ క్రమంలో జనని పట్టుతప్పి రైలు కింద పడిపోయింది. ఆమెను పైకి లాగేందుకు ప్రయత్నించి తండ్రి కూడా రైలు కిందపడి మరణించాడు.

    పెంపుడు కుమార్తే తల్లికి యమపాశమైంది

    ఏపీ విశాఖ: అల్లారు ముద్దగా పెంచుకున్న పెంపుడు కూతుర్తే ఆ తల్లికి యమపాశమైంది. ప్రభుత్వ ఉద్యోగులైన దంపతులకు సంతానం లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఓ బాలికను దత్తత తీసుకున్నారు. సదరు బాలికకు 13 ఏళ్లు వచ్చే సరికే చెడు వ్యాసనాలకు బానిసైంది. 19 ఏళ్ల యువకుడితో ప్రేమయాణం సాగించింది. దీంతో ఆమెను పెంపుడు తల్లి మందలించేది. ఈ క్రమంలో కోపం పెంచుకున్న ఆ బాలిక ప్రియుడి సాయంతో తల్లిని అంతమొందించింది. కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం తెలుగు చూసింది.

    ఆ పార్టీలకు అభ్యర్థులే లేరు: కేటీఆర్

    ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని చెప్పారు. కేసీఆర్‌‌పై ప్రజలకు దృఢమైన విశ్వాసం ఉందన్నారు. అభ్యర్థులకు బీఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని తెలిపారు. ప్రచారంలో ముందున్నామన్న కేటీఆర్‌.. ఫలితాల్లోనూ ముందే ఉంటామని వెల్లడించారు. కాంగ్రెస్‌కు 40చోట్ల అభ్యర్థులు లేరని చెప్పారు, బీజేపీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతుందని కేటీఆర్ జోష్యం చెప్పారు.

    తనిఖీలో బట్టుబడ్డ రూ.300 కోట్లు

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా భారీగా డబ్బు, మద్యం, బంగారం, కానుకలు పట్టుబడుతున్నాయి. ఇలా ఇప్పటి వరకు మొత్తం రూ.307.2 కోట్లకు పైగా పట్టుబటినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే గత 24 గంటల్లో రూ.9.69కోట్ల నగదు పట్టుబడింది.

    రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

    TS: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ట్రాక్టరుపై కొల్కూరు వెళ్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్‌ స్టీరింగ్‌ విరిగింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఒకే గ్రామానికి చెందిన మంగలి గోపాల్‌(30), ఈటల రమణ(45), ఎంపల్లి మల్లేశ్‌(30)గా తెలిసింది. మృతదేహాలను శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.