• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్నికల్లో పోటీకి సిద్ధం: గద్దర్ కుమార్తె

    తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నానని గద్దర్ కుమార్తె వెన్నెల ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలని చేలా మంది ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని తెలిపారు. తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని వెల్లడించారు. గద్దర్ జీవితాంతం సమాజం కోసం తపన పడ్డారన్నారు. టికెట్ ఇవ్వకపోయినా తమ మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందని వెన్నెల పేర్కొన్నారు.

    రాహుల్ షేర్ కాదు పేపర్ పులి: కవిత

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాహుల్ బబ్బర్ షేర్ కాదని.. పేపర్ పులి మాత్రమే అని విమర్శించారు. జగిత్యాలలో కవిత మాట్లాడుతూ.. ‘గాంధీ కుటుంబానికి తెలంగాణకు విద్రోహక సంబంధం ఉంది. సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేసి పోరాడితే తెలంగాణ వచ్చింది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సింగరేణి కార్మికులకు న్యాయం జరిగింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసు మరచి దిగజారి మాట్లాడుతున్నారు. గల్ఫోలో ఉన్న వారి పేర్లు రేషన్ కార్డుల నుంచి ఎట్టి పరిస్థితిలోను తొలగించం’ అని కవిత … Read more

    కాంగ్రెస్ అంటే దగా పార్టీ: మల్లా రెడ్డి

    ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని మంత్రి మల్లా రెడ్డి అన్నారు. ‘బీఆర్ఎస్‌ పార్టీ అంటే చరిత్ర.. కేసీఆర్‌ సీఎం అయ్యాకే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కేసీఆర్‌ కొత్తగా 10 పథకాలు తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ అంటే మోసం, దగా పార్టీ.. భూకబ్జా దారులు.. వాళ్లను జైలుకి పంపించే బాధ్యత నాదే. దళితులకు భూములను పంచే బాధ్యత నాదే’ అని చెప్పుకొచ్చారు.

    రెడ్‌మీ ఫోన్లలో ఇవే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు!

    మెుబైల్‌ ప్రియులు రెడ్‌మీ ఫోన్స్‌ కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే చాలా మందికి రెడ్‌మీ ఫోన్‌ కొనాలని ఉన్నప్పటికీ ఏది తీసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో రెడ్‌మీలోని టాప్‌ రేటెడ్‌ మెుబైల్స్‌ను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. మరి ఆ ఫోన్స్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర చూసి ఏదీ కొనాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఫోన్ల వివరాలు ఆఫర్లు తెలుసుకునేందుకు పైన YouSay Webపై క్లిక్ చేయండి.

    మొసలిని కరెంట్ ఆఫీసులో వదిలిన రైతులు

    కర్ణాటకలో కరెంట్ కష్టాలపై రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయానికి కనీసం 5 గంటల పాటు కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. మాండ్యకు చెందిన రైతులు మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీసులో వదిలి పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కరెంట్ ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంటామని మరికొంతమంది రైతులు అధికారులను హెచ్చరించారు. కనీసం 5 గంటల కరెంట్ ఇవ్వట్లేదు అంటూ గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సప్లై ఆఫీసు మీద దాడి చేశారు. https://x.com/TeluguScribe/status/1715613238430458106?s=20

    పోలీస్ ఉద్యోగం ఒక సవాల్: సీఎం జగన్

    పోలీసు అమరవీరు సంస్మరణ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పోలీస్‌ ఉద్యోగం ఒక సవాల్.. ప్రస్తుత రోజుల్లో నేరం తన రూపాన్ని మార్చుకుంటోంది. కొత్త టెక్నాలజీ వల్ల సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా చోరీ వరకు నేరాలు జరుగుతున్నాయి. పోలీసులు అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సంఘ విద్రోహ శక్తుల నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటన్నింటికి పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉండాలి” అని సూచించారు.

    నేడు టీబీజేపీ ఫస్ట్ లిస్ట్?

    తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఈరోజు టీబీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. 55 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. బీసీలకు, మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించే ఛాన్స్ ఉంది. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మీద సస్పెన్షన్ వేటు బీజేపీ ఎత్తివేయనుంది. ఆయనకు గోషామహల్ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

    గగన్ యాన్ ప్రయోగం సక్సెస్

    ఇస్రో చేపట్టిన గగన్ యాన్ ప్రయోగం సక్సెస్ అయింది. రోదసి నుంచి గగన్ యాన్ మాడ్యూల్‌ను పారాచ్యూట్ సాయంతో విజయవంతంగా శాస్త్రవేత్తలు కిందకు దింపారు. అంతకుముందు రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం కాసేపు నిలిచిపోయింది. శాస్త్రవేత్తలు సరి చేయడంతో మరోసారి ఇస్రో గగన్ యాన్ ప్రయోగాన్ని చేపట్టింది. సరిగ్గా ఉ.10 గంటలకు TV-D1 సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నిప్పులు కక్కుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 8.30 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగం మొదలు పెట్టగా… సాంకేతిక లోపంతో ప్రయోగం తాత్కాలికంగా … Read more

    24 గంటల్లో రూ. 42 కోట్లు సీజ్

    అసెంబ్లీ ఎన్నికల వేళ.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.42 కోట్లకు పైగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఇంత మొత్తం బయటపడినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు రాష్ట్ర అబ్బారీ శాఖ సైతం రూ.1,68,45,982 విలువైన మద్యం పట్టుకుంది. ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత మొత్తం రూ.281 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

    రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

    హైదరాబాద్- ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మ పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ కమిషనర్ సుధీర్‌ బాబు తెలిపారు. రేపు అప్పర్ ట్యాంక్ బండ్, లుంబినీ పార్క్ వద్ద సద్దుల బతుకమ్మ సంబురాలు జరుగుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లుంబినీ పార్క్, అప్పర్ ట్యాంక్ బండ్ మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు.