• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గగన్‌యాన్‌ ప్రయోగం నిలిపివేత

    ఈరోజు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ ప్రయోగం నిలిచిపోయింది. గగన్‌యాన్ TV-D1 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్యను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కౌంట్‌ డౌన్‌కు 4 సెకన్ల ముందు సాంకేతిక లోపం గుర్తించినట్లు వెల్లడించారు. మరో ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

    నటి జయప్రదకు హైకోర్టులో ఎదురు దెబ్బ

    సినీ నటి జయప్రదకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నైలోని అన్నాపాలైలో జయప్రద ఓ సినిమా థియేటర్ నడిపారు. తమ ఈఎస్‌ఐ చెల్లింపుల్లో( రూ.37లక్షలు) మోసం చేశారని థియేటర్ సిబ్బంది ఆమెపై ఎగ్మూరు కోర్టులో కేసు నమోదు చేశారు. విచారించిన కోర్టు జయప్రదకు 6 నెలలు జైలు, రూ.5 వేల జరిమానా విధించింది. అప్పీలుకు వెళ్లిన జయప్రద రూ.20 లక్షలు చెల్లిస్తానని కోర్టుకు చెప్పగా.. సిబ్బంది వ్యతిరేకించారు.

    నేడు హైకోర్టు జడ్జిల ప్రమాణం

    నేడు హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం జరగనుంది. ఉదయం 11 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలుగురు అడిషనల్ జడ్జిలు హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్‌తో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.

    టీడీపీ- జనసేన తొలి భేటీ డేట్ ఖరారు

    టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ తేదీ ఖరారైంది. ఈ నెల 23న రాజమండ్రిలో టీడీపీ-జనసేన తొలి సమావేశం జరగనుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లోకేశ్- పవన్ కళ్యాణ్‌ల అధ్యక్షతన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ఇరు పార్టీలు ప్రకటించాయి.

    ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర

    వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.56,400కు చేరింది. అటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.770 పెరిగి రూ. 61,530కి ఎగబాకింది. మరోవైపు కేజీ వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో కిలో వెండి రూ. 77,500 వద్ద కొనసాగుతోంది.

    అందుకే రెండు చోట్ల పోటీ: కేసీఆర్

    రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృది ఆగదని ఇంకా ముందుకు సాగుతుందన్నారు. మేడ్చల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘త్వరలో జరగబోయే ఎన్నికల్లో 95 నుంచి 100 అసెంబ్లీలను గెలుస్తున్నాము. రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దుతాం. నియోజకవర్గంలో ఏ ఒక్క నిరుపేద కూడా ఉండకూడదనేదే మన లక్ష్యం. గజ్వేల్‌ను వదిలిపెట్టి పోయేది లేదు, కామారెడ్డిలో పోటీ చేయడానికి కొన్నికారణాలు ఉన్నాయి’ అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు.

    ఆ మూడు పార్టీలు ఒక్కటే: రాహుల్

    తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా మీటింగ్‌లో రాహుల్‌ మాట్లాడారు.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకటే, కేంద్రం బీఆర్‌ఎస్‌‌కు మద్దతు పలుకుతుంది. బీజేపీ నాపై 24 కేసులు పెట్టింది. మరి అదే బీజేపీ కేసీఆర్‌ మీద ఎన్ని కేసులు పెట్టిందో చెప్పాలి. కేసీఆర్‌ మీద సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు, చర్యలు ఉండవు దేశంలోనే అవినీతి సీఎం కేసీఆర్’ అని రాహుల్ ఆరోపించారు.

    ‘బలగం’ డైరెక్టర్‌కి తండ్రిగా ప్రమోషన్

    ‘బలగం’ సినిమా దర్శకుడు, నటుడు వేణు యెల్దండి తండ్రిగా మరోసారి ప్రమోషన్స్ పొందాడు. తనకు అమ్మాయి పుట్టిందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. అయితే వేణుకు ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ‘బలగం’ తర్వాత మళ్లీ దిల్ రాజు నిర్మాణంలో వేణు మరో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అందులో కూడా ప్రియదర్శినే హీరోగా నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

    సింగిరేణి కార్మికులకు బోనస్ ఎంతంటే?

    సింగిరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికులకు బోనస్ కింద రూ.711 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షలు బోనస్ అందనున్నట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. ‘సింగరేణిలో 43 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వారి ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు నుంచి బోనస్‌ ఒకటి రెండు రోజుల్లో చెల్లిస్తాం’ అని ప్రకటించింది. రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్ కూడా చెల్లిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది.

    TS SET హాల్‌టికెట్లు విడుదల

    TS SET అర్హత పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. నేడు నుంచి ‘తెలంగాణసెట్’ వైబ్‌‌సైట్ లోకి వెళ్లి అక్కడ నుంచి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 28, 29, 30, తేదీల్లో పరీక్ష నిర్వహణ ఉంటుంది. రెండు పేపర్లకు మూడు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. అయితే రాష్ట్రంలో డీగ్రీ కాలేజీలో లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ Ts Set పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే,,