• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపే అభ్యర్థులను ప్రకటిస్తాం: ఎంపీ కోమటిరెడ్డి

    ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ భరిలో నిలిపేందుకు అభ్యర్థుల జాబితా సిద్ధమవుతుందని చెప్పారు. దాన్ని రేపు అధిష్ఠానం విడుదల చేస్తుంది. ఆయా స్థానాల్లో ముగ్గురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అందుకే ఎంపిక ఆలస్యం అయింది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీఆర్‌ఎస్ నుంచి పార్టీలో చాలా మంది చేరుతున్నారు. నా సోదరుడు రాజగోపాల్ రెడ్డి చేరిక విషయం నాతో మాట్లాడలేదు’. అని కోమటిరెడ్డి తెలిపారు.

    రాజగోపాల్‌రెడ్డిపై భాజపా రియాక్షన్ ఇదే!

    TG: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాకు రాజీనామా చేయడంపై ఆ పార్టీ నేతలు స్పందించారు. ఈ విషయంలో ఎవరి ఇష్టం వారిదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. భారాసకు భాజపా ప్రత్యామ్నాయం కాదన్న వ్యాఖ్యలను ఖండించారు. భాజపా ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డికి జాతీయస్థాయిలో పార్టీ మంచి స్థానం కల్పించిందన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అటు రాజగోపాల్‌రెడ్డిని పాసింగ్‌ క్లౌడ్‌గా ఎంపీ జితేందర్‌రెడ్డి అభివర్ణించారు. కొందరు అలా వచ్చి ఇలా వెళ్లిపోతారని విమర్శించారు.

    భాజపాకు రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భాజపాకు రాజీనామా చేసినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరనున్నట్లు స్పష్టం చేశారు. భారాసకు ప్రత్యామ్నయం కాంగ్రెసే అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇవాళ తన అనుచరులతో రాజగోపాల్‌ రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీ మారడానికి గల కారణాలను వివరించనున్నారు. కాగా ఎల్లుండి మ.11-12 గం.ల మధ్య రాహుల్‌, ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

    రెండో జాబితాపై కాంగ్రెస్ కీలక భేటి

    TG: మధ్యాహ్నం 12.00 గంటలకు కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం కానుంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనుంది. ఈ భేటిలో 60 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. మిగిలిన 10 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక మరికొన్ని రోజులు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చేరికల దృష్ట్యా కొన్ని స్థానాల్లో ప్రకటన ఉండకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. సీఈసీ భేటి తర్వాత అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశముంది.

    నేడు భాజపా అగ్రనేతలతో పవన్ భేటి

    తెలంగాణ ఎన్నికల వేళ భాజపాతో పొత్తు అంశంపై చర్చించేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. భాజపా పెద్దలతో చర్చించనున్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ కూడా ఈ భేటిలో పాల్గొంటారని సమాచారం. ఇందులో GHMC సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, జనసేన నేతలు ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని భాజపా నేతలు వ్యక్తపరుస్తున్నారు.

    11 రోజుల్లో రూ.25 కోట్ల ఆదాయం

    TG: దసరా పండుగ సందర్భంగా TSRTC ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. కేవలం 11 రోజుల్లోనే ఆర్టీసీ ఖజానాకు రూ.25 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చాయి. సాధారణ రోజుల్లో ఆర్టీసీకి రోజుకు రూ.12-13 కోట్ల ఆదాయం వస్తే దసరా సందర్భంగా మాత్రం రోజుకు రూ.2-3 కోట్లు అదనంగా వచ్చినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. కాగా, దసరా పండుగను పురస్కరించుకుని TSRTC 5,500 ప్రత్యేక బస్సులను నడిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,302 బస్సులను అదనంగా నడిపింది.

    భారీగా పెరిగిన పసిడి ధరలు

    పసిడి ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200, రూ.240 చొప్పున పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.56,700 చేరింది. అటు ముంబయిలో రూ.56,550, చెన్నైలో రూ.56,750, కోల్‌కతాలో రూ.56,550, బెంగళూరులో రూ.56,550గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550కు చేరింది. మరోవైపు వెండి రూ.500 తగ్గి రూ.78,000కు చేరింది.

    27న రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన

    TG: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 27న సూర్యాపేటలో నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల బహిరంగసభకు హాజరుకానున్నారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖంగా ఉన్న నేతలను ప్రత్యేకంగా పిలిపించి అమిత్‌షా మాట్లాడనున్నట్టు తెలిసింది. కాగా, 28, 29 తేదీల్లో ఎన్నికల ప్రచారానికి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, 31న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ రాష్ట్రానికి రానున్నారు. వారు పాల్గొనే ప్రచార సభలు, రోడ్‌షోలపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

    వివాహితపై ఇద్దరు మహిళల అసహజ శృంగారం

    హైదరాబాద్- యూసుఫ్ గూడలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళపై ఇద్దరు మహిళలు దాడి చేసి.. అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఆమెపై తీవ్రంగా దాడి చేసి వంటిపై ఉన్న నాలుగు తులాల బంగారం అపహరించారు. ఓ వివాహిత భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. బస్టాప్‌లో తలదాచుకుంటున్న ఆమె దగ్గరకు ఇద్దరు మహిళలు సమీపించారు. మాయమాటలు చెప్పి వారింటికి తీసుకెళ్లారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. తెరుకున్న వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    వీహెచ్‌పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్

    టీకాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. అంబర్‌పేట టికెట్‌ తనకు రాకుండా ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. అసలు రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేయించింది ఉత్తమే నంటూ వ్యాఖ్యానించారు. తనను, జగ్గారెడ్డి లాంటి సీనియర్లను బయటకు పంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈక్రమంలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లొద్దని అధిష్టానం ఆదేశించింది. ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది.