• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారాసపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

    TG: భారాస ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు సూచనలు చేశాం. నోటిఫికేషన్‌కు ముందే నగదు బదిలీ పూర్తి అయ్యేలా ఆదేశాలివ్వాలని చెప్పాం. భారాస కార్యకర్తల్లా పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశాం. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను రాష్ట్రంలో నియమించాలని ఈసీని కోరాం’ అని రేవంత్ తెలిపారు.

    పార్టీ మారే ప్రసక్తే లేదు: డీకే అరుణ

    TG: త్వరలో పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని భాజపా నేత డీకే అరుణ ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతలు మైండ్‌ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. భాజపా అదిష్ఠానం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర నాయకత్వంలో పని చేసేందుకు అదృష్టం ఉండాలని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. కాగా, భాజపా నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

    రాజాసింగ్‌ సంచలన ఆరోపణలు

    HYD: భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు ఎన్నికల ప్రచారానికి రానున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తమ ఇద్దరినీ చంపేస్తానని ఫోన్‌ చేసి బెదిరించినట్లు చెప్పారు. దీనిపై నగర పోలీసుల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే చంపేస్తానని నిందితుడు బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలోనే ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వచ్చాయని, పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు.

    మేడిగడ్డ కుంగుబాటుకు కారణమిదే!

    TG: పునాదుల వద్ద ఇసుక తరలివెళ్లడం వల్లే మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్‌కు నష్టం వాటిల్లినట్లు కేంద్ర కమిటీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత దెబ్బతిన్న పియర్స్‌ ఉన్న బ్లాక్‌కు కాఫర్‌డ్యాం నిర్మించి మరింత లోతుగా పరిశీలించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బ్యారేజీకి సంబంధించిన డిజైన్స్‌, డ్రాయింగ్స్‌ వివరాలు పంపితే పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు కమిటీ సూచించినట్లు తెలిసింది.

    నేడు వనపర్తి జిల్లాలో కేసీఆర్ పర్యటన

    TG: సీఎం కేసీఆర్ నేడు నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ పూర్తి చేశారు. తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలో కేసీఆర్‌ పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఆ వెంటనే నాగర్‌కర్నూల్‌తో పాటు వనపర్తి నియోజకవర్గంలోనూ సభకు కేసీఆర్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు కేసీఆర్‌ సభకు భారీగా జనసమీకరణను కూడగట్టేందుకు గులాబీ దళాలు ప్రయత్నిస్తున్నాయి.

    కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డి బరిలో రేవంత్‌!

    TG: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో రేవంత్‌ను కూడా కొడంగల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేయించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కామారెడ్డి నుంచి టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో షబ్బీర్‌అలీకి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ తరఫున ప్రచార బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిసింది.

    తెలంగాణలో కలిసి పనిచేద్దాం: అమిత్‌షా

    తెలంగాణలో భాజపాతో కలిసి పనిచేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సూచించారు. నిన్న అమిత్‌షాతో భేటి అయిన పవన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 40 నిమిషాలపాటు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్‌షా సూచించినట్లు తెలిసింది. అందుకు కిషన్‌రెడ్డి, పవన్‌ అంగీకరించారని సమాచారం. అంతర్గతంగా పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నదీ చెబుతామని వారు అమిత్‌షాకు చెప్పినట్లు సమాచారం. జనసేన 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది.

    పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్!

    అన్ని పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియా స్థానంలో భారత్‌ పదాన్ని ప్రవేశపెట్టాలని NCERT నిర్ణయించింది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మార్పుచేర్పుల కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ‘ప్రాచీన చరిత్ర’కు బదులుగా ‘క్లాసికల్‌ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్టు కమిటీ చైర్‌పర్సన్‌ సి.ఇసాక్‌ తెలిపారు. ముఖ్యంగా ఇండియా పేరును అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లోనూ భారత్‌గా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్లు స్పష్టం చేశారు. 7 వేల ఏళ్లనాటి గ్రంథాల్లోనే భారత్‌ పేరు ఉన్నట్లు చెప్పారు.

    పదవుల కోసం పార్టీ మారలేదు: రాజగోపాల్

    పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. బీజేపీ నేతలు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రజలు నమ్మకం పోయింది. బీజేపీ. బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటే అందుకే కేసీఆర్‌పై పోరాడేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నాను. 100 మంది బీఆర్‌ఎస్ నేతలు ఎంతో కష్టపడితే మునుగోడు ఉపఎన్నిక గెలిచింది. కాంగ్రెస్‌లో ఉంటేనే మీరు గెలుస్తారని ప్రజలు నాతో చెప్పారు’ అని రాజగోపాల్ పేర్కొన్నారు.

    ‘కాంగ్రెస్‌‌ను నమ్మి మోసపోవద్దు’

    ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయిన కర్ణాటక ప్రజలు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు. 24 గంటలా.. 3 గంటల కరెంటు కావాలా? ప్రజలే ఆలోచించుకోవాలి’ అని కేటీఆర్ అన్నారు.