• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పసిడి ప్రియులకు భారీ షాక్‌

    పసిడి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150, రూ.160 చొప్పున పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.56,950కి చేరింది. అటు ముంబయిలో రూ.56,800, చెన్నైలో రూ.57,000, కోల్‌కత్తాలో రూ.56,800, బెంగళూరులో రూ.56,800గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800కు చేరింది. మరోవైపు వెండి సైతం కేజీపై రూ.500 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,500కు చేరింది.

    తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన ఉల్లి

    తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ఉల్లి ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఆగస్టులో రూ.100కి ఆరు కేజీలు ఉన్న ఉల్లి సెప్టెంబరుకి నాలుగు, ప్రస్తుతం రెండు కేజీలకి తగ్గింది. వర్షాలు సరిగాలేక కర్నూలు, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌, చేవెళ్లలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోనూ ఇదీ పరిస్థితి ఉండటమే కారణమని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. నవంబరు రెండో వారంలో స్థానికంగా ఖరీఫ్‌ పంట అందుబాటులోకి రానుండటంతో ధరలు తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్‌ అధికారులు అన్నారు.

    నేటి నుంచి ఓటర్ల చైతన్య యాత్ర

    TG: రాష్ట్రవ్యాప్తంగా 37 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల చైతన్యయాత్ర చేపట్టనున్నట్లు జాగో తెలంగాణ కన్వీనర్‌ ఆకునూరి మురళి తెలిపారు. ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ నుంచి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ యాత్రను ప్రారంభిస్తారన్నారు. 27న తుంగతుర్తిలో, 28న సూర్యాపేట, కోదాడలో, 29న హుజూర్‌నగర్‌, మిర్యాలగూడలో, 30న నల్గొండలో మూడు సమావేశాల చొప్పున జరుగుతాయన్నారు. రెండో విడత యాత్ర నవంబరు 2 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు.

    ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ప్రకటన

    తెలంగాణలో ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఖరారు చేసింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు నవంబర్‌ 14వ తేదీ వరకు గడువు విధించింది. ఆలస్య రుసుంతో డిసెంబరు 20 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు బోర్డు పేర్కొంది.

    వైఎస్సార్‌టీపీకి బైనాక్యులర్‌ గుర్తు

    వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బైనాక్యులర్‌ గుర్తును కేటాయించింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌టీపీ బైనాక్యులర్‌ గుర్తుతో ఎన్నికల భరిలో నిలవనుంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వైఎస్‌ షర్మిల ఇప్పటికే ప్రకటించారు.

    ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ చురకలు

    ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు చురకలంటించారు. తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు కొందరు నేతలు ఎవరి కాళ్లదగ్గర ఉన్నారని విమర్శించారు. ‘పాలమూరు ప్రజలు బొంబయికి వలస పోయినప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది. తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగా ప్రయాణం ప్రారంభించా. ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కొడంగల్‌ రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు నాకు సవాలు విసురుతున్నారు. కేసీఆర్‌ దమ్ము ఏంటో దేశమంతా చూసింది. కొత్తగా చూపాల్సిన అవసరం లేదు’. అని … Read more

    89 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ?

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 89 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. నియోజకవర్గాల వారిగా టికెట్ ఆశిస్తున్న వారిని ఎంపిక చేసింది. ఈ వివరాలతో కూడిన జాబితాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జైలులో ఉన్న చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాలకు 189 మంది పేర్లతో జాబితా రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం.

    మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దే: కవిత

    తెలంగాణలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల్లో తన పార్టీ వంద సీట్లలు గెలుస్తుందన్నారు. ‘కేసీఆర్‌ పథకాల సృష్టికర్త ఆయన ఇతర పార్టీల మేనిఫెస్టోను కాపీ చేయాల్సిన అవసరం లేదు. బీజేపీకి తెలంగాణలో డిపాజిట్లు కూడా రావు ఆ పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌ను ఓడిస్తాం. ప్రజలు కాంగ్రెస్‌ గ్యారంటీలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగాలేరు. ఆ పార్టీ కేవలం ప్రజలను ఓటు బ్యాంకుగానే చూస్తోంది’. అని కవిత విమర్శించారు.

    ఈసారి గజ్వేల్‌‌లో జరిగేది అదే: ఈటల

    గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై బీజేపీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో బీజేపీ సమావేశాలకు రాకుండా బీఆర్‌ఎస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలోను వారు ఇదే చేశారని మండిపడ్డారు. అయినా అక్కడ బీజేపీనే గెలిచిందని చెప్పారు. ఈసారి గజ్వేల్‌లో కూడా అదే జరుగుతుందని ఈటల పేర్కొన్నారు.

    కేసీఆర్‌పై పోటీకి సిద్ధం: రేవంత్‌

    TG: అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. తానైనా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయినా పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తామని తెలిపారు. ‘కేసీఆర్‌, కేటీఆర్‌ను చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొడంగల్‌ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించా. కొడంగల్‌కు పోటీకి కేసీఆర్‌ రాకపోతే కామారెడ్డిలో పోటీకి నేను సిద్ధం. ఉమ్మడి ఏపీ సహా తెలంగాణలో ఎప్పుడూ హంగ్‌ రాలేదు. రెండింట మూడో వంతు మెజారిటీతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది’ అని అన్నారు.