• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అభివృద్దిని చూసి ఓటేయండి: కేటీఆర్

    సిరిసిల్ల నియోజవర్గంలో అభివృద్దిని చూసి ఓటేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్ల ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. కొందరు సోషల్ మీడియాలో నియోజవర్గ అభివృద్దిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ జరిగిన అభివృద్ధి సోషల్ మీడియాల్లో చూపించి వారికి ప్రజలే బుద్ది చెప్పాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, కేజీ టూ పీజీ క్యాంపస్‌లు వచ్చాయి.. సిరిసిల్ల అభిృద్ధిని చూసి ప్రతిపక్షాలు అసూయపడుతున్నాయి’. అని కేటీఆర్ పేర్కొన్నారు.

    దసరా రోజు కన్నతల్లినే కడతేర్చాడు

    TG: వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలో దారుణం జరిగింది. కాశీపూర్‌లో వెంకటేశ్‌ అనే వ్యక్తి కన్న తల్లినే కడతేర్చాడు. అనంతరం తల్లి అంజమ్మ మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి వాగులో పడేశాడు. దసరా రోజు ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడిన వెంకటేశ్‌, విపరీతంగా అప్పులు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ అప్పు తీర్చలేక తల్లిని చంపినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నట్లు వివరించారు.

    తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు

    తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్‌ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పటాన్‌చెరు నుంచి భారాస తరపున టికెట్‌ ఆశించిన నీలం మధు.. అది దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు.

    కాంగ్రెస్ అంటే నాటకం: హరీశ్‌రావు

    TG: కాంగ్రెస్‌ అంటే నాటకమని మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులపై పగపబట్టిందని విమర్శించారు. అందుకే రైతుబంధు ఇవ్వొద్దని ఈసీకి ఫిర్యాదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అంటే మాటలు, మూటలు, ముఠాలు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో గెలవలేని అభ్యర్థులు కూడా నేనే సీఎం అంటున్నారని ఎద్దేవాచేశారు. ఆ పార్టీ నేతలకు పదవుల మీద ఉన్న ధ్యాస పనిమీద లేదని మండిపడ్డారు. ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారని హరీశ్‌రావు నమ్మకం వ్యక్తంచేశారు

    భారాస నేతలకు మావోలు వార్నింగ్

    TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లా BRS నాయకులకి మావోయిస్టులు వార్నింగ్‌ ఇచ్చారు. నేతలు ఇసుక మాఫీయా, భూ కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించినవారి పైన దాడులు చేసి హత్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలపై భారాస నేతలు పెత్తనం చెలయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ అక్రమాలను తక్షణమే ఆపేయాలని, లేకపోతే ప్రజల ముందు శిక్షలు తప్పవంటూ పలు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు.

    ‘భాజపాకు ఓటేస్తే భారాసకు వేసినట్లే’

    TG: భాజపాకు రాజీనామా చేయడంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరా. చర్యలు లేనందునే బయటకు వచ్చా. బీజేపీలో నాకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. హాంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు భారాసకు మద్దతు ఇస్తారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కి ఓటు వేసినట్లే. ప్రజలు నేను కాంగ్రెస్‌లో రావాలని కోరుకుంటున్నారు’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

    రేషన్‌ కుంభకోణం.. మంత్రి అరెస్టు

    బంగాల్ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌ అరెస్టయ్యారు. తెల్లవారుజామున ఆయన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. జ్యోతిప్రియో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి మాజీ వ్యక్తిగత సహాయకుడి నివాసంతో పాటు మొత్తం 8 ఫ్లాట్లలో తనిఖీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. 20 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం మంత్రిని తన ఇంట్లో అరెస్టు చేసి, ఈడీ కార్యాలయానికి తరలించారు.

    ‘నేర చట్టాల్లో సమూల మార్పులు’

    హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో 75వ బ్యాచ్‌ ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి అమిత్‌షా ట్రైనీ ఐపీఎస్‌లను ఉద్దేశించి మాట్లాడారు. ‘కర్తవ్య నిర్వహణలో అమరవీరుల బలిదానం ప్రేరణ కావాలి. హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్ఠంగా పోరాడాలి. CRPC, IPC, ఎవిడెన్స్‌ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి పార్లమెంట్ ముందుంచింది. త్వరలోనే నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుంది’ అని షా అన్నారు. #WATCH | Hyderabad: Union Home … Read more

    దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు: APPSC

    AP: రాష్ట్రంలోని దివ్యాంగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో వారికి 4 శాతం రిజ్వరేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది రానున్న నోటిఫికేషన్ల నుంచే ఈ రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ 3 శాతం రిజర్వేషన్లను దివ్యాంగులకు ఏపీపీఎస్సీ అమలు చేస్తూ వచ్చింది. తాజాగా దానిని 4 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    నేడు సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన

    TG: ఐటీ మంత్రి కేటీఆర్‌ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో భారాస ఆధ్వర్యంలో జరగనున్న యువ ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో రెండు వేలకు పైగా యువత పాల్గొనే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డు నుంచి 50 మంది చొప్పున 39 వార్డులకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వెల్లడించారు.