• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ అప్పుడే?

    ఏపీ ఎన్నికలకు మార్చిలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముందని రాష్ట్ర ఎన్నికల చీఫ్‌ ముకేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఇప్పటివరకూ 10 లక్షల బోగస్‌ ఓట్లను తొలగించినట్లు చెప్పారు. ఓటర్ల జాబితాపై ఎమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబరు 9 లోపు ఎవరైనా తెలపవచ్చని అన్నారు. డిసెంబరు 26 లోగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తుది ఓటర్ల జాబితాను 2024 జనవరి 5న ప్రకటిస్తామని రాష్ట్ర ఈసీ చీఫ్‌ స్పష్టం చేశారు. ఎన్నికలకు భెల్‌ కంపెనీకి చెందిన EVMలను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

    నేడు చంద్రగ్రహణం.. తిరుమల మూసివేత

    నేడు శారద పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై ఉండనుంది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. దీంతో నేటి రాత్రి నుంచే అన్ని దేవాలయాల తలుపులు మూతపడనున్నాయి. 8 గంటల పాటు ఇది కొనసాగుతుంది. తిరుమల ఆలయాన్ని సైతం రాత్రి 7.05 గం.లకు మూసివేయనున్నారు. తిరిగి రేపు తెల్లవారుజామున 3.15 గం.లకు తెరుస్తారు.

    తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్‌

    AP: అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. ఈ నెల 24 నుంచి 27 తేదీల మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయ ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. వాటి సంచారం ట్రాప్‌ కెమెరాల్లో రికార్డయ్యిందని తెలిపింది. కాబట్టి భక్తులు అప్రమత్తంగా ఉంటూ గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ కోరింది. ఇటీవల కాలంలో తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

    ‘హైదరాబాద్‌కు అమరావతి గతే’

    TG: కేసీఆర్‌ మళ్లీ సీఎం కాకపోతే హైదరాబాద్‌కు అమరావతి గతే పడుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భయపడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ‘సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇవన్నీ కేసీఆర్‌ వల్లే సాధ్యమయ్యాయి. హీరోలు సన్నీడియోల్‌, రజనీకాంత్‌లు హైదరాబాద్‌ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారు. పక్క రాష్ట్రంలో ఉన్న రజనీలకు ఇక్కడి అభివృద్ధి అర్థమవుతోంది గానీ, ఇక్కడే ఉన్న గజినీలకు అర్థం కావడం లేదు’ అని అన్నారు.

    UGC NET దరఖాస్తుల గడువు పొడిగింపు

    UGC-NET పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగించారు. తొలుత నిర్ణయించిన గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా గడువు పెంచుతూ ఎన్‌టీఏ-యూజీసీ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అభ్యర్థులు అక్టోబర్‌ 31వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో https://ugcnet.ntaonline.in/ దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే, దరఖాస్తు రుసుం చెల్లింపు గడువును సైతం అక్టోబర్‌ 31వరకు వరకూ పొడిగించారు.

    అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం

    తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్‌ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాలో రికార్డయింది. దీంతో నడక దారి భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గుంపులు గంపులుగా వెళ్లాలని తెలిపింది. మరో వైపు చిరుత, ఎలుగబంటిని బంధించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.

    45 మంది పేర్లతో కాంగ్రెస్ రెండో జాబితా

    తెలంగాణలో అంబ్లీ ఎన్నికల సంబంధించి కాంగ్రెస్ రెండో విడతా జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. గద్దర్ కూతురికి సికింద్రాబాద్ కంటోన్నెంట్ సీటు ఖరారు చేసింది, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేష్, హుస్నాబాద్ నుంచి పొన్నం సుధాకర్, జూబ్లీహిల్స్ నుంచి హజారుద్ధిన్‌ను భరిలో నిలవనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

    కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. టీకాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా మరికొందరు సీనియర్‌ రాజకీయ నేతలు హస్తం గూటికి చేరారు. నేడు జాతీయ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్‌, కపిలవాయి దిలీప్‌ కుమార్‌తో పార్టీలో చేరారు. వీరందరికీ ఖర్గే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.

    పట్టాల మద్య ఇరుక్కుపోయిన ట్రాక్టర్

    TS: నల్గొండ జిల్లా కుక్కడం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల మధ్య ట్రాక్టర్ ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించిన ట్రాక్టర్ బయటకు రాలేదు. స్థానికులు 100 డైయల్ చేసి సమాచారం అందించారు. దీంతో గుంటూరు నుంచి హైదరాబాద్ వెల్లే పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను కుక్కడం రైల్వే స్టేషన్‌లో అధికారులు ఆపేశారు. చివరకు జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను బయటకు తీశారు. అరగంట తర్వాత రైలు ముందుకు కదిలింది.

    బీజేపీ రెండో జాబితా విడుదల

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మహబూబ్‌నగర్ అసెంబ్లీకి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది. త్వరలోనే పూర్తిస్థాయి జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అయితే ప్లాన్ ప్రకారమే బీజేపీ రెండో జాబితాలో ఒక్క అభ్యర్థి పేరు మాత్రమే ప్రకటించిందని టాక్ నడుస్తోంది.