• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు తెలంగాణకు రాహుల్, ప్రియాంక

    నేడు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు. సాయంత్రం 3:30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్న రాహుల్‌, ప్రియాంక.. బేగంపేట్‌ నుంచి హెలికాప్టర్‌లో రామప్ప టెంపుల్‌కు చేరుకోనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల తర్వాత సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. రామప్ప గుడి నుంచి బయల్దేరనున్న బస్సు యాత్ర ములుగు చేరుకోనుంది. ములుగులో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్, ప్రియాంకలు ప్రసంగిస్తారు.

    అరవింద్ చౌకబారు మాటలొద్దు: కవిత

    నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ‘ఎంపీ అరవింద్ నన్ను అన్న మాటలను మీ ఇంట్లో ఆడబిడ్డలను అంటే ఊరుకుంటారా ప్రజలారా ? వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషించే రాజకీయాలను అనుమతిద్దామా ? వ్యక్తిగత కక్ష్యలకు తెలంగాణలో తావులేదు. అంశాల వారీగా మాట్లాడితే ధీటుగా సమాధానం చెప్పే ధైర్యం నాకుంది. చౌకబారు మాటలు మాట్లాడితే ప్రజలకు చులకన అవుతారు. ఇకనైన అరవింద్ తన పద్దతి మార్చుకోవాలి’ అని సూచించారు.

    నేడు మేడ్చల్, జడ్చర్లలో కేసీఆర్ సభ

    నేడు పాలమూరులో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. జడ్చర్ల, మేడ్చల్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోపై ప్రజలకు వివరిస్తారు. ఈ రెండు సభలకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. జడ్చర్లలో ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి, మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విస్తృత ఏర్పాట్లు చేశారు.

    TS Elections: పట్టుబడ్డ నగదు ఎంతో తెలుసా?

    తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి డబ్బు, మద్యం, ఆభరణాలు, విలువ మొత్తం రూ.130 కోట్ల మార్కును దాటింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు రూ.21,84,92,242 విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.71 కోట్లకు పైగా నగదు, 52,091 లీటర్ల మద్యం, స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మొత్తం రూ.7,55,79,917. రూ.4,58,4,720 విలువైన 1,694 కేజీల గంజాయి పట్టుబడిందని అధికారులు వెల్లడించారు.

    TS Elections: పట్టుబడ్డ నగదు ఎంతో తెలుసా?

    తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి డబ్బు, మద్యం, ఆభరణాలు, విలువ మొత్తం రూ.130 కోట్ల మార్కును దాటింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు రూ.21,84,92,242 విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.71 కోట్లకు పైగా నగదు, 52,091 లీటర్ల మద్యం, స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మొత్తం రూ.7,55,79,917. రూ.4,58,4,720 విలువైన 1,694 కేజీల గంజాయి పట్టుబడిందని అధికారులు వెల్లడించారు.

    ప్రజలకు నేనే సీఎం కావాలని ఉంది: జానారెడ్డి

    ప్రజల మనసులో తానే సీఎం కావాలని ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఏ పదవీ కోరుకోవట్లేదు. సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో. ఏ పదవి వచ్చినా కాదు అనను 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చా మంత్రి గా అన్ని శాఖలను నిర్వహించా 36 ఏళ్లకే మంత్రిని అయ్యా. నాకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. నాకు ఏ పదవులైనా వాటంతట అవే వస్తాయి’’ అని జానారెడ్డి అన్నారు.

    ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు

    తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు , రత్నాల వల్ల కలిగే వేడిని, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇనుమడింపజేసుకొని ఉత్సాహాన్ని, ప్రశాంతతను పొందుతారు.

    సిద్ధాంతాల మీద ఓట్టు అడుగుదాం: రేవంత్

    పక్క రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌కు భారీగా నిధులు సమకూరుతున్నాయన్న వార్తలను రేవంత్ రెడ్డి ఖండించారు. కావాలనే బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో మీరు మద్యం, డబ్బు పంచడం వల్ల బీఆర్ఎస్ గెలిచిందని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు చెబుతున్నా.. డబ్బు, మద్యం పక్కన పెడుదాం. ఈ ఎన్నికల్లో కేవలం సిద్ధాంతాల మీద ప్రజలను ఓట్లు అడుగుదాం. మాతో కలిసొచ్చే దమ్ము బీఆర్‌ఎస్‌కు ఉందా అని ప్రశ్నించారు.

    కాంగ్రెస్‌తో పెను ప్రమాదం: కేసీఆర్

    సిరిసిల్ల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ విపక్షాలపై విరుచుకపడ్డారు. ప్రతిపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ పెద్దలు చెబుతున్నారని మడిపడ్డారు. ధరణి రద్దయితే మళ్లీ వీఆర్వోలు వచ్చి పెత్తనం చేస్తారని చెప్పారు. ధరణి పోర్టల్‌ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందని ఆరోపించారు.. రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. ధరణి ఉండాలో?.. రద్దు కావాలో? రైతులే నిర్ణయించుకోవాలి కేసీఆర్ సూచించారు.

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్

    గన్ పార్క్‌ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేసేందుకు వచ్చిన ఆయన్ను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందునా అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దీంతో రేవంత్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో ఉద్రిక్తతలు పెరగడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.