• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తల్లిని కూడా కలవనివ్వరా?: భువనేశ్వరి

    ఏపీ పోలీసులు తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. రాజమండ్రిలో చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారు. తల్లిని కలిసేందుకు వస్తే తప్పేంటి అని ధ్వజమెత్తారు.

    సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఛాలెంజ్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు. ఈమేరకు మధ్యాహ్నం తాను అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లనున్నట్లు చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున మద్యం, డబ్బు సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభపెట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

    ఎమర్జెన్సీ విడుదలపై కంగనా కీలక ప్రకటన

    కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ విడుదల గురించి ఆమె అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాను మందుగా అనుకున్న సమయానికి నవంబర్ 24న విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా ఇటీవల చంద్రముఖి 2 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులు అయితే పడ్డాయి.

    నేడు సిరిసిల్ల, సిద్దిపేటలో కేసీఆర్ సభలు

    నేడు సిరిసిల్ల, సిద్దిపేటలో జరగనున్న బీఆర్ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. తొలుత సిరిసిల్ల ఆ తర్వాత సిద్దిపేట సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొంటా రు. ఈమేరకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్ష మందితో జరిగే సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సిద్ధిపేటలో సుమారు 20 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సిరిసిల్ల, సిద్ధిపేట పట్టణాలు గులాబీమయం అయ్యాయి.

    ఏసీ బస్సుల్లో టికెట్ ధర రూ.30 పెంపు

    దసరా పండుగ వేళ.. తెలంగాణ ఆర్టీసీ, ఏసీ బస్సుల్లో టికెట్ ధర రూ.30 పెంచేసింది. ప్రయాణికులు ప్రయాణించే దూరంతో సంబంధం లేకుండా టికెట్ ధర రూ.30 పెంచింది. లహరీ, గరుడ, గరుడ ప్లస్, రాజధాని బస్సులో ధరల పెంపు వర్తిస్తుంది. అయితే టికెట్ తీసుకున్న ప్రయాణికుడికి తృణ ధాన్యాలతో కూడిన స్నాక్ ప్యాకెట్ అందిస్తారు. దీనిని వద్దనేందుకు ప్రయాణికులకు ఛాయిస్ లేదు. టికెట్ ధరలో స్నాక్ పాకెట్ ధరను చేర్చారు. అందువల్ల టికెట్ రేటు రూ.30కి పెరిగింది.

    తెలంగాణ ఏమైనా పాకిస్తానా?: కోమటి రెడ్డి

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మద్దతు తెలిపారు. తెలంగాణ ఏమైనా పాకిస్తానా? హైదరాబాద్లో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంది. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి జరిగింది. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కమ్మవారే కాదు అన్ని కులాల వాళ్లు బాబు కోసం ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది. వారిని అడ్డుకోవడం అన్యాయం. తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అని ప్రభుత్వంపై కోమటిరెడ్డి మండిపడ్డారు.

    రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నాడు: నాగం

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి..డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు.. నాగర్‌ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తా. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తుండు. రాష్ట్రంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాకుండా ఎన్నికల కోసం పారాషూట్ లో వచ్చిన నాయకులకు టికెట్లు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు. తండ్రి బీఆర్ఎస్ పార్టీలో … Read more

    భారీగా తగ్గిన బంగారం ధర

    కొన్నిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 310 తగ్గి రూ.55,100కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.340 తగ్గి రూ. 60,110కు పడిపోయింది. అటు కిలో వెండి ధర రూ. 500 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 77,500కు ఎగబాకింది. అటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

    చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం నేడు తీర్పు

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనను అరెస్ట్ చేశారని ఆ కేసును కొట్టివేయాలని చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 23 నుంచి ఈ కేసు విచారణలు వాయిదా పడుతూ వస్తోంది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు.

    ఇంటింటికి కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డుల పంపిణీ

    వికారాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌ 6 గ్యారంటీ కార్డుల పంపిణీ చేశారు. ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ అందివ్వనున్న 6 గ్యారంటీలను ప్రజలకు ఆయన వివరించారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తికాకపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. ఆడబిడ్డ ఆత్మహత్యపై కేటీఆర్‌ అబద్దాలు చెబుతున్నారన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించడంటూ ఓటర్లను కోరారు.