• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది: కేసీఆర్

    జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది. ప్రస్తుతం భువనగిరి ప్రశాంతంగా ఉంది. రెవెన్యూలో అవినీతి తగ్గించేందుకే ధరణి తీసుకొచ్చాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తుంది. కాంగ్రెస్‌ వస్తే పైరవీకారులు, దళారులు రాజ్యమేలుతారు. భువనగిరిలో స్పెషల్‌ ఐటీ హబ్‌, ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం. భువనగిరిలో 50వేల మెజార్టీలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

    రూ.3.04 కోట్లు హవాలా సొమ్ము స్వాధీనం

    నల్గొండ జిల్లా అక్రమంగా తరలిస్తున్న రూ.3.04 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.18 లక్షల విలువగల కారును సీజ్ చేశారు. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ ప్రాంతం మాడ్గులపల్లి టోల్‌గేట్‌ వద్ద పోలీసులు తనిఖీ ఈ డబ్బు పట్టబడింది. జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.7.39 కోట్ల నగదు, రూ.40 లక్షల విలువగల మద్యం రూ.1.71 కోట్ల విలువగల గంజాయి పట్టుబడింది.

    దశ దిశ మార్చే సమయమొచ్చింది: రేవంత్

    ఎన్నికల ద్వారా తెలంగాణ దశ దిశ మార్చే సమయమొచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. వికారాబాద్‌కు కృష్ణా జలాలు, ఎంఎంటీఎస్‌ రైలు రాకపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఎంతో కష్టపడి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మంజూరు చేయించారని తెలిపారు. ఉద్యోగ పరీక్ష జరగలేదనే బెంగతో మొన్న యువతి ఆత్మహత్య చేసుకుందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

    జనగామకు KCR హామీల వర్షం

    జనగామ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామని తెలిపారు. జనగామ జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జనగామకు ఐటీ, పారిశ్రామికంగా విసృత అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నందువల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

    కేసీఆర్‌కు మా సంపూర్ణ మద్దతు: ఒవైసీ

    తెలంగాణ ఎన్నికల్లో సంపూర్థ మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ ప్రకటించారు. పేదల కోసం కేసీఆర్‌ చాలా పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. బీఆర్‌ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. కేసీఆర్‌ తెలంగాణకు హ్యాట్రిక్‌ సీఎం అవుతారని అసదుద్ధీన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సుఖశాంతుల కోసం మూడోసారి కేసీఆర్‌ను గెలిపించాలని ప్రజలకు ఒవైసీ విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందేనని విమర్శించారు.

    బీఆర్‌ఎస్‌లో చేరిన పొన్నాల

    కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. జనగామ బహిరంగ సభలో పొన్నాల సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పొన్నాలకు పార్టీలో సుముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఉండి ఎన్నో అవమానాలకు గురయ్యానని పొన్నాల అన్నారు. 45 ఏళ్లు కష్టపడినా పలితం దక్కలేదన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌లో చేరానని పొన్నాల పేర్కొన్నారు.

    గెలిపిస్తే సికింద్రాబాద్‌ను స్వర్గం చేస్తా: కేఏ పాల్

    ఎన్నికల్లో తనను గెలిపిస్తే సికింద్రాబాద్‌ను స్వర్గం చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నేడు తుకారం గేట్‌లోని మాంగర్ బస్తీలో పాల్ ఎన్నికల ప్రచారం నిర్శహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు తన పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని కేఏ పాల్ సూచించారు.

    ‘తెలంగాణలో 87 స్థానాల్లో టీడీపీ పోటీ’

    తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ టీ-టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. 87 స్థానాల్లో పోటీకి అభ్యర్థులు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై జైలులో ఉన్న చంద్రబాబుతో చెర్చించినట్లు కాసాని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉందని చెప్పారు. జనసేనతో ముందుకెళ్లాలా? లేదా? అనేది చర్చిస్తామని చెప్పారు. త్వరలోనే అభ్యర్థులు ఖరారు, మేనిఫెస్టో విడుదల చేస్తామని కాసాని వెల్లడించారు.

    భారీగా హవాలా సొమ్ము సీజ్

    హైదరాబాద్‌లో పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బులు పట్టుబడ్డాయి. వనస్ఠలీపురంలో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నరూ. 29.40 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కావటిగూడలో రూ. 2.80 కోట్లు హవాలా సొమ్ము పట్టుబడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను పోలీసులో అదుపులోని తీసుకున్నారు. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలీసులు రాష్ట్రంలో ముమ్మర తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే..

    కేసీఆర్‌పై రాజ్‌నాథ్ నిప్పులు

    జమ్మికుంటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రెండు సార్లు ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగులు పరిక్ష రాసే పరిస్థితి లేదు. నిరుద్యోగ భృతి అన్నారు అది ఇవ్వలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేశారు అని మండిపడ్డారు.