• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రవితేజ క్యారెక్టర్ వేరే లెవెల్; చిరంజీవి

    ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో మాస్ మహరాజా క్యారెక్టర్ వేరే లెవెల్ అని మెగాస్టార్ చిరంజీవి అన్నాడు. రవితేజ నటన ఈ చిత్రానికే హైలెట్ అవుతుందని చెప్పారు. ‘వాల్తేరు వీరయ్య’ ప్రి రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా పక్కా కమర్షియల్ అని చెప్పారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని పేర్కొన్నారు. డైరెక్టర్ బాబీ ఈ చిత్రానికి తీవ్రంగా శ్రమించారని తెలిపారు. శృతిహాసన్, కేథరిన్ నటన అద్భుతమన్నారు. కాగా ‘వాల్తేరు వీరయ్య’ ఈ నెల 13న రిలీజ్ కానుంది.

    ఆమిగోస్‌గా భయపెడుతున్న కళ్యాణ్ రామ్

    మరో వినూత్నమైన కథాంశంతో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఆమిగోస్ నుంచి టీజర్ రిలీజైంది. ఎలాంటి బయోలాజికల్ కనెక్షన్ లేకుండా ఒకే రూపంలో ఉండే ముగ్గురి పాత్రల్లో కళ్యాణ్ రామ్ నటించారు. ఇలా ముగ్గురు వ్యక్తులు కలవడం వెనుక ఓ సిక్రెట్ ఆపరేషన్ ఉందని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. కాగా ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఆశిఖ రంగానాథన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమిగోస్ ఫిబ్రవరి 10న విడుదల కానుంది.

    వాల్తేరు వీరయ్య ట్రైలర్ వచ్చేసింది

    ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ వచ్చేసింది. మెగాస్టార్ వింటేజ్ లుక్‌లో అదరగొట్టాడు. ‘సిటీకి ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. వీరయ్య లోకల్’ అంటూ సాగుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. చిరంజీవిని ఈ లుక్కులో చూసి గ్యాంగ్ లీడర్‌ సినిమాను ప్రేక్షకులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఈ సినిమా మ్యూజికల్‌గా హిట్ సాధించింది. డైరెక్టర్ బాబీ సినిమాను తెరకెక్కించగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రవితేజ అతిథి పాత్రలో నటించాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.

    ట్రెండింగులో ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్

    బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. విడుదలైన 20 గంటల్లోనే 6.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ని దక్కించుకుని ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. లక్షల్లో లైక్స్‌ని సంపాదిస్తోంది. బాలయ్య మాస్ డైలాగులు, ఎలివేషన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలను కూడా డైలాగుల ద్వారా పరోక్షంగా ప్రస్తావించడం, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కడంతో అభిమానులు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. ట్రైలర్‌ని చూస్తుంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు గుర్తుకొస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు.

    థియేటర్ల వద్ద మహేష్ ఫ్యాన్స్ హంగామా

    [VIDEO:](url) తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు సూపర్ స్టార్ నినాదంతో మారుమోగుతున్నాయి. మహేశ్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రధాన నగరాల్లోని థియేటర్లు అభిమానుల కోలాహలంతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడలోని అలంకార్ థియేటర్, హైదరాబాద్‌లోని దేవి థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. భారీ కటౌట్లు, హోర్డింగులు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాతలు రీ రిలీజ్ చేశారు. #Okkadu Celebrations at Alankar … Read more

    తెలుగు రాష్ట్రాల్లో ‘ఒక్కడు’ మేనియా

    సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, భూమిక హీరోయిన్‌గా నటించిన ‘ఒక్కడు’ మూవీని 4Kలో రీ రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడు సినిమా ప్రదర్శిస్తున్నథియేటర్ల వద్ద మహేష్ అభిమానులు [సందడి](url) చేస్తున్నారు. బైక్ ర్యాలీలు చేస్తూ కోలాహలంగా ఉన్నారు. కాగా ‘ఒక్కడు’ సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2003లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 8 నంది అవార్డులను కొల్లగొట్టింది. గుణశేఖర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఎంఎస్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. At pratap theatre, … Read more

    సూపర్.. ట్రైలర్ అదిరింది

    బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ విడుదలైంది. ‘తనది ఫ్యాక్షన్ కాదు.. సీమపై ఎఫెక్షన్’ వంటి మాస్ డైలాగులతో ట్రైలర్ హోరెత్తిపోతోంది. ఒక్క ట్రైలర్‌లో ఎన్నో డైలాగులను ఇమిడ్చి సినిమాపై అంచనాలు పెంచేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. శ్రుతిహాసన్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది.

    LIVE: వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్

    వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ప్రారంభమైంది. బాలయ్యను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వీరసింహారెడ్డిలో పనిచేసిన యూనిట్ సభ్యులు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. బాలకృష్ణ మాట్లాడే క్షణాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జై బాలయ్య నినాదాలతో ఒంగోలు గ్రౌండ్ మార్మోగుతోంది. ఈకార్యక్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

    అదిరిపోయిన సమంత ‘శాంకుతలం’ RR

    గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఫిబ్రవరి 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. తాజాగా సినిమా రీరికార్డింగ్ పనులకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. RR వింటుంటే బాహుబలి లాంటి అనుభూతి కలుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    ‘వీరసింహారెడ్డి’ ప్రీరిలీజ్ వేడుకకు అనుమతి నిరాకరణ

    నటసింహం బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నెల 6న ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. ఏబీఎం కళాశాల మైదానం ఈ వేడుకకు వేదిక కావడంతో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశముందని భావించి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈవెంట్‌ని ఎక్కడ నిర్వహించాలనే విషయంపై చిత్ర నిర్మాతలు సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. ఇటీవల టీడీపీ సభల్లో పలువురు మరణించిన సంగతి తెలిసిందే. His Mass Craze … Read more