బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ విడుదలైంది. ‘తనది ఫ్యాక్షన్ కాదు.. సీమపై ఎఫెక్షన్’ వంటి మాస్ డైలాగులతో ట్రైలర్ హోరెత్తిపోతోంది. ఒక్క ట్రైలర్‌లో ఎన్నో డైలాగులను ఇమిడ్చి సినిమాపై అంచనాలు పెంచేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. శ్రుతిహాసన్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది.