• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాడీ షేమింగ్‌పై స్పందించిన హనీ రోజ్

  వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది నటి హనీ రోజ్. తన అందచందాలతో తెలుగు ఆడియెన్స్‌ని మెప్పించిన హనీ.. తాజాగా బాడీ షేమింగ్ ఆరోపణలు ఎదుర్కొంది. వీటిపై నటి ఘాటుగా స్పందించింది. కొన్నిసార్లు ప్రజలు చేసే ఆరోపణలు హీరోయిన్ల సినిమాలపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ప్రచార కార్యక్రమాల్లో చీరకట్టులో హాజరవడంపై స్పందిస్తూ తనకు అలా ఉండటం ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాల్లోనూ ప్రతికూల వ్యాఖ్యలు వస్తున్నాయని గుర్తు చేసింది. ఏదేమైనా నచ్చినట్లు ఉంటూ జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటానని ఈ మలయాళ కుట్టీ క్లారిటీ … Read more

  మరీ ఇంత అందమేంటి బాసూ..!

  [VIDEO:](url) వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ‘హనీ రోజ్’. తన చక్కనైన అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో హనీ రోజ్ బ్యూటీని చూసి నెటిజన్లు తెగ్ పొగుడుతున్నారు. ఇంత అందమేంటి బాసూ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/reel/CorusYRj99e/?utm_source=ig_web_copy_link Courtesy Instagram:HoneyRose Courtesy Instagram:

  తెలంగాణ నేపథ్యంలో బాలయ్య సినిమా

  బాలయ్యతో డైరెక్టర్ అనిల్ రావిపూడి తీయబోయే సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్నట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి ఈ విషయాన్ని వెల్లడించారు. వీరసింహారెడ్డి రాయలసీమలో దిగితే.. వచ్చే సినిమాలో తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాడంటూ హింట్ ఇచ్చాడు. అంతేగాకుండా తెలంగాణ యాసలో అనిల్ రావిపూడి డైలాగ్ చెప్పే ప్రయత్నం చేశాడు. వచ్చే సినిమాలో ఫ్లాష్ బ్యాక్, తండ్రీకుమార్తెల మధ్య ఎమోషనల్ డ్రామా ఉండే అవకాశం ఉంది.

  రామాయణం అలా.. మహాభారతం ఇలా..!

  మనం ఎలా బతకాలో రామాయణం సూచిస్తుందని.. ప్రస్తుతం ఎలా నడుచుకుంటున్నామో మహాభారతం చెబుతోందని బాలకృష్ణ వెల్లడించారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో బాలయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు పంచుకున్నారు. డైరెక్టర్‌తో మెలిగిన తీరును వివరించారు. ఈ కార్యక్రమానికి వీరసింహారెడ్డి చిత్రబృందంతో పాటు, డైరెక్టర్లు హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, శివనిర్వాణ, యువ నటులు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

  ఈ వారం(January 20) విడుదలవుతున్న తెలుగు చిత్రాలు, ఓటీటీ విడుదలలు 

  సంక్రాంతికి విడుదలైన సినిమాల మేనియా ఈ వారం కూడా కొనసాగుతోంది. పండుగకి విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో మరికొన్ని రోజుల పాటు విజయవంతంగా ఈ సినిమాలు థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి. అయితే, ఈ వారం పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. కానీ, ఓ సినిమా మాత్రం అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. విద్యవాసుల అహం- జనవరి 20 రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘విద్యవాసుల అహం’. మనికాంత్ దర్శకత్వం వహించాడు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన … Read more

  నేను ఆ ముగ్గురినే నమ్ముతా; బాలకృష్ణ

  తాను సినిమాల విషయంలో ముగ్గురిని మాత్రమే నమ్ముతానని సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్‌ను పూర్తిగా నమ్ముతానని చెప్పారు. ‘వీరసింహారెడ్డి’ విజయంతో మూవీ టీమ్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ‘‘తాను నటించిన ‘వీరసింహారెడ్డి’ని ఆదరించినందుకు కృతజ్ణతలు. ఈ సినిమా కోసం ప్రతి డిపార్ట్‌మెంట్ తీవ్రంగా కృషి చేసింది. తమన్ పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారు. మంచి ఔట్‌పుట్ రాబట్టగలిగే సత్తా గోపీచంద్‌కు ఉంది.’’ అంటూ బాలయ్య పేర్కొన్నారు.

  అమెరికా థియేటర్లలో బాలయ్య ఫ్యాన్‌ రచ్చ రచ్చ

  అమెరికాలోని ఓ థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్‌ నానా హంగామా చేశారు. వీరసింహారెడ్డి షో మొదలుకాగానే కాగితాలు చింపి రచ్చ రచ్చ చేశారు. జై బాలయ్య, జైజై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో మిగతా ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. వెంటనే స్పందించిన థియేటర్ యాజమాన్యం కేకలు వేస్తున్న ప్రేక్షకులను బయటకు పంపించింది. గతంలో చాలా తెలుగు సినిమాలు ప్రదర్శించామని ఈ స్థాయిలో ఫ్యాన్స్ హంగామా చూడలేదని సిబ్బంది వెల్లడించారు. మరోవైపు వీరసింహారెడ్డి మిక్స్‌డ్ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. GOD OF MASSES కి ఘనస్వాగతం ? … Read more

  ఈ వారం (Jan 13, 14) విడుదలవుతున్న చిత్రాలు, ఓటీటీ విడుదలలు

  తునివు / తెగింపు – 11 January సంక్రాంతి బరిలో పోటీపడుతున్న తమిళ చిత్రం ‘తునివు’. తెలుగులో ‘తెగింపు’గా విడుదలవుతోంది. జనవరి 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరిసు – 11 January తమిళ నటుడు విజయ్ ‘వరిసు’ చిత్రంతో వస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. తమన్ సంగీతం అందించాడు. వీరసింహారెడ్డి – 12 January బాలయ్య డ్యుయల్ రోల్ పోషించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ కథానాయిక. గోపీచంద్ మలినేని డైరెక్ట్ … Read more

  ‘అన్‌స్టాపబుల్’లో వీరసింహారెడ్డి టీం

  బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో ‘వీరసింహారెడ్డి’ టీం సందడి చేసింది. డైరెక్టర్ గోపీచంద్, నటీనటులు ఈ ఎపిసోడ్‌కి హాజరయ్యారు. వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్‌లను బాలయ్య సరదాగా ఆటపట్టించారు. గోపీచంద్ మలినేని వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకున్నారు. ‘నేనే హైపర్ అనుకుంటే.. బాలయ్య నాకన్నా హుషారుగా ఉన్నారు’ అంటూ వరలక్ష్మి మాట్లాడింది. ఇంటర్వెల్ సీన్ ఒకే చెప్పిన సందర్భంలోనే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందంటూ గోపీచంద్ బాలయ్యతో చెప్పాడు. ఈ నెల 12న సినిమా విడుదల కానుండగా.. ఈ ఎపిసోడ్ 13న ప్రసారం కానుంది.

  USలో బాలయ్య అభిమానుల రచ్చ

  [VIDEO](url):సంక్రాంతి బరిలో మాస్‌ జాతర మొదలైంది. బాలయ్య ‘వీర సింహారెడ్డి’ రేపు థియేటర్లలో రాబోతోంది. అయితే ఇప్పటికే యూఎస్‌లో సందడి మొదలైంది. నందమూరి అభిమానులు అమెరికా వీధుల్లో కార్లతో సందడి చేస్తున్నారు. పార్కింగ్‌ ప్లేస్‌లో కార్లతో NBK అంటూ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని సినిమా దర్శకుడు గోపిీచంద్ మలినేని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. NBK’S #veerasimhareddy ?mania in Kansas City., USA on SUNDAY pic.twitter.com/fo4DpgiXJi — Gopichandh Malineni (@megopichand) January 11, 2023