బాలయ్యతో డైరెక్టర్ అనిల్ రావిపూడి తీయబోయే సినిమా తెలంగాణ బ్యాక్డ్రాప్లో సాగనున్నట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో అనిల్ రావిపూడి ఈ విషయాన్ని వెల్లడించారు. వీరసింహారెడ్డి రాయలసీమలో దిగితే.. వచ్చే సినిమాలో తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాడంటూ హింట్ ఇచ్చాడు. అంతేగాకుండా తెలంగాణ యాసలో అనిల్ రావిపూడి డైలాగ్ చెప్పే ప్రయత్నం చేశాడు. వచ్చే సినిమాలో ఫ్లాష్ బ్యాక్, తండ్రీకుమార్తెల మధ్య ఎమోషనల్ డ్రామా ఉండే అవకాశం ఉంది.