• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాలయ్య దెబ్బకు యూట్యూబ్ షేక్

  బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ మూవీ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది. ఈ టీజర్ 12 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి దూసుకెళ్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో నంబర్‌ 1గా ట్రెండవుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

  భగవంత్ కేసరి టీజర్ వచ్చేసింది

  బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘భగవంత్ కేసరి’ నుంచి టీజర్ విడుదలైంది. ‘నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటాది’ అని చిత్రబృందం ప్రచారం చేస్తోంది. ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. పక్కా తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా తెరకెక్కింది. కాజల్ బాలయ్య సరసన నటిస్తోంది. శ్రీలీల బాలయ్యకు కూతురిగా కనిపించనుంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ విడుదలైంది.

  NBK 108లో బాలీవుడ్ నటుడు

  బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నటిస్తున్నాడు. అర్జున్‌ రాంపాల్‌కు వెల్‌కమ్ చెబుతూ చిత్రబృందం వీడియోను విడుదల చేశారు. ఇందులో ఫ్లూటు జింక ముందు ఊదూ సింహం ముందు కాదు అని బాలయ్య డైలాగ్ చెప్పాడు. బాలకృష్ణ, అనిల్‌తో కలిసి పనిచేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేసిన రాంపాల్.. వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో శ్రీ లీల, కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

  మళ్లీ పాట పాడిన బాలయ్య.. రచ్చ రచ్చే

  నందమూరి బాలకృష్ణ మరోసారి గొంతు సవరించారు. దోహాలో జరిగిన కార్యక్రమంలో లైవ్‌లో పాట పాడి అలరించారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖతార్‌లోని దోహాలో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా బాలయ్య పాల్గొన్నారు. అభిమానులు పాట పాడమని కోరగా.. ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుని కథ నుంచి శివశంకరీ పాటను ఆలపించారు. ఫిదా అయిన అభిమానులు.. చప్పట్ల మోత మోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. Standing ovation for #Balakrishna singing live in Doha yesterday. My friend … Read more

  బెజవాడ చేరుకున్న రజినీకాంత్

  సూపర్‌స్టార్ రజినీకాంత్ నేడు విజయవాడ విచ్చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు నందమూరి బాలకృష్ణ ఘనస్వాగతం పలికారు. కాగా శుక్రవారం విజయవాడలోని పోరంకిలో ఉన్న అనుమోలు గార్డెన్స్‌లో జరిగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు తలైవా బెజవాడ విచ్చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్నవారికే గార్డెన్స్‌లోకి అనుమతించనున్నారు. సాయంత్రం శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. #SuperstarRajinikanth off to vijayavada to attend #SrNtr Centenary Celebrations today ??????#Rajinikanth? #Jailer … Read more

  బాలకృష్ణపై పోసాని సంచలన వ్యాఖ్యలు

  సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై నటుడు, ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఓ సైకో అని విరుచుకుపడ్డారు. తన ఇంట్లో వాచ్‌మెన్ చనిపోతే.. అతడి డెడ్ బాడీని దాటుకుని మరీ షూటింగ్‌కు వెళ్లిన చరిత్ర బాలయ్యది అని విమర్శించారు. తుపాకీతో ఇద్దరినీ కాల్చి.. మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నాడని ఆరోపించారు. అదే సామాన్యులను అయితే ఎవరైనా వదిలేస్తారా అని పోసాని ప్రశ్నించారు. బాల‌కృష్ణ‌పై పోసాని చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ … Read more

  IPL కామెంటేటర్‌గా బాలకృష్ణ

  [VIDEO:](url) నందమూరి నటసింహం బాలయ్య క్రికెట్ కామెంటేటర్ అవతారం ఎత్తనున్నారు. ఈమేరకు ఐపీఎల్‌లో బాలకృష్ణ క్రికెట్ మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వ్యవహరించనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. మార్చి 31న ఐపీఎల్ ఓపెనింగ్ రోజు ఎంటర్‌టైన్‌మెంట్ తార స్థాయిలో ఉంటుందని ట్వీట్ చేసింది. కాగా బాలయ్య ఇప్పటికే ఆహా ఓటీటీలో హోస్ట్‌గా వ్యవహరించి సెన్సెషన్ క్రియేట్ చేశారు. మరి కామెంటేటర్‌గా బాలయ్య ఎలా ఇరగదీస్తారో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్?ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్?నందమూరి బాలకృష్ణ గారు? తెలుగుజాతి గర్వపడేలా … Read more

  ఆహాలో మరోసారి బాలయ్య సందడి

  [VIDEO:](url) నందమూరి నట సింహం బాలకృష్ణ మరోసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సందడి చేయనున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్‌2లో యంగ్ సింగర్స్‌ను ఆశీర్వదించడానికి రానున్నట్లు ఆహా స్పష్టం చేసింది. ఈమేరకు బాలయ్యతో ఉన్న షో ప్రోమోను విడుదల చేసింది. ‘గాలా విత్ బాలా’ అని ట్యాగ్ లైన్‌తో అనౌన్స్ చేసింది. ఈ స్పెషల్ ఎపిసోడ్ మార్చి 17నుంచి స్టీమింగ్ కానుంది. దీంతో అభిమానులు బాలయ్య ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. The Unstoppable #Balayya is back on aha!??God of masses will … Read more

  భోరున ఏడ్చిన శివరాజ్.. ఓదార్చిన బాలయ్య

  తన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్‌ను తలచుకుని కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భోరున ఏడ్చేశారు. పక్కనే ఉన్న బాలయ్య అతడిని ఓదార్చారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగిన ‘వేద’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో పునీత్ నటించిన అన్ని సినిమాలకు సంబంధించి ఒక ఏవీ ప్లే చేశారు. దాన్ని చూస్తూ శివరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో పక్కనే ఉన్న బాలయ్య అతడిని ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ??#ShivaRajKumar … Read more

  టీడీపీలో చేరొచ్చు కదా; పవన్‌కు బాలయ్య ప్రశ్న

  నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ పార్ట్ 1 దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించి పార్ట్ 2 ప్రోమో రిలీజ్ అయింది. షోలో హోస్ట్ నందమూరి బాలకృష్ణ.. పవన్ కళ్యాణ్‌కు పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా కొత్త పార్టీ స్థాపించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. టీడీపీలో చేరవచ్చు కదా అని నేరుగా అడిగేశాడు. కారుపై ప్రయాణించడం ఏంటని అడిగాడు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 10 రిలీజ్ కానుంది.