వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది నటి హనీ రోజ్. తన అందచందాలతో తెలుగు ఆడియెన్స్‌ని మెప్పించిన హనీ.. తాజాగా బాడీ షేమింగ్ ఆరోపణలు ఎదుర్కొంది. వీటిపై నటి ఘాటుగా స్పందించింది. కొన్నిసార్లు ప్రజలు చేసే ఆరోపణలు హీరోయిన్ల సినిమాలపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ప్రచార కార్యక్రమాల్లో చీరకట్టులో హాజరవడంపై స్పందిస్తూ తనకు అలా ఉండటం ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాల్లోనూ ప్రతికూల వ్యాఖ్యలు వస్తున్నాయని గుర్తు చేసింది. ఏదేమైనా నచ్చినట్లు ఉంటూ జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటానని ఈ మలయాళ కుట్టీ క్లారిటీ ఇచ్చింది.
హనీరోజ్ 2008లోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆలయం చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. అనంతరం వరుణ్ సందేశ్ సరసన ఈ వర్షం సాక్షిగా సినిమాలోనూ మెరిసింది. తర్వాత వరుసగా మలయాళంలో ఆఫర్లు రావటంతో అక్కడే సెటిల్ అయిపోయింది హనీ. బాలయ్య వీరసింహా రెడ్డితో మళ్లీ గుర్తింపు రావటంతో తెలుగులో అవకాశాలు వస్తాయని భావిస్తోంది.
ప్రస్తుతం ఎలాంటి చిత్రాలు కమిట్ అవ్వలేదు. ఒకే ఒక్క మలయాళీ సినిమాలో చేస్తోంది. ఒక్కసారిగా ఫేమ్ రావటంతో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌లో తళుక్కున మెరుస్తోంది హనీ రోజ్. తెలుగులో మరో మంచి హిట్ కోసం కథలు కూడా వింటుందని టాక్. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న హనీ రోజ్‌కి ఫర్లు మాత్రం తప్పకుండా వస్తాయనే చెప్పవచ్చు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!