• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బెజవాడలో హనీ రోజ్ సందడి

  హీరోయిన్ హనీ రోజ్ విజయవాడలో సందడి చేసింది. నగరంలో ఓ నూతన నగల దుకాణాన్ని హనీరోజ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా హనీరోజ్‌ను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాాయి. విజయవాడ అంటే తనకు ఎంతో ఇష్టమని హనీరోజ్ చెప్పుకొచ్చింది. ఇక్కడి ప్రజల అభిమానానికి తాను ఫిదా అయ్యానని పేర్కొంది. ఈ సందర్భంగా హనీతో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. Courtesy Twitter: Only Heroines Courtesy Twitter: Only Heroines

  బాడీ షేమింగ్‌పై స్పందించిన హనీ రోజ్

  వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది నటి హనీ రోజ్. తన అందచందాలతో తెలుగు ఆడియెన్స్‌ని మెప్పించిన హనీ.. తాజాగా బాడీ షేమింగ్ ఆరోపణలు ఎదుర్కొంది. వీటిపై నటి ఘాటుగా స్పందించింది. కొన్నిసార్లు ప్రజలు చేసే ఆరోపణలు హీరోయిన్ల సినిమాలపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ప్రచార కార్యక్రమాల్లో చీరకట్టులో హాజరవడంపై స్పందిస్తూ తనకు అలా ఉండటం ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాల్లోనూ ప్రతికూల వ్యాఖ్యలు వస్తున్నాయని గుర్తు చేసింది. ఏదేమైనా నచ్చినట్లు ఉంటూ జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటానని ఈ మలయాళ కుట్టీ క్లారిటీ … Read more

  అందచందాలతో కిక్కెక్కిస్తోన్న హనీరోజ్‌!

  [Video:](url) వీరసింహారెడ్డి సినిమాతో నటి హనీరోజ్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్టులు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న హనీరోజ్‌ సందడి చేశారు. డ్యాన్స్‌ చేసి అక్కడి వారిని అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను హనీరోజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. https://www.instagram.com/p/Coyqsu-jieu/?hl=en Courtesy Instagram:honeyroseinsta Courtesy Instagram:honeyroseinsta

  మరీ ఇంత అందమేంటి బాసూ..!

  [VIDEO:](url) వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ‘హనీ రోజ్’. తన చక్కనైన అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో హనీ రోజ్ బ్యూటీని చూసి నెటిజన్లు తెగ్ పొగుడుతున్నారు. ఇంత అందమేంటి బాసూ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/reel/CorusYRj99e/?utm_source=ig_web_copy_link Courtesy Instagram:HoneyRose Courtesy Instagram:

  ‘ఆహా.. ఇది కదా అందం అంటే..! ‘

  నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీనియర్ బాలయ్య సరసన నటించిన హనీరోజ్‌ తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. ‘వీర సింహారెడ్డి’తో మంచి పాపులారిటీ రావడంతో ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఆమె కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆకు పచ్చని శారీలో మెరిసిపోతూ అందులో కనిపించారు. వీటిని చూసిన నెటిజన్లు హనిరోజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఆహా.. అందం అంటే ఇది కదా … Read more

  బాలయ్య నెక్ట్స్ మూవీలో హనీరోజ్?

  నందమూరి బాలకృష్ణ సరసన హనీరోజ్ మళ్లీ నటించనుందని వార్తలు వైరల్‌గా మారాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించే బాలయ్య మూవీ ‘ఎన్‌బీకే 108’లో హనీరోజ్ నటిస్తోందని వార్తలు గుప్పుమంటున్నాయి. బాలకృష్ణ రికమెండ్ చేయడంతో అనిల్ ఒప్పుకున్నట్లు టాక్. కానీ ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని సినీ ప్రియులు చెబుతున్నారు. ‘ఎన్‌బీకే 108’లో హనీ నటించడం వట్టి పుకార్లేనని పేర్కొంటున్నారు. కాగా ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య, హనీరోజ్ కెమిస్ట్రీ అదిరిపోయిన సంగతి తెలిసిందే.

  హీరోయిన్‌తో బాలయ్య నైట్ పార్టీ; మందు గ్లాసుతో?

  నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ వేడుకలో బాలయ్య, హనీరోజ్ హైలెట్‌గా నిలిచారు. పార్టీలో వీరిద్దరూ ఒకరికి ఒకరు తాగిపించుకుంటున్నట్లుగా కలసి ఆల్కహాల్‌ను ఆస్వాదించారు. చేతులు మార్చుకుంటూ మరీ మద్యం సేవించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా హనీరోజ్ ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.