• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీటెక్తిస్తోన్న షారుఖ్, దీపికా రొమాన్స్

    బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, హీరోయిన్ దీపికా పడుకొనేలు జంటగా నటించిన ‘పఠాన్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ‘బేషరమ్’ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా షారుఖ్, దీపికాల కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వీరిద్దరూ రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. దీపికా బికినీ అందాలతో, షారుఖ్ సిక్స్ ప్యాక్‌ లుక్స్‌తో మంటలు పుట్టించారు. ఈ పాట తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలో విడుదల కానుంది.

    ‘వాల్తేర్‌ వీరయ్య’లో రవితేజ మాస్‌ యాటిట్యూడ్‌

    బాబీ దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’లో మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రవితేజ పాత్రకు సంబంధించి టీజర్ విడుదల చేశారు. మాస్‌ యాటిట్యూడ్‌తో రవితేజ ఇరగదీశాడు. ‘ఏం రా వారీ పిసా పిస జేస్తున్నవ్, నీకింకా సమజ్ గాలే నేను ఎవ్వనయ్యక్ ఇననని’ అంటూ రవితేజ డైలాగ్‌ ఆకట్టుకుంది.

    బాలయ్యతో బాహుబలి

    [VIDEO](url):నటసింహం బాలయ్య సూపర్‌ హిట్‌ టాక్‌ షోలో ప్రభాస్‌ సందడి చేయబోతున్నారు. ఈ మేరకు ఆహా అధికారికంగా ప్రకటించింది. ఆహాలో అనౌన్స్‌ చేసిన కొద్ది నిమిషాల్లో ట్విట్టర్‌ ఈ వార్త ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ప్రభాస్‌, బాలయ్య షాట్లతో ఓ అనౌన్స్‌మెంట్‌ వీడియోను కట్‌ చేసే ఆహాలో పోస్ట్ చేశారు. మొహమాటానికి మారుపేరైన ప్రభాస్‌, బాలయ్య మాటల తూటాలను ఎలా తట్టుకుంటాడో చూడాలి మరి. The Bahubali episode #Unstoppable Season 2 is coming soon ?Watch out for more updates ✌?#UnstoppableWithNBKS2 … Read more

    ఇంట్రెస్టింగ్‌గా ‘కనెక్ట్’ ట్రైలర్

    లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కనెక్ట్’ మూవీట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకూ భయంభయంగా సాగింది. పూర్తిగా హార్రర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ఇంటర్వెల్ లేకపోవడం విశేషం. ఈ మూవీని అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. సత్యరాజ్, అనుపమ్ ఖేర్, నాఫియా తదితరులు కీలక పాత్రలు పోషించారు.డిసెంబర్ 22న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

    సాయిధరమ్ తేజ్‌ టైటిల్‌ గ్లింప్స్

    సాయిధరమ్‌ తేజ్‌ విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి చిత్రబృందం గ్లింప్స్‌ను కూడా విడుదల చేసింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న సినిమాలో సంయుక్త మేనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్‌, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. గ్లింప్స్‌కు తారక్ వాయిస్ అందించారు. ప్రస్తుతం ఈ వీడియో ఆకట్టుకుంటోంది.

    ‘ధాస్ కా ధమ్కీ’ మొదటి సాంగ్ రిలీజ్

    చలికాలంలో వెచ్చదనాన్ని తీసుకు వచ్చేందుకు విశ్వక్‌సేన్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ మూవీ సిద్ధమైంది. ఈ మేరకు సినిమాలోని ఓ లవ్ సాంగ్‌ని విడుదల చేసింది. ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ అంటూ ఈ గీతం సాగుతోంది. పూర్ణ చారి లిరిక్స్ అందించగా.. లియో జేమ్స్ స్వరాలు సమకూర్చారు. ఆదిత్య ఆర్కే, లియో జేమ్స్ పాటను ఆలపించారు. కాగా, విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో విశ్వక్‌కి జోడీగా నివేతా పేతురాజ్ నటిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న థియేటర్లలో ఈ సినిమా విడుదల … Read more

    టైం ఇవ్వు పిల్ల కొంచెం అంటున్న నిఖిల్

    కార్తీకేయ 2తో బ్లాక్‌ బస్టర్‌ హిట్ అందుకున్న నిఖిల్‌ నటిస్తున్న 18 పేజేస్‌ చిత్రం నుంచి మరో పాట వచ్చేసింది. “టైం ఇవ్వు పిల్ల కొంచెం” అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటను తమిళ హీరో శింబు ఆలపించారు. సినిమాకు దర్శకుడు సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోనూ అనుపమ హీరోయిన్‌గా నటిస్తోంది. బన్నీవాసు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్ రిలీజ్

    లవ్ మాక్‌టెయిల్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. సత్యదేవ్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. దేవ్‌‌ పాత్రలో సత్యదేవ్ కొత్త లుక్‌లో అలరించాడు. ప్రియదర్శి, సత్యదేవ్‌ల మధ్య సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరు, ముగ్గురితో ప్రేమాయణం నడిపి.. ఒకరిని పెళ్లి చేసుకున్న దేవ్‌కి ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనే విషయాన్ని ట్రైలర్‌లో క్లుప్తంగా చూపించారు. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కాళభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 9న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు … Read more

    థ్రిల్లింగ్‌గా ‘ముఖచిత్రం’ ట్రైలర్

    యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘ముఖచిత్రం’ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది లవ్ స్టోరీయో.. లేదా థ్రిల్లరో కాదు.. స్పోర్ట్స్ డ్రామా అంటూ సాగే డైలాగ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. మూవీలో వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్యరావ్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. పాకెట్ మంకీ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

    తెలుగులోనూ ‘రంజితమే’

    తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ’వారిసు’ చిత్రంలో ‘రంజితమే’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 25 రోజుల్లోనే 7 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’గా విడుదల చేస్తున్నారు. రంజితమే సాంగ్‌ను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించింది. వంశీ పైడిపల్లి ఈ మూవీని తెరకెక్కించారు. జనవరి 11న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.