ఆసక్తి రేపుతున్న ‘18 పేజీస్’ ట్రైలర్
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘18 పేజీస్’ చిత్రం ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులకు ఆసక్తి రేపుతూ.. కొత్త అనుభూతిని అందిస్తోంది. ఇప్పటికే ఈ మూవీలోని పాటలు రిలీజై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.