• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కళ్యాణం కమనీయం’ లిరిక్ వీడియో విడుదల

    సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం’. ఈ సినిమా నుంచి ‘హో ఎగిరే’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ప్రియా భవాని శంకర్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. యువి కాన్సెప్ట్స్ పతాకంపై అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాటుక కన్నే.. దాచెను నన్నే అంటూ సాగుతున్న ఈ లిరికల్ వీడియో సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. శ్రావణ్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా.. కపిల్ కపిలన్ పాటను ఆలపించాడు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ తరువాత … Read more

    ఈ వారం(Dec 30) విడుదలయ్యే సినిమాలు, ఓటీటీ విడుదలలు

    2022 సంవత్సరం ముగియనుండటంతో ఈ వారం పెద్ద సినిమాలేమీ విడుదల కావట్లేదు. కానీ, కొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దామా.  టాప్ గేర్ – డిసెంబరు 30 గత కొన్నేళ్లుగా ఓ విజయం కోసం ఎదురు చూస్తున్న హీరో ఆది సాయి కుమార్. ఈ కుర్ర హీరో ‘టాప్ గేర్’ సినిమాతో థియేటర్ల ముందుకు వస్తున్నాడు. ప్రోమో, ట్రైలర్‌తో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ త్రిల్లర్ సినిమాను కె.శశికాంత్ డైరెక్ట్ చేశారు. రాజయోగం – డిసెంబరు 30 … Read more

    మోస్ట్ పాపులర్ సాంగ్‌గా ‘కళావతి’ రికార్డు

    సర్కారు వారి పాట మూవీలోని కళావతి సాంగ్ మరో క్రేజీ రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది అత్యంత పాపులర్ సాంగ్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ ఏడాది యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో పాటు పెద్దసంఖ్యలో లైక్స్ సొంతం చేసుకున్న పాటగా నిలిచింది. ఈ సాంగ్ 237 మిలియన్ వ్యూస్‌తో పాటు 2.5 మిలియన్స్‌కి పైగా లైక్స్ సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన ఈ సాంగ్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. సర్కారు వారి పాట బాక్సాఫీస్ … Read more

    ఆకట్టుకుంటున్న ‘అన్‌స్టాపబుల్’ టీజర్

    నటుడు సప్తగిరి, బిగ్‌బాస్ విజేత సన్నీ కలిసి నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. ఈ చిత్ర టీజర్‌ని హీరో నాగార్జున విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ సినిమా విజయం సాధించాలని అభిలషించారు. ‘అన్‌లిమిటెడ్ ఫన్’ ఉపశీర్శికతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యకలపాలను జరుపుకుంటోంది. ఇక టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఓటీటీ వేదికల నుంచి ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది. షకలక శంకర్, బిత్తిరి సత్తి, రఘు బాబు.. తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

    ఊపేస్తున్న వీరసింహారెడ్డి ఐటెమ్ సాంగ్

    బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయె’ అంటూ సాగుతున్న ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. తమన్ స్వరాలను సమకూర్చారు. సాహితీ, సత్య యామిని, రేణు కుమార్ కలిసి పాటను ఆలపించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జనవరి 12న విడుదల కానుంది.

    హరిహర వీరమల్లులో బాలీవుడ్ స్టార్

    పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలోకి బాలీవుడ్‌ నటుడు ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ స్టార్ యాక్టర్ బాబి డియోల్‌ నటిస్తున్నాడు. ఆయనకు స్వాగతం పలుకుతూ చిత్రబృందం వీడియోను రిలీజ్ చేసింది. దీనికి ఎం.ఎం. కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ అదిరిపోయింది. సినిమాకు క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏఎం రత్నం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ‘నేనొక నటుడ్ని’ షాయరీ విడుదల

    క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తండ’. ఈ సినిమా నుంచి ‘నేనొక నటుడ్ని’ అనే షాయరీని చిత్రబృందం విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ షాయరీకి తన గొంతుతో ప్రాణం పోశారు. ఓ నటుడి ప్రస్థానాన్ని, అంతరంగాన్ని ప్రేక్షకుడి గుండెకు హుత్తుకునేలా ఉద్వేగభరితంగా ఈ కవిత ద్వారా వర్ణించారు. రంగస్థల నటీనటుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఇళయరాజా స్వరాలు అందించారు.

    ట్రెండింగ్‌లో ‘శ్రీదేవీ’ సాంగ్

    మెగాస్టార్ హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని ‘నువ్వు శ్రీదేవి అయితే’ సాంగ్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటను ఇప్పటివరకు 7 మిలియన్ల మందికి పైగా చూశారు. కాగా ఈ మూవీని కేఎస్ రవీంద్ర డైరెక్ట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. చిరంజీవికి జతగా శృతిహాసన్ నటిచింది. మాస్ మహరాజా రవితేజ ఏసీపీ విక్రమ్‌గా ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నారు.

    ‘సోల్ ఆఫ్ వారసుడు’ వచ్చేసింది

    తమిళ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ చిత్రంలో నుంచి మూడో పాట విడుదలైంది. ఈ ‘సోల్ ఆఫ్ వారసుడు’గా వచ్చిన ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. తమన్ స్వరాలు సమకూర్చారు. కేఎస్ చిత్ర పాటను ఆలపించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్‌లో ‘వరిసు’గా విడుదలవుతోంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర్ సినీ క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు.

    ఆకట్టుకుంటున్న ‘శ్రీదేవి.. చిరంజీవి’ సాంగ్

    వాల్తేరు వీరయ్య సినిమాలోంచి రెండో పాట విడుదలైంది. ‘నువ్వు శ్రీదేవి అయితే.. నేనే చిరంజీవి అంటా’ అనే గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించాడు. జస్ప్రీత్ జాజ్, సమీర భరద్వాజ్ ఈ గీతాన్ని ఆలపించారు. డీఎస్పీ స్వరాలు సమకూర్చారు. కాగా, రొమాంటిక్‌గా సాగుతున్న ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులోని మొదటి పాట ‘బాస్ పార్టీ’ మంచి ఆదరణను పొందింది. బాబీ డైరెక్ట్ చేయగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జనవరి 13న విడుదల … Read more