• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NEW YEAR: కస్టడీ గ్లింప్స్ విడుదల

    నాగచైతన్య 22వ సినిమా ‘కస్టడీ’ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు చెబుతూ ఓ గ్లింప్స్‌ని విడుదల చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా చైతూ ఇందులో నటిస్తున్నాడు. వెంకట్ ప్రభు తెలుగులో తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. పైగా మ్యూజిక్ సెన్సేషన్ ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. తెలుగు, తమిళ భాషల్లో మే 12న కస్టడీ విడుదల కానుంది.

    ‘వీరసింహారెడ్డి’ మేకింగ్ వీడియో చూశారా?

    నందమూరి బాలకృష్ణ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు న్యూఇయర్ గిఫ్ట్ వచ్చింది. ఈ మూవీ మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. మేకింగ్ వీడియోలో బాలయ్య యాక్షన్ అదిరిపోయింది. కాగా ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ప్రాజెక్ట్ K షూటింగ్‌లో టైర్‌ గోల

    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమాకు సంబందించి ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. ఇందులో సినిమా ఎలా మెుదలయ్యింది అనేది చూపించారు. ఓ టైర్‌ కోసం చిత్ర యూనిట్‌ మెుత్తం కష్టపడుతున్న వీడియో జనల్లా ఆసక్తి పెంచుతోంది. సినిమాలో ఏదో కీలకమైన అంశమని భావిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొణే నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. https://youtube.com/watch?v=DGERy23DKwM%26t%3D1s

    విడుదలైన ‘మెగా మాస్’ పాట

    మెగాస్టార్, మాస్ మహారాజ కాంబినేషన్ పాట విడుదలైంది. డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ పాట హుషారుగా సాగుతోంది. వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన నాలుగో పాట ఇది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రోల్ రైడా లిరిక్స్ రాయడంతో పాటు పాటను ఆలకించారు. మరో మాస్ సింగర్ రామ్ మిరియాల కూడా పాటను పాడాడు. కాగా, వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

    ‘కళ్యాణం కమనీయం’ లిరిక్ వీడియో విడుదల

    సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం’. ఈ సినిమా నుంచి ‘హో ఎగిరే’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ప్రియా భవాని శంకర్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. యువి కాన్సెప్ట్స్ పతాకంపై అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాటుక కన్నే.. దాచెను నన్నే అంటూ సాగుతున్న ఈ లిరికల్ వీడియో సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. శ్రావణ్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా.. కపిల్ కపిలన్ పాటను ఆలపించాడు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ తరువాత … Read more

    ఈ వారం(Dec 30) విడుదలయ్యే సినిమాలు, ఓటీటీ విడుదలలు

    2022 సంవత్సరం ముగియనుండటంతో ఈ వారం పెద్ద సినిమాలేమీ విడుదల కావట్లేదు. కానీ, కొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దామా.  టాప్ గేర్ – డిసెంబరు 30 గత కొన్నేళ్లుగా ఓ విజయం కోసం ఎదురు చూస్తున్న హీరో ఆది సాయి కుమార్. ఈ కుర్ర హీరో ‘టాప్ గేర్’ సినిమాతో థియేటర్ల ముందుకు వస్తున్నాడు. ప్రోమో, ట్రైలర్‌తో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ త్రిల్లర్ సినిమాను కె.శశికాంత్ డైరెక్ట్ చేశారు. రాజయోగం – డిసెంబరు 30 … Read more

    మోస్ట్ పాపులర్ సాంగ్‌గా ‘కళావతి’ రికార్డు

    సర్కారు వారి పాట మూవీలోని కళావతి సాంగ్ మరో క్రేజీ రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది అత్యంత పాపులర్ సాంగ్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ ఏడాది యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో పాటు పెద్దసంఖ్యలో లైక్స్ సొంతం చేసుకున్న పాటగా నిలిచింది. ఈ సాంగ్ 237 మిలియన్ వ్యూస్‌తో పాటు 2.5 మిలియన్స్‌కి పైగా లైక్స్ సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన ఈ సాంగ్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. సర్కారు వారి పాట బాక్సాఫీస్ … Read more

    ఆకట్టుకుంటున్న ‘అన్‌స్టాపబుల్’ టీజర్

    నటుడు సప్తగిరి, బిగ్‌బాస్ విజేత సన్నీ కలిసి నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. ఈ చిత్ర టీజర్‌ని హీరో నాగార్జున విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ సినిమా విజయం సాధించాలని అభిలషించారు. ‘అన్‌లిమిటెడ్ ఫన్’ ఉపశీర్శికతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యకలపాలను జరుపుకుంటోంది. ఇక టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఓటీటీ వేదికల నుంచి ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది. షకలక శంకర్, బిత్తిరి సత్తి, రఘు బాబు.. తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

    ఊపేస్తున్న వీరసింహారెడ్డి ఐటెమ్ సాంగ్

    బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయె’ అంటూ సాగుతున్న ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. తమన్ స్వరాలను సమకూర్చారు. సాహితీ, సత్య యామిని, రేణు కుమార్ కలిసి పాటను ఆలపించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జనవరి 12న విడుదల కానుంది.

    హరిహర వీరమల్లులో బాలీవుడ్ స్టార్

    పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలోకి బాలీవుడ్‌ నటుడు ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ స్టార్ యాక్టర్ బాబి డియోల్‌ నటిస్తున్నాడు. ఆయనకు స్వాగతం పలుకుతూ చిత్రబృందం వీడియోను రిలీజ్ చేసింది. దీనికి ఎం.ఎం. కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ అదిరిపోయింది. సినిమాకు క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏఎం రత్నం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.