2022 సంవత్సరం ముగియనుండటంతో ఈ వారం పెద్ద సినిమాలేమీ విడుదల కావట్లేదు. కానీ, కొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దామా.
టాప్ గేర్ – డిసెంబరు 30
గత కొన్నేళ్లుగా ఓ విజయం కోసం ఎదురు చూస్తున్న హీరో ఆది సాయి కుమార్. ఈ కుర్ర హీరో ‘టాప్ గేర్’ సినిమాతో థియేటర్ల ముందుకు వస్తున్నాడు. ప్రోమో, ట్రైలర్‌తో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ త్రిల్లర్ సినిమాను కె.శశికాంత్ డైరెక్ట్ చేశారు.
రాజయోగం – డిసెంబరు 30
సాయి రోనక్, అంకిత సాహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజయోగం’. రొమాంటిక్ త్రిల్లర్‌గా ఇది తెరకెక్కింది. రామ్ గణపతి రావ్ దర్శకత్వం వహించగా.. మణి లక్ష్మణ్ రావు నిర్మించారు.
వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ దేవరకొండ – డిసెంబరు 30
తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్న మరో చిత్రం ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ దేవరకొండ’. పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా నటించిన కన్నడ నటుడు ధనంజయ చిత్రం ‘హెడ్ బుష్’కి డబ్బింగ్ మూవీ ఇది. కన్నడలో ఈ సినిమా మంచి టాక్‌ని సంపాదించింది.
రైటర్ పద్మభూషణ్ – డిసెంబరు 30
‘కలర్ ఫొటో’ సినిమాతో హిట్ కొట్టిన సుహాస్.. ఇప్పుడు ‘రైటర్ పద్మభూషణ్’గా రాబోతున్నాడు. షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. టినా శిల్ప రాజ్, ఆశిశ్ విద్యార్థి, తదితరులు కీలక పాత్ర పోషించారు.
ప్రత్యర్థి – డిసెంబరు 30
ఆసక్తికరమైన ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన సినిమా ‘ప్రత్యర్థి’. ఈ క్రైం మిస్టరీ త్రిల్లర్‌ని శంకర్ ముదావత్ తెరకెక్కించారు. సంజయ్ సాహా నిర్మాతగా వ్యవహరించారు.
కొరమీను – డిసెంబరు 30
నెపోలియన్ ఫేమ్ ఆనంద్ రవీ హీరోగా వస్తున్న చిత్రం ‘కొరమీను’. డిసెంబరు 31న థియేటర్లలో విడుదలవుతోంది. కర్రి శ్రీపర్తి ఈ పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు.
OTT విడుదలలు
Title | Category | Language | Platform | Release Date |
Top Gun : Maverick | Movie | Pan-India | Prime Video | Dec 26 |
Daughter from Another Mother Season 3 | TV Show | Spanish | Netflix | Dec 26 |
The Boy, the Mole, the Fox and the Horse | Movie | English | Apple Tv | Dec 26 |
Route Map | Movie | Malayalam | Saina Play | Dec 26 |
Vir Das : Landing | TV Show | Hindi | Netflix | Dec 27 |
7 Women and a Murder | Movie | English | Netflix | Dec 28 |
Butterfly | Movie | Telugu | Hotstar | Dec 29 |
Chelsea Handler: Revolution | TV Show | English | Netflix | Dec 29 |
Gold | Movie | Malayalam | Prime Video | Dec 30 |
DSP | Movie | Tamil | Netflix | Dec 30 |
White Noise | Movcollageie | English | Netflix | Dec 30 |
Paws of Fury: The Legend of Hank | Movie | English | Prime Video | Dec 30 |
‘Rise of Empires: Ottoman’ Season 2 | Series | English | Netflix | Dec 30 |
Step up season 3 | Series | English | Lions Gates Play | Dec 30 |
Ginny and Georgia: Season 2 | Series | English | Netflix | Jan 5, 2023 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!