• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధమాకా నుంచి మరో పాట విడుదల

    రవితేజ హీరోగా డ్యుయల్ రోల్‌లో వస్తున్న చిత్రం ‘ధమాకా’. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘డు..డు..వీడు ల్యాండుమైను లెక్క’ అంటూ సాగే ఈ పాటను పృథ్వీ చంద్ర ఆలపించారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. కాగా, ఈ సినిమాలోని మిగతా పాటలకు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. డిసెంబరు 23న మూవీ రిలీజ్ కానుంది.

    ఫుల్ ఎనర్జిటిక్‌గా ‘జై బాలయ్య’ సాంగ్

    నటసింహం నందమూరి బాలక్రిష్ణ హీరోగా తెరకెక్కిన వీరశివారెడ్డి చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ‘జై బాలయ్య’ పాటను మూవీ మేకర్స్ విడుదల చేశారు. హీరో పాత్రను తెలియజేసేలా ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటకు థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఫ్యాక్షన్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.

    రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా జంటగా ‘వేడ్‌’

    2019లో రియల్‌ కపుల్‌ రీల్‌ కపుల్‌గా నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ‘ మజిలీ’. ఈ సినిమాలో ఆన్‌స్క్రీన్‌పై సమంత, నాగచైతన్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇప్పుడు ఇదే సినిమాను మరో స్టార్ కపుల్ జంటగా తెరకెక్కిస్తున్నారు. బాలివుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా జంటగా ‘వేడ్‌’ అనే టైటిల్‌తో మరాఠీలో ఈ సినిమా రాబోతోంది. రితేష్‌ దేశ్‌ముఖ్‌ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తీస్తున్నాడు. రితేష్‌, జెనీలియా జంటకు సోషల్‌ మీడియాలో ఇప్పటికే ఉన్న మంచి ఫాలోయింగ్ ఈ సినిమాకు కలిసి రావొచ్చు.

    అదిరిపోయింది.. ఈ ‘బాస్ పార్టీ’

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘బాస్ పార్టీ’ అంటూ సాగుతున్న ఈ పాట హోరెత్తిస్తోంది. నకాశ్ ఆజిజ్, దేవీ శ్రీ ప్రసాద్, హరిప్రియ ఈ పాటను ఆలపించారు. డీఎస్పీ సంగీతం ఇరగదీశాడు. మాస్ బీట్‌కి చిరు స్టెప్పులు తోడవ్వడంతో పాట మరోస్థాయికి వెళ్లింది. ఈ పాటను డీఎస్పీ లిరిక్స్ అందించడం విశేషం. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. హీరో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘డీజే వీరయ్య’గా … Read more

    హిట్‌-2 ట్రైలర్‌ అదిరింది

    అడివి శేష్‌ హీరోగా నాని ప్రొడక్షన్ బ్యానర్‌ వాల్‌ పోస్టర్‌ సినిమా తెరకెక్కిస్తున్న సినిమా హిట్‌ 2. డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. క్రిమినల్స్ మట్టి బుర్రలు అంటూ అడివి శేష్‌ వెక్కిరించే సీన్‌తో మొదలై…అడివి శేష్‌కు చుక్కలు చూపించేలా హత్యలు జరగడం ట్రైలర్‌లో చూపించారు. గతంలో వచ్చిన హిట్‌ కంటే దీనిని మరింత థ్రిల్లింగ్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. తనకు సరిగ్గా సరిపోయే పాత్రలో అడివి శేష్‌ మరోసారి అదరగొట్టాడు.

    ఓడిన చోటనే గెలిచిన చిరంజీవి

    టాలివుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవల గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ‘ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ గురించి చిరంజీవి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తెలుగు నటులకు కనీస గౌరవం లేదని అప్పట్లో చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. తాను వేడుకకు వెళ్లినపుడు అక్కడ టాలివుడ్‌ దిగ్గజాల ఫోటోలు అక్కడ లేకపోవడం తనని కలచివేసిందన్నారు. ఇప్పడదే గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో చిరు అవార్డు అందుకోవడంతో…తగ్గిన చోటనే … Read more

    అదిరిపోయిన అవతార్-2 ట్రైలర్

    ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అవతార్-2. ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. అవతార్ కు సీక్వెల్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రంలో భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. జేమ్స్ కేమరూన్ మరోసారి తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించారు. విజువల్ వండర్ గా మరోసారి సినిమాను తెరకెక్కించారు. తెగను కాపాడుకునేందుకు వారు చేస్తున్న యుద్ధ సన్నివేశాలు రోమాలు నిక్కపొడుచుకునేలా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 16న సినిమాను విడుదల చేయనున్నారు.

    హిట్-2 ట్రైలర్ ఎప్పుడంటే ?

    అడవి శేష్ నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం హిట్-2 సినిమాకు సంబంధించిన ట్లైలర్ ప్రకటన వచ్చేసింది. రేపు ఉదయం 11.07 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది. కొలను శేషు దర్శకత్వం వహించిన సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయనున్నారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని నిర్మిస్తున్నారు. ట్రైలర్ విడుదల ప్రకటనకు సంబంధించి నాని, అడవి శేష్ మధ్య చిన్న సంభాషణ తీర్చిదిద్దారు.

    మెగాస్టార్ ఫస్ట్ సింగిల్ ప్రోమో

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు సన్నాహాలు మెుదలయ్యాయి. రేపు పాటను విడుదల చేస్తుండగా..ఇందుకు సంబంధించిన చిన్న ప్రొమోను వదిలారు. బాస్ పార్టీ అంటూ సాగే ఈ పాట సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మార్క్ ట్యూన్ లో ఉంది. ప్రోమోలో మాత్రం చిరును పరిచయం చేసేలా తీశారు. అతిగా ఆశించిన ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశకు గురవుతారు. కానీ, చిరంజీవి స్టైల్, స్వాగ్ ఏ మాత్రం తగ్గకుండా పాటను చిత్రీకరించినట్లు కనిపిస్తోంది.

    తొలిప్రేమ ఎన్నటికీ సజీవమే; ‘బేబీ’ టీజర్ అవుట్

    ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ చిత్ర టీజర్‌ను మూవీమేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఎంతో హృద్యంగా సాగింది. టీజర్ చూస్తుంటూ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. తొలి ప్రేమ జ్ణాపకాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ‘‘మొదటిప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’’ అనే అక్షరాలతో ట్రైలర్ మొదలవుతుంది. ఈ చిత్రంలో ఆనంద్ సరసన వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఈ చిత్రానికి సాయిరాజేష్ నీలం దర్శకత్వం చేపట్టారు.