కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్: రేవంత్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్: రేవంత్

    కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్: రేవంత్

    October 9, 2023

    Courtesy Twitter: Revanth Reddy

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు విమర్శలతో ఆసక్తికర ట్వీట్ చేశారు. కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్ మొదలైందని విమర్శించారు. ‘ఇది.. దగాపడిన యువత, ఆగమైన అన్నదాత కన్నెర్ర చేస్తూ చెప్తున్న కౌంట్ డౌన్. ఇది.. కన్నీళ్లు పెట్టిన సర్కారు బడి చిన్నారి, పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగిన పెద్ద మనిషి చేస్తున్న కౌంట్ డౌన్. ఇది.. నిలువ నీడలేని పేద కుటుంబం, మాట్లాడే స్వేచ్ఛలేని మేధావి వర్గం నినదిస్తున్న కౌంట్ డౌన్. ఈ 52 రోజుల కౌంట్ డౌన్ నియంత సర్కారుకు రాస్తున్న మరణశాసనం’ అని రేవంత్ పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version