Demonte Colony 2 Movie Review: హారర్‌ థ్రిల్లర్‌ ‘డిమోంటి కాలనీ 2’ భయపెట్టిందా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Demonte Colony 2 Movie Review: హారర్‌ థ్రిల్లర్‌ ‘డిమోంటి కాలనీ 2’ భయపెట్టిందా?

    Demonte Colony 2 Movie Review: హారర్‌ థ్రిల్లర్‌ ‘డిమోంటి కాలనీ 2’ భయపెట్టిందా?

    August 23, 2024

    నటీ నటులు : అరుల్‌ నిధి, ప్రియ భవానీ శంకర్‌, అరుణ్‌ పాండియన్‌, ముత్తుకుమార్‌, మీనాక్షి గోవిందరాజన్‌, సర్జనో ఖలీద్‌, అర్చన చందోక్ తదితరులు

    దర్శకత్వం : ఆర్‌. జ్ఞానముత్తు

    సంగీతం : శ్యామ్‌ సీ. ఎస్‌

    నిర్మాత : బాబీ బాలచంద్రన్‌

    విడుదల తేదీ : 23-08-2024

    అరుల్‌ నిధి, ప్రియ భవానీ శంకర్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డిమోంటి కాలనీ 2’. అజయ్‌ ఆర్‌.జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్‌.సి.రాజ్‌కుమార్‌ నిర్మాతలు. తమిళంలో ఈనెల 15న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆగస్టు 23న తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను కూడా అలరించిందా? గతంలో వచ్చిన డిమోంటి కాలనీ తరహాలోనే విజయం సాధించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    శామ్యూల్ రిచర్డ్ (సర్జనో ఖాలిద్) అనూహ్యంగా ఆత్మహత్య చేసుకొని మరణిస్తాడు. క్యాన్సర్‌ వంటి మహమ్మారిని జయించిన అతడు ఇలా సుసైడ్‌ చేసుకోవడాన్ని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) జీర్ణించుకోలేకపోతుంది. భర్త ఎందుకు అలా చేశాడని తెలుసుకోవడం కోసం అతడి ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఓ లైబ్రరీలోని పుస్తకం కారణంగా తాను చనిపోవాల్సి వచ్చిందని శ్యామ్‌ ఆత్మ చెబుతుంది. అయితే ఆ పుస్తకం చదివిన చాలా మంది ఇలాగే చనిపోయినట్లు డెబీ కనుగొంటుంది. రీసెంట్‌గా శ్రీనివాస్‌ (అరుళ్‌ నిధి), అతని కవల సోదరుడు రఘునందన్‌ (అరుళ్‌ నిధి) కూడా ఈ పుస్తకాన్ని చదివారని డెబీ తెలుసుకుంటుంది. వారి ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని గ్రహిస్తుంది. ఇంతకీ ఆ పుస్తకం ఏంటి? దాని వెనకున్న దుష్ట శక్తి రహాస్యం ఏంటి? ఆ కవల సోదరులను రక్షించేందుకు తన మామయ్య రిచర్డ్‌ (అరుణ్‌ పాండియన్‌)తో కలిసి డెబీ ఏం చేసింది? వాళ్ల ప్రయత్నాలకు బౌద్ద సన్యాసులు ఎలాంటి సాయం చేశారు? అన్నది స్టోరీ. 

    ఎవరెలా చేశారంటే

    హీరో అరుళ్ నిధి ఇందులో కవలలుగా ద్విపాత్రాభినయం చేశాడు. రెండు క్యారెక్టర్ల మధ్య లుక్స్, నటన పరంగా చక్కటి వేరియేషన్స్‌ చూపించాడు. మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్‌లో ప్రియా భవాని శంకర్‌ అదరగొట్టింది. గత చిత్రాల్లో గ్లామర్‌ పాత్రలో అలరించిన ఆమె ఈసారి నటన స్కోప్‌ ఉన్న పాత్రలో మెప్పించింది. హెయిర్ స్టయిల్ మార్చడం వల్ల ఆమె లుక్ కొత్తగా కనిపించింది. చాలా రోజుల తర్వాత ఆమెకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించిందని చెప్పవచ్చు. ప్రియా భవానీ మామ పాత్రలో చేసిన అరుణ్‌ పాండియన్‌ పర్వాలేదనిపించారు. నటి అర్చనా రవిచంద్రన్ కనిపించేది కాసేపే అయినా నవ్వించారు. ముత్తు కుమార్, సర్జనో ఖాలిద్ తదితరులు చక్కగా చేశారు. ముఖ్యంగా బౌద్ధ బిక్షువులుగా కనిపించిన వాళ్ళు ఆకట్టుకునేలా నటించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    గతంలో వచ్చిన ‘డిమోంటి కాలనీ’ కథకు ముడిపెడుతూ దర్శకుడు ఆర్‌. జ్ఞానముత్తు పార్ట్‌ 2ను రూపొందించారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతీ అరగంటకు ట్విస్ట్‌ ఇస్తూ ఆడియన్స్‌లో ఆసక్తిని రగిలించారు. మొదటి భాగంలో లేని ఒక కుటుంబాన్ని రెండో భాగంలోకి తీసుకొచ్చి రెండు కథలను మిక్స్ చేసిన విధానం మెప్పిస్తుంది. కథ ప్రారంభంలోనే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం, భర్త ఆత్మతో మాట్లాడాలని భార్య చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. కేవలం హారర్‌ మాత్రమే కాకుండా అన్నదమ్ముల మధ్య గొడవలు, సవతి చెల్లెలు వంటివి తీసుకొచ్చి కాస్తంతా వినోదాన్ని కూడా పంచారు. కవల సోదరులను కాపాడం కోసం డెబీ చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో వచ్చే హారర్‌ ఎలిమెంట్స్‌ థ్లిల్లింగ్‌గా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌తో పాటు మూడో భాగానికి లింకప్‌ చేసే సీన్స్‌ సర్‌ప్రైజ్‌ చేస్తాయి. అయితే పేలవమైన గ్రాఫిక్స్‌, కొన్ని సాగదీత సీన్స్‌, క్లైమాక్స్‌కు ముందు వచ్చే సీన్స్‌ మైనస్‌లుగా చెప్పవచ్చు. 

    టెక్నికల్‌గా

    టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి పనితీరు కనబరిచాడు. రెగ్యులర్‌ హారర్‌ చిత్రాల లాగా డార్క్‌ మోడ్‌లో కాకుండా కలర్‌ఫుల్‌గా చూపించి ఆకట్టుకున్నాడు. గ్రాఫిక్స్‌ విభాగం ఇంకాస్త బెటర్‌గా వర్క్‌ చేసి ఉంటే బాగుండేది. నేపథ్య సంగీతం బాగుంది. సన్నివేశాలపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్‌

    • కథ, స్క్రీన్‌ప్లే
    • అరుళ్‌ నిధి, ప్రియా భవానీ శంకర్‌ నటన
    • హారర్‌ అంశాలు, మలుపులు

    మైసన్‌ పాయింట్‌

    • పేలవమైన గ్రాఫిక్స్‌
    • కొన్ని బోరింగ్‌ సీన్స్‌

    Telugu.yousay.tv Rating : 3/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version