నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో రికార్డు వ్యూస్‌తో దూసుకు వెళ్తోంది. సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు సందడి చేయగా ఆ తర్వాత నుంచి స్టార్ హీరోలు వేదికపై మెరిశారు. ఇప్పటివరకూ దుల్కర్ సల్మాన్, సూర్య, అల్లు అర్జున్ ఈ షోలో పాల్గొని బాలయ్యతో తమ సీక్రెట్స్ పంచుకున్నారు. ఇప్పుడు ఈ వేదికపై స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela)తో పాటు, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) రాబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా పంచుకున్న ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
‘రీల్ అండ్ రియల్ జాతిరత్నం’
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ (Unstoppable) సీజన్ 4లో స్టార్ హీరోలు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఎపిసోడ్ సైతం బాలయ్య సిద్ధం చేశారు. ఈసారి స్టార్ హీరోయిన్ శ్రీలీలతో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి బాలయ్యతో ముచ్చట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరు షోలో పాల్గొన్న ఫొటోను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ తాజాగా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఇందులో జాతిరత్నాలు ఫోజు పెట్టి నవీన్ నవ్వులు పూయించాడు. ఇందులో బాలయ్య శ్రీలీలకు గిఫ్ట్ ఇస్తుండగా దూరంగా నిలబడి చేత్తో దాన్ని పట్టుకుంటున్నట్లు నవీన్ పోలిశెట్టి నిలబడ్డాడు. అచ్చం ఇలాగే జాతిరత్నాలు సినిమాలోనూ నవీన్ పోలిశెట్టి చేశాడు. దీంతో ఆ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి ఆహా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘రీల్ అండ్ రియల్ జాతిరత్నం ఆఫ్ ఇండియా’ అంటూ రాసుకొచ్చింది.
కారణం ఏమైనా ఉందా?
బాలయ్య టాక్ షో (Unstoppable)కు వచ్చిన మెజారిటీ సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చారు. మరికొందరు సింగిల్‌గానే షోలో పాల్గొని బాలయ్యతో సరదాగా గడిపారు. అయితే ఈసారి ఎపిసోడ్‌లో శ్రీలీల – నవీన్ పోలిశెట్టి ఇద్దరూ పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం వారిద్దరు కలిసి ఏ సినిమా చేయడం లేదు. గతంలో ఓ సినిమా పట్టాలెక్కుతున్నట్లు వార్తలు వచ్చినా అది వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో పర్టిక్యూలర్‌గా ఈ యువ హీరో, హీరోయిన్‌నే బాలయ్య పిలవడానికి కారణం ఏమైనా ఉందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే వారిద్దరిని బాలయ్య అడిగే ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య కొంటే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేక అల్లాడిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఎపిసోడ్ రిలీజయ్యాక ఆ ప్రశ్నలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
100% ఫన్ పక్కా
నవీన్ పోలిశెట్టి సినిమాల్లో ఏ విధంగా నవ్వులు పూయిస్తాడో బయట కూడా అదే విధంగా గిలిగింతలు పెడుతుంటాడు. ఏమాత్రం తడుముకోకుండా జోక్స్ వేస్తూ నవ్విస్తుంటాడు. మరోవైపు బాలయ్య అన్‌స్టాబుల్ షో ద్వారా తనలోని కామెడీ టైమింగ్‌కు మరింత పదును పెట్టారు. సరదా క్వశ్చన్స్ వేస్తూ సెలబ్రిటీలను ఇరాకటంలో పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు తొలిసారి ఒకే షోలో ఎదురుపడుతుండటంతో ఆ ఎపిసోడ్ కామెడీకి కేరాఫ్‌గా మారిపోతుందని నెటిజన్లు అంచనావేస్తున్నారు. 100% పక్కా ఎంటర్‌టైనింగ్‌గా ఈ ఎపిసోడ్ ఉండబోతుందని ఇప్పటి నుంచే కామెంట్స్ చేస్తున్నారు. ఈ కుర్ర హీరోను బాలయ్య ఓ ఆట ఆడుకోవడం ఖాయమని కూడా అంటున్నారు. ఈ శుక్రవారం (నవంబర్ 29) ఈ ఎపిసోడ్ (Unstoppable) స్ట్రీమింగయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్..
గతేడాది నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్క (Anushka Shetty) కాంబోలో వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ సక్సెస్ తర్వాత నవీన్ ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్‌లో చేతికి ఫ్రాక్చర్ కావడంతో గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు నయం కావడంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మరోవైపు శ్రీలీల విషయానికి వస్తే నితీన్‌తో చేసిన ‘రాబిన్‌హుడ్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’