జూ.ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala siva) దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవర’ (Devara) జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీ అయింది. ఇటీవల ముంబైలో ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో (Sandeep Reddy Vanga) ‘దేవర’ టీమ్ చిట్‌చాట్ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. సందీప్ అడిగిన ప్రశ్నలకు తారక్ తనదైన శైలిలో జవాబిచ్చారు.
ఫన్నీ చిట్‌చాట్..
యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ‘దేవర’ టీమ్ చిట్ చాట్ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో సందీప్ రెడ్డి వంగాతో పాటు తారక్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ పాల్గొన్నారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా అడిగిన ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ‘కచ్చితంగా చాలా భయంగా ఉంటుంది. నేను చాలా అడగాలని అనుకుంటున్నాను. ఎవరు స్టార్ట్ చేస్తారు’ అని సందీప్ రెడ్డి డైలాగ్‌తో ప్రోమో ప్రారంభమైంది. ఈ క్రమంలో తారక్ మాట్లాడుతూ దేవర యాక్షన్ డ్రామా అని, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్ గురించి చెప్పారు. 35 రోజులు అండర్ వాటర్ సీక్వెన్స్ చేసినట్లు ఎన్టీఆర్ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఆపై మీరు సినిమా కథ అంతా చెప్పేయమంటున్నారు అని జాన్వీ సందీప్‌పై పంచ్‌లు విసిరింది. ఈ సినిమా రన్ టైమ్ పై సందీప్ సరదాగా కామెంట్ చేశారు. దానికి తారక్ యానిమల్ రన్ టైమ్ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్ రెడ్డి వంగా చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఇక ఈ పూర్తి ఇంటర్యూ ఆదివారం నాడు రానుంది.
‘దేవర’ ప్రీ రిలీజ్‌కు మహేష్‌బాబు?
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మహేష్ బాబు రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ ఈవెంట్‌కు రావాలని మహేష్‌ను కోరినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై మహేశ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్‌తో దర్శకుడు కొరటాలకు మంచి అనుబంధం ఉంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో కొరటాల అతడికి మంచి విజయాలను అందించాడు. దీంతో మహేష్ పక్కాగా వచ్చే అవకాశముందని సినీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే ‘దేవర’పై అంచనాలు మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్‌లో ఈవెంట్
‘దేవర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను సెప్టెంబర్ 22న నిర్వహించాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‍లోనే ఈ ఈవెంట్ జరగనుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్‍లో ఈవెంట్ చేయాలని అనుకున్నా.. చివరికి హైదరాబాద్‍నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, దేవర చిత్రం నుంచి ఈ వారమే ట్రైలర్ రిలీజైంది. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అంచనాలను అందుకోవడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఎన్టీఆర్ యాక్షన్, కొరటాల టేకింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించింది.
సందీప్ మూవీలో తారక్!
ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్’ (Spirit)కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ మూవీలో తారక్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. స్పిరిట్‌లో విలన్‌గా నటించాలని తారక్‌ను సందీప్ కోరినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్ 2’ చిత్రంలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను విలన్‌గా ఎంత ప్రభావం చూపగలడో ‘జై లవకుశ’ చిత్రం ద్వారా తారక్ ఇప్పటికే నిరూపించాడు. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేయగా అందులో ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో గ్లోబల్ స్థాయిలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీలో తారక్ విలన్‌గా చేస్తే బాగుటుందని సందీప్ రెడ్డి వంగా భావించినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఇందుకు తారక్ అంగీకరిస్తే ‘స్పిరిట్’పై అంచనాలు అమాంతం పెరగటం ఖాయమని అంటున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?