Devara Story Leak: ‘దేవర’ స్టోరీ లీక్‌? టీడీపీని ఇరుకున పెట్టేలా కథనం!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara Story Leak: ‘దేవర’ స్టోరీ లీక్‌? టీడీపీని ఇరుకున పెట్టేలా కథనం!

    Devara Story Leak: ‘దేవర’ స్టోరీ లీక్‌? టీడీపీని ఇరుకున పెట్టేలా కథనం!

    September 3, 2024

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వంటి గ్లోబల్‌ స్థాయి హిట్‌ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr. NTR) చేస్తోన్న చిత్రం ‘దేవర’ (Devara: Part 1). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండటం, సైఫ్ అలీఖాన్‌ లాంటి దిగ్గజ నటుడు విలన్‌ పాత్ర పోషిస్తుండటం సినిమాపై హైప్‌ క్రియేట్ చేసింది. చక చకా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో తారక్‌ డ్యుయల్‌ రోల్‌ పోషిస్తుండటంతో అసలు ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా? అని నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ తెగ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ‘దేవర’ స్టోరీకి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి ఏపీని కుదిపేసిన యథార్థ సంఘటన నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా ఘటన? దేవర స్టోరీ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. 

    ‘దేవర’ స్టోరీ అదేనా?

    ‘దేవర’ చిత్ర కథను కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని దర్శకుడు కొరటాల శివ రాసుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం దళితులపై గతంలో జరిగిన క్రూరమైన హత్యాకాండకు సంబంధించి ఈ మూవీ తెరకెక్కినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నట్లు సమచారం. 1985లో ఏపీలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ను ‘దేవర’ చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

    టీడీపీని ఇరకాటంలో పడేస్తుందా?

    1985లో ‘కారంచేడు ఘటన’ జరిగినప్పుడు నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆయన దళితుల కోసం చాలా కొత్త చట్టాలను తీసుకువచ్చారు. అయినప్పటికీ ఇది ఆయన ప్రభుత్వానికి మాయని మచ్చలా ఉండిపోయింది. ఏళ్లు గడుస్తున్నప్పటికీ అప్పటి రక్తం మరకలు టీడీపీ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో మళ్లీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ‘దేవర’ సినిమాతో మరోమారు ఈ అంశం తెరపైకి వస్తే ఇది చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని ఇరాకటంలో పడేసే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పైగా తెలుగు దేశం పార్టీ, బాలకృష్ణతో ఎన్టీఆర్‌కు మనస్పర్థలు తలెత్తినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాలో కారంచేడు ఘటనను చూపిస్తే ఈ దూరం మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

    సోషల్‌ మెసేజ్‌ తప్పనిసరి!

    తెలుగులో మంచి క్రేజ్ ఉన్న దర్శకుల్లో కొరటాల శివ (Koratala Siva) ఒకరు. ఆయన ఇప్పటివరకూ తీసిన ప్రతీ సినిమాలోనూ ఏదోక సందేశాన్ని ఇస్తూనే వచ్చారు. లేదంటే సామాజిక అంశాన్నైనా టచ్‌ చేస్తూ వచ్చారు. ‘మిర్చి’ చిత్రంలో ఫ్యాక్షన్‌ గొడవలను, ‘శ్రీమంతుడు’ సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ‘జనతా గ్యారేజ్‌’లో బలహీనులకు అండగా నిలబడటం, ‘భరత్‌ అనే నేను’ సినిమాలో రాజకీయాల్లో జవాబుదారి తనం, ‘ఆచార్య’ చిత్రంలో నక్సలైట్‌ ఉద్యమాన్ని చూపించారు. అలాగే ‘దేవర’ కథలో కారంచేడు విషాద ఘటన తాలూకా సీన్లు ఉండే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

    మూడో సాంగ్‌ వచ్చేస్తోంది..

    దేవర సినిమా నుంచి సెప్టెంబర్ 4వ తేదీన మూడో పాట రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఓ పోస్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించింది.  ‘దావుడి’ అంటూ ఈ డ్యూయోట్‌ సాంగ్‌ సాగనున్నట్లు తెలిపింది. ‘ఇది కచ్చితంగా అదిరిపోతుంది. ప్రతీ బీట్‍ కూడా విజిల్ వేసేలా ఉంటుంది. సెప్టెంబర్ 4న దావుడి’ అంటూ సోషల్ మీడియాలో దేవర టీమ్ రాసుకొచ్చింది. తాజా పోస్టర్‌లో తారక్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో ఉండగా వైట్‌ కలర్‌ డ్రెస్‌లో జాన్వీ మెస్మరైజ్‌ చేసింది. తారక్‌ అలా వెనక్కి వాలుతుండగా ఆయనను జాన్వీ రొమాంటిక్‍గా పట్టుకున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్స్ అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తోంది.

    తారక్‌ పెద్ద మనసు

    తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వరద సహాయ చర్యల కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. తన వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా తారక్‌ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ సాయం ప్రకటించిన కాసేపటికే మరో యువ నటుడు విశ్వక్సేన్ కూడా తన వంతు విరాళాన్ని అందించడం విశేషం. తాను కూడా రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. కష్ట కాలంలో అండగా నిలిచిన ఈ ఇద్దరు హీరోలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version