అతిలోక సుందరిని మరిపిస్తున్న దిపాలి చౌదరి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అతిలోక సుందరిని మరిపిస్తున్న దిపాలి చౌదరి

    అతిలోక సుందరిని మరిపిస్తున్న దిపాలి చౌదరి

    వ్యక్తిని పోలిన వ్యక్తులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని చెబుతారు. ఆ విషయాన్ని నిజం చేసింది. దిపాలి చౌదరి. దిపాలి ఇన్ స్టాలో చేసే పోస్టులను చూసే వారు అసలు రియల్ శ్రీదేవే మరలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇది చూసి దిపాలిని ఫాలో అయ్యే వారి సంఖ్య 30 వేలకు చేరుకుంది. ప్రస్తుతం దిపాలిని 31k పైచిలుకు ఫాలో అవుతున్నారు. 

    వీడియోలు చూస్తే.. 

    దిపాలి చౌదరి అలనాటి అందాల తార శ్రీదేవి వీడియోలను డబ్ స్మాష్ చేస్తూ ఉంటుంది. అలా దిపాలి పోస్ట్ చేసిన వీడియోలను చూసిన వారు శ్రీదేవే దివి నుంచి దొగొచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారు. 

    పెరుగుతున్న ఫాలోయింగ్.. 

    శ్రీదేవిని మరిపిస్తున్న దిపాలికి రోజురోజుకూ ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్రస్తుతం దిపాలిని 31 వేల మంది ఇన్ స్టా యూజర్లు ఫాలో అవుతున్నారు. ఈ సంఖ్య పెరుగుతూ పోతుంది. 

    శ్రీదేవి కూతుళ్లకు రాని పోలికలు.. 

    అందాల తార శ్రీదేవికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కానీ వారెవర్ని చూసినా కానీ శ్రీదేవిని చూసినట్లు అనిపించదు. కానీ శ్రీదేవితో ఎటువంటి సంబంధం లేని దిపాలిని చూస్తే మాత్రం అచ్చం శ్రీదేవిని చూసినట్లే అనిపిస్తుంది. 

    బోనీతో ఏడడుగులు.. 

    1996లో అతిలోక సుందరి శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ని మనువాడింది. కానీ అప్పటికే బోనీకి పెళ్లయింది. మోనా శౌరీతో వివాహమైన బోనీకి అర్జున్ కపూర్ (ప్రస్తుత బాలీవుడ్ హీరో), అన్షులా కపూర్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. 

    శ్రీదేవిని గుర్తు తెచ్చుకున్న బోనీ కపూర్ 

    2018 ఫిబ్రవరి 24 న దుబాయ్‌లో తనువు చాలించిన శ్రీదేవిని ఇప్పటికీ ఆమె అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. శ్రీదేవి కూతురు జన్వీ బాలీవుడ్ తెరంగ్రేటం చేసి హిట్లు కొట్టినా కానీ శ్రీదేవి అభినయాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. శ్రీదేవి భర్త బోనీ కపూర్ కూడా శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. ఆయన తన ఇన్ స్టా ప్రొఫైల్‌లో శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో అతిలో సుందరి తళతళా మెరుస్తోంది. నవ్వులు చిందిస్తూ తన భర్త బోనీ చేతిని పట్టుకుని కూర్చున్న ఈ ఫొటో అభిమానులకు కనులవిందు చేస్తోంది. 

    శ్రీదేవి అభినయం గుర్తుకు తెస్తున్న దిపాలి…

    నెమ్మదిగా అతిలోక సుందరి జ్ఞాపకాల నుంచి బయట పడుతున్న ఆమె అభిమానులు దిపాలి రూపంలో శ్రీదేవిని మరో సారి గుర్తు చేసుకుంటున్నారు. 

    అచ్చు గుద్దినట్టు 

    అతిలోక సుందరే వచ్చిందా అన్నట్లు అచ్చు గుద్దిన దిపాలి వీడియోలను చూడండి..  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version