ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని కావ్యాథాపర్ జంటగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్‘ భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ‘స్కంద‘ పరాజయం తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) కలిసి చేసిన సినిమా కావడంతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోనూ ఈ చిత్రంపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రామ్- పూరి కాంబో మరోసారి హిట్ అయిందా? లేదా? ఈ సమీక్షలో చూద్దాం.
కథేంటి?
మాఫియా డింపుల్ బిగ్ బుల్(సంజయ్ దత్) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. (Double iSmart Review)ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్ బ్రేయిన్‌లోకి బిగ్ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? మళ్లీ బిగ్ బుల్, ఇస్టార్ట్ శంకర్ ఎందుకు తలపడుతారు? కావ్యా థాపర్‌కు శంకర్‌కు మధ్య సంబంధం ఏమిటి? బోకా(అలీ) క్యారెక్టర్‌కు ఈ చిత్రంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి అన్నది మిగతా సినిమా.
సినిమా ఎలా ఉందంటే?
ఫస్టాఫ్ లవ్, కామెడీ ట్రాక్‌తో ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ డైలగ్‌లతో మాస్ జాతర ఉంటుంది. పూరీ జగన్నాథ్ మార్క్ పంచ్ డైలాగ్‌లు తన స్టైల్ కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు రివీల్ అవుతుంటాయి. ముఖ్యంగా రామ్- సంజయ్ దత్‌ల మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అలాగే డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. తెలంగాణ స్లాంగ్‌లో రామ్ చెప్పే సామెతలు సూపర్బ్‌గా పేలాయి. రామ్- కావ్యాథాపర్ మధ్య రొమాంటిక్ సీన్స్, అలాగే రామ్- సంజయ్ దత్‌ల మధ్య మైండ్ గేమ్, మదర్ సెంటిమెంట్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అలరించాడు.అలీ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.
ఎవరెలా చేశారంటే?
ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ పొత్తినేని యాక్టింగ్ ఇరగదీశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా కంటే ఈ చిత్రంలో రామ్ యాక్టింగ్ ట్రిపుల్ టైమ్ మాస్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. తన ఎనర్జీకి మించి కష్టపడ్జాడని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక విలన్ బిగ్ బుల్‌గా సంజయ్ బాబా యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. (Double iSmart Review) తన పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. హీరోయిన్ జన్నత్‌గా కావ్యాథాపర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక సీబీఐ అధికారిగా షియాజీ షిండే, బన్నీ జయశంకర్, రామ్ తల్లిగా ఝాన్సీ, బొకాగా అలీ, రామ్ స్నేహితుడిగా గెటప్ శ్రీను తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
లైగర్ ప్లాఫ్ తర్వాత పూరి జగన్నాథ్ చాలా శ్రద్ధగా కథను రాసుకున్నట్లు ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాతో పూరి తిరిగి కమ్‌బ్యాక్ అయ్యారని చెప్పవచ్చు. తాను అనుకున్న స్టోరీని బాగా తీశాడు. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. యూత్‌ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. తనదైన మార్క్ సింగిల్ లైన్ పంచ్ డైలాగ్‌లతో మరోసారి పాత తరం పూరిని పరిచయం చేశాడు. మదర్ సెంటిమెంట్ బాగున్నా(Double iSmart Review) ఇంకాస్తా ఎలివేట్ చేస్తే బాగుండేది అనిపించింది. ఓవరాల్‌గా యూత్‌ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో సినిమా తీయడంలో పూరి సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. మణిశర్మ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. జియాన్ కే గియాన్ హెల్లి, శ్యామ్ కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా ఈ సినిమా మాస్ పీస్ట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్
రామ్ పొత్తినేని నటన
పూరి డైరెక్షన్
సంజయ్ దత్- రామ్ మధ్య సీన్లు
మైనస్ పాయింట్స్
లెంగ్తీగా ఉన్న అలీ కామెడీ ట్రాక్
కొన్ని పాటలు
తీర్పు: ఓవరాల్‌గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్