Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రూ.100 కోట్లు కొల్లగొడుతాడా? గతం ఏం చెబుతుంది?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రూ.100 కోట్లు కొల్లగొడుతాడా? గతం ఏం చెబుతుంది?

    Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రూ.100 కోట్లు కొల్లగొడుతాడా? గతం ఏం చెబుతుంది?

    May 14, 2024

    ఎనర్జిటిక్ హీరో రామ్ పొత్తినేని, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్(Double iSmart). ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ఈ చిత్రం పూరి జగన్నాథ్, రామ్ కెరీర్‌కు కీలకం కానుంది. ఎందుకంటే పూరి తీసిన ‘లైగర్’(Liger) ఘోర పరాజయం చవిచూడటం.. రామ్ నటించి రెడ్, స్కంద చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో..వీరి కలయిక మళ్లీ అనివార్యమైంది. గతంలో  వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. మనిషి మెడదులో వేరే వ్యక్తి ఆలోచనలకు సంబంధించిన చిప్ పెడితే ఎలా ప్రవర్తిస్తాడు అనే వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చి మంచి విజయం సాధించింది.  రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. మే 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఒక రకమైన బజ్ ఏర్పడింది. 

    రూ.100 కోట్లు కొల్లగొట్టే ఛాన్స్

    అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇండియాలో రూ.66 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ఈ సినిమాకు వస్తున్న సీక్వెల్‌ డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంపై సహజంగానే అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందా? కనీసం దరిదాపుల్లోకైనా వస్తుందా అనే అంశాలపై చర్చ జరుగుతుంది.

    టాలీవుడ్‌లో టైర్ 2 హీరోగా రామ్ పొత్తినేని ఉన్నప్పటికీ టైర్ 1 హీరో స్థాయిలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన మాస్ యాక్టింగ్, డాన్సింగ్‌తో ప్రేక్షకులను అలరించడంలో ఏమాత్రం తగ్గడు. ఇప్పటికే ఈ విషయం అతని సినిమాల ద్వారా నిరూపితమైంది. రామ్ పొత్తినేని- పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా వస్తుండటం, ఇస్మార్ట్ శంకర్ చిత్రం హిట్ అవడం వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇది డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి అనుకూలంశాలు. ఇవన్నీ ప్రేక్షకులను మొదటి రెండు రోజులు సినిమా థియేటర్లకు రప్పించేలా చేశాయి.  

    ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో బరిలో దిగిన ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఓవరాల్‌గా రూ.80 కోట్లు కలెక్ట్ చేసి రామ్ పొత్తినేని సత్తా చాటాడు. దీంతో ఈ సినిమాకు కొనసాగింపుగా పూరి.. డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక రోల్‌లో నటిస్తున్నారు. తాజాగా విడుదలే చేసిన టీజర్ ప్రోమో ఆకట్టుకుంది. రామ్ గెటప్‌, స్వాగ్ కూడా చాలా బాగున్నాయి. ప్రోమోపై ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. మే 15న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. మరి ఈ టిజర్ టాక్ ప్రి రిలీజ్ బిజినెస్‌పై ప్రభావం చూపనుంది. డబుల్ ఇస్మార్ట్‌ చిత్రానికి రూ.100కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. పూరి- రామ్ హిటో కాంబో కావడంతో.. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ భారీ ధరకు చేజిక్కించుకునేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీపడుతున్నాయి.  ఇప్పటికే చిత్రబృందానికి మంచి నంబర్ ఆఫర్ చేసినట్లు తెలిసింది.

    కథ ఇదేనా?

    ప్రస్తుతం డబుల్‌ ఇస్మార్ట్‌ (Double iSmart Movie) సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో రామ్‌ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపిస్తాడని సమాచారం. యాక్షన్‌ – థ్రిల్లర్‌ నేపథ్యంలో ఇది సాగుతుందని అంటున్నారు. పైగా తొలి భాగంతో పోలిస్తే సెకండ్‌ పార్ట్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఎక్కువగానే ఉండనుందట. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. 

    పట్టుదలతో పూరి

    డబుల్ ఇస్మార్ట్‌ మూవీని డైరెక్టర్‌ పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆయన గత‌ మూవీ ‘లైగర్‌’ (Liger Movie) బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలం కావడంతో పూరీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమాకు ముందు ఆయన చేసిన కామెంట్స్‌ కూడా ఇందుకు కారణమయ్యాయి దీనిని అద్భుతంగా తెరకెక్కించి తనపై వచ్చిన విమర్శలకు చెక్‌ పెట్టాలన్న కసిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. 

    పాన్‌ ఇండియా రేంజ్‌లో..

    ఆ కారణంగానే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను పాన్‌ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్‌ రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని కేవలం సింగిల్‌ లాంగ్వేజ్‌ (తెలుగు)లో రిలీజ్‌ చేసిన పూరి.. సెకండ్‌ పార్ట్‌ను మాత్రం దేశంలోని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తద్వారా తన క్రేజ్‌ను జాతీయ స్థాయికి చేర్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాక్‌. ఇందులో భాగంగానే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

    హీరో రామ్‌కూ కీలకం!

    ఇక హీరో రామ్‌ కూడా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double iSmart Movie) చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘స్కంద’ (Skanda) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. పైగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ కూడా వచ్చాయి. బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలో యాక్షన్‌ మరి ఓవర్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అటు ఈ చిత్రానికి ముందు రామ్‌ చేసిన ‘వారియర్‌’ (Warrior Movie In Telugu)) కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. దీంతో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీ రామ్‌కు ఎంతో కీలకంగా మారింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version