EXCLUSIVE : ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • EXCLUSIVE : ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!

    EXCLUSIVE : ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!

    April 24, 2024

    యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen).. ఇటీవల ‘గామి’ (Gaami) సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. డిఫరెంట్‌ స్టోరీ లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో అఘోరా శంకర్‌ పాత్రలో అదరగొట్టాడు. మరోవైపు విశ్వక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మెున్నటి వరకూ ఎలాంటి అప్‌డేట్‌ లేని ఈ చిత్రం నుంచి టీజర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌ అవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. వాస్తవానికి గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి గతే ఏడాదే రిలీజ్‌ కావాల్సింది. రిలీజ్‌ తేదీని ప్రకటించి కూడా పలుమార్లు సినిమాను వాయిదా వేశారు. అందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం. 

    పోస్ట్‌పోన్‌పై విష్వక్‌ అసహనం!

    గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి చిత్రానికి ఛల్‌ మోహన్‌ రంగ ఫేమ్‌ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా చేసింది. మే 17న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండటంతో ఏప్రిల్‌ 27 సా. 4.01 గం.లకు టీజర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రం 2023 డిసెంబర్లోనే రిలీజ్‌ అవ్వాల్సింది. అయితే ‘హాయ్ నాన్న’ (Hi Nanna), ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) వంటి సినిమాలతో పోటీ కారణంగా ఆ సినిమాను నిర్మాతలు వాయిదా వేశారు. ఒకవేళ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి అనుకున్న సమయానికి రాకపోతే తాను ఆ సినిమాను ప్రమోట్‌ చేయనని అప్పట్లో విశ్వక్‌ ప్రకటించడం వివాదస్పదంగా మారింది. 

    నిర్మాత రియాక్షన్‌ ఇదే!

    ఆదికేశవ’ ప్రమోషన్‌ ఈవెంట్‌ సందర్భంగా అప్పట్లో నిర్మాత నాగ వంశీ.. విష్వక్‌ వ్యాఖ్యలపై స్పందించారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్‌ 8న విడుదల చేయాలన్నది విష్వక్‌ మాటల వెనక ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. తమ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సందర్భంలో వరుణ్‌ తేజ్ నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ పోటీకి సిద్ధంగా ఉందని అన్నారు. అనుకోకుండా హాయ్‌ నాన్న, ఎక్ట్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌, సలార్‌ తెరపైకి వచ్చాయని పేర్కొన్నారు. అంత కాంపింటీషన్‌కు వెళ్లి సినిమాను రిలీజ్‌ చేయడం ఎందుకని అంటానని భావించి  విష్వక్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని నాగ వంశీ అభిప్రాయపడ్డారు. సినిమా షూటింగ్‌ దశలోనే ఉన్నందున దీనిపై ఇద్దరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఏదోక కారణంతో వాయిదా పడుతూనే వచ్చింది. 

    ఐటెం సాంగ్‌తో గ్యాప్

    ఈ ఏడాది ప్రారంభంలోనే గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిని రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ అది జరగలేదు. ఐటెం సాంగ్‌ షూట్‌లో జరిగిన మార్పు వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యమైంది. తొలుత ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ కోసం ఈషా రెబ్బను మూవీ టీమ్ ఎంపిక చేసింది. ఒక రోజు షూటింగ్‌ కూడా నిర్వహించింది. మళ్లీ ఈషాను కాదని ఆమె స్థానంలో అయేషా ఖాన్‌ను రంగంలోకి దింపారు. అటు ఇళయరాజా ఇంట విషాధం కూడా ఈ మూవీ వాయిదాకు కారణమైంది. ఈ చిత్రానికి ఇళయరాజా తనయుడు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. జనవరి 25న అతడి సోదరి చనిపోవడంతో అతను సినిమా పనుల్లో పాల్గొనలేకపోయారు. దీంతో టెక్నికల్‌ వర్క్‌ పనులు ఆలస్యం అయ్యాయి. 

    ఈ సారి విశ్వక్ వల్లే వాయిదా?

    దీంతో మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సినిమాను రిలీజ్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ శివరాత్రికి ‘గామి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు విశ్వక్‌ అనౌన్స్‌ చేశారు. దీంతో వెనక్కి తగ్గిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి యూనిట్‌ ఎప్పటిలాగే సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మే 17న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్‌ చేయాలని సంకల్పంతో ఉన్నారు. సినిమా ప్రమోషన్స్‌పైనా టీమ్‌ ఫోకస్‌ పెట్టింది. నెల రోజుల క్రితం అయేషా ఖాన్‌ నటించిన ‘మోతా’ అనే ఐటెం సాంగ్‌ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. లేటెస్ట్‌గా టీజర్‌ అప్‌డేట్‌ను ఇచ్చింది. త్వరలోనే ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేయాలని మూవీ టీమ్‌ భావిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version