1983 వరకూ ప్రపంచ క్రికెట్‌లో పసికూనలుగా ఉన్న భారత జట్టు ఒక్కసారిగా విండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతలుగా నిలిచింది. 83 వరల్డ్‌కప్ రోజుల్లో ఎవరెలా పర్ఫామ్ చేశారు. ఎవరి స్థితిగతలు ఎలా ఉన్నాయి అనే అంశం మీద స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఉద్విగ్నభరిత క్షణాల సమాహారమే 83.
స్టార్ కపుల్ జంటగా..
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే ఈ సినిమాలో జంటగా కనిపించారు. ఇప్పటికే వీరిద్దరూ జంటగా నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి. కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్‌గా నిలుస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.
హర్యానా.. హరికేన్
కపిల్ దేవ్‌ని ముద్దుగా హర్యానా హరికేన్ అని పిలుస్తారు. కపిల్ దేవ్ పూర్తి పేరు కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్. ఛండీగఢ్‌లో జన్మించిన కపిల్ దేశవాళీ పోటీల్లో హర్యానాకు ప్రాతినిధ్యం వహించేవాడు. కపిల్ దేవ్ గొప్ప బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు. ప్రత్యర్థులకు దడ పెంచే రీతిలో బౌలింగ్ కూడా చేయగలడు. కపిల్ తన కెరీర్లో 131 టెస్టులు, 225 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 5,248 పరుగులు, వన్డేల్లో 3,783 పరుగులు చేశాడు. ఇంతే కాకుండా కపిల్ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. మొత్తంగా కలిపి 687 వికెట్లు తీసుకున్నాడు.
తెలుగులో రిలీజ్ చేస్తున్న మన్మధుడు
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. నాగ్ తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను డిసెంబర్ 24న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాడు.
తీరనున్న ఫ్యాన్స్ కోరిక
క్రికెట్ ఫ్యాన్స్ కోరిక ఈ సినిమాతో నెరవేరనుంది. 1983 విన్నింగ్ మూమెంట్లను చూడని వారు చూసి థ్రిల్ ఫీలయ్యే చాన్స్ ఉంది. ఈ సినిమా కోసం రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఇతర నటీనటులు క్రికెట్ నేర్చుకున్నారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి